మాచర్ల నియోజకవర్గం దుర్గి మండలంలో.. ముటుకూరు గ్రామం నుండి చంద్ర కుంట తండా వెళ్లే రోడ్డు.. రాళ్లు రప్పలతో, ముళ్ళ కంపలతో మూసుకుపోయి రాకపోకలకు వీలు లేక ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి.

ప్రస్తుతం టిడిపి ఫ్లోర్ లీడర్, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు నిర్వహిస్తున్న గ్రామాల్లోని పొలాలు డొంకలు అభివృద్ధిలో భాగంగా.. ఈ రహదారికి మోక్షం కలిగింది.

ఎంపీ శ్రీ కృష్ణ దేవరాయలు గారు, మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానంద రెడ్డి గారు, నాయకులు, రైతులు ప్రోద్బలంతో.. సుమారు 6కి. మీ మేర గ్రావెల్ రోడ్డు గా సర్వాంగ సుందరంగా అభివృద్ధి చెందింది. ఈ రెండు గ్రామాలకు మధ్య కనెక్టివిటీ పెరిగి ప్రజలకు మార్గం ఏర్పడింది.

Share.
Leave A Reply