వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పటిష్టత కి కృషి చేయాలి:మాజీ మంత్రి వర్యులు,పార్టీ పొలిటికల్ అడ్వైజర్ కమిటీ సభ్యులువిడదల రజిని…

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పదవులు పొందిన నాయకులు పార్టీ పటిష్టత కి కృషి చెయ్యాలని మాజీ మంత్రి విడదల రజిని సూచించారు.ఈ రోజు చిలకలూరిపేట పట్టణ అధ్యక్షుడుగా షేక్ దరియవలి,రూరల్ మండలం అధ్యక్షుడుగా దేవినేని శంకర్ రావు,నాదెండ్ల మండలం అధ్యక్షుడుగా మంగు ఏడుకొండలు,యడ్లపాడు మండలం అధ్యక్షుడుగా వడేపల్లి నరసింహా రావు{రాజు}నియమితుపైన సందర్బంగా ఈరోజు మాజీ మంత్రి విడదల రజిని ని వారి నివాసంలో కలసి వారువివిధహోదాల్లోనియమించినందుకు కృతజ్ఞతలు తెలియచేశారు.ఈ సందర్భంగా రజిని మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నీ నమ్ముకొని కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికి పార్టీ అండగా ఉంటుందని తెలిపారు మరియు జగనన్న హయంలో మనం ప్రజలకి చేసిన మేలు,ప్రజల పట్ల మనం చూపిన ప్రేమ నేడు ప్రస్తుత తెలుగుదేశం ప్రభుత్వం లో కరువయ్యాయని,మనం చేసిన మంచి ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందని ప్రతి పేదవాడికి మనం చేసిన సంక్షేమం, చేసిన అభివృధి ఎప్పటికీ మర్చిపోరు కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు అని తెలిపారు.రాబోయే రోజుల్లో అందరం కష్టపడి పని చేసి జగన్ మోహన్ రెడ్డి ని తిరిగి ముఖ్యమంత్రి చెయ్యడమే లక్ష్యంగా ముందుకు సాగాలని కోరారు.ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు

Share.
Leave A Reply