హత్య కేసును చేదించిన చిలక లూరిపేట రూరల్ పోలీసులు

చాకచక్యంగా వ్యవహరించి కేసును ఛేదించిన చిలకలూరిపేట రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ బి. సుబ్బానాయుడు, సిబ్బందిని అభినందించిన పల్నాడు జిల్లా ఎస్పీ

కేసు వివరాలు

క్రైమ్ నంబర్: Cr.No.57/2025 u/s 103(1) BNS
పోలీస్ స్టేషన్: యడ్లపాడు
మృతుడు
పేరు: తుని కులదీప్ W/o జగర్నాథ్ కులదీప్
వయసు: 35 సంవత్సరాలు
కులం: హరి
చిరునామా: ఘటిగూడ, నబరంగ్‌పూర్, ఒడిశా రాష్ట్రం. ప్రస్తుతం శ్రీ మంజునాథ్ స్పిన్నింగ్ మిల్, తిమ్మాపురం గ్రామం, యడ్లపాడు మండలం.

నిందితుడు

పేరు: మంగులు S/o ఆదీలంక
వయసు: 25 సంవత్సరాలు
కులం: అలీయా
చిరునామా: బోలోసరా గ్రామం, ముక్త మలసాహి మండలం, గంజాం జిల్లా, ఒడిశా రాష్ట్రం. ప్రస్తుతం శ్రీ మంజునాథ స్పిన్నింగ్ మిల్, తిమ్మాపురం గ్రామం, యడ్లపాడు మండలం.జరిగిన సంఘటన
ఈ కేసులో ఫిర్యాది అయిన రుని జగన్నాథ్ (జగన్నాథ్ కులదీప్ భార్య) తన భర్తతో కలిసి యడ్లపాడు మండలం, తిమ్మాపురం గ్రామంలోని శ్రీ మంజునాథ్ స్పిన్నింగ్ మిల్ లో సుమారు ఆరు నెలల నుండి పని చేస్తున్నారు. ఫిర్యాది తన బంధువులు చనిపోగా తన పిల్లలతో సొంత ఊరు వెళ్లారు. 2025 జూన్ 10వ తేదీ రాత్రి సుమారు 11 గంటల సమయంలో మంగులు లంకా తన స్నేహితులతో బయటకు వెళ్లి తిరిగి క్వార్టర్స్‌కు వస్తుండగా, క్వార్టర్స్ బయట జగన్నాథ్ కులదీప్ కనిపించాడు.
జగన్నాథ్ కులదీప్ మంగులు లంకాను పలకరించి, “నీ భార్య ఎప్పుడు వస్తుంది?” అని అడిగాడు. దీనితో నిందితుడు కోపగించుకున్నాడు. నిందితుడు, “ఎందుకు అలా కోపగించుకుని మాట్లాడుతున్నావు, నీ భార్య ఇంకా రాలేదా?” అని అడిగాడు. దీనికి జగన్నాథ్ కులదీప్, “నేను అడిగాను” అనగా, “ఇప్పటికి వారం రోజులనుండి నా భార్య గురించి అడుగుతున్నావు. నా భార్య ఎప్పుడొస్తే వీలైనప్పుడు వస్తుంది” అని నిందితుడిని అసభ్యకరంగా తిట్టినట్లు తెలిసింది.
దీనితో నిందితుడికి కోపం వచ్చి, “ప్రతిసారి నాపై ఇలానే కోప్పడుతున్నావు. ఈరోజు ఎలాగైనా నీ అంతు చూస్తాను” అని చెప్పి, జగన్నాథ్ కులదీప్‌ను చంపాలని నిర్ణయించుకున్నాడు. నిందితుడు ఉంటున్న B-బ్లాకులోని రూము నంబరు – 32లోకి వెళ్లి కూరగాయలు కోసుకునే స్టీల్ బాకు తీసుకొని తిరిగి జగన్నాథ్ కులదీప్ దగ్గరకు వచ్చాడు. మళ్లీ జగన్నాథ్ కులదీప్, “ఏరా మళ్లీ వచ్చావు” అంటూ తిట్టడం మొదలుపెట్టినట్లు. వెంటనే నిందితుడు చంపాలనే ఉద్దేశ్యంతో జగన్నాథ్ కులదీప్‌ను తాను తెచ్చిన బాకుతో పొట్టలో పొడిచాడు. బాకు అతని పొట్ట ఎడమవైపున లోపలికి దిగి రక్తగాయం అయ్యింది. ఆ తర్వాత చికిత్స పొందుతూ చనిపోయాడు.
దర్యాప్తుపల్నాడు జిల్లా ఎస్పీ కె. శ్రీనివాసరావుఆదేశాల మేరకు నరసరావుపేట డీఎస్పీ కె. నాగేశ్వర రావు పర్యవేక్షణలో చిలకలూరిపేట రూరల్ సీఐ బి. సుబ్బానాయుడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, నిందితుడి ఆనవాళ్లను గుర్తించి, దర్యాప్తు చేసి, 2025 జూన్ 16వ తేదీ ఉదయం 11:00 గంటలకు యడ్లపాడు మండలం, తిమ్మాపురం గ్రామంలోని SK JB కాటన్ జిన్నింగ్ మిల్ వద్ద నిందితుడిని అరెస్ట్ చేశారు.ఈ కేసును చాకచక్యంగా ఛేదించిన చిలకలూరిపేట రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ బి. సుబ్బానాయుడు, యడ్లపాడు ఎస్.ఐ. టి. శివరామకృష్ణ, మరియు సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు

Share.
Leave A Reply