గత ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాల ఫలితాలే ఈ బలవన్మరణాలు – తెదేపా నేతలు
నాదెండ్ల గ్రామం మరియు నాదెండ్ల మండలంలోని తుబాడు గ్రామంలో ఇరువురు రైతులు సోమవారం బలవన్మరణానికి పాల్పడటానికి కారణం గత వైకాపా ప్రభుత్వం పాలించిన 5 సంవత్సరాలలో , వారు అవలంబించిన రైతు వ్యతిరేక విధానాలే కారణం అని తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపించారు. మాజీ మంత్రి విడదల రజిని మరియు వైకాపా నేతలు ఇటివల కొద్ది కాలం నుండి శవ రాజకీయాలు మొదలు పెట్టారని, గత 5,6 సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తూ, నష్టాల పాలై అప్పుల ఊబిలోకి కూరుకుపోయి, తప్పని పరిస్థితులలో ఆత్మహత్యకు పాల్పడిన రైతులకు ఏ విధంగా సాయం అందించి ఆదుకోవాలి అనే స్పృహ కోల్పోయి, కేవలం పబ్లిసిటీ స్టంట్ లో భాగంగా ఎవరూ చనిపోయిన రైతులను పరామర్శించలేదు, ఆదుకోలేదు అని అవాకులు, చవాకులు పెడుతుందని వారు తెలిపారు. ఇరువురు రైతుల ఆత్మహత్యల పట్ల మాజీ మంత్రి వర్యులు, స్థానిక శాసన సభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తన సానుభూతిని వారి కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా తెలియజేసారని, పార్టీ నేతలను తక్షణమే వెళ్లి మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా అందాల్సిన సాయాన్ని వెంటనే అందించేలా చర్యలు తీసుకోవాలనని కోరారు
Trending
- దత్త సాయి సన్నిధి లో విష్ణు సహస్ర నామ పారాయణ భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమం —-
- డీఎస్సీ నియామకాలను వెంటనే చేపట్టాలి -ఎస్టీయూ
- ఆగస్ట్ 15 తర్వాత సంక్షేమం అమల్లో దేశంలో ఏపీనే టాప్ : ప్రత్తిపాటి.
- సోనా ప్రసాద్ చేస్తున్న పాదయాత్రకు మద్దతు తెలియజేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు
- మర్రి శ్రీనాథ్ పుట్టినరోజు వేడుకలు
- జనసేన ఆధ్వర్యంలో పట్టణంలో 26వ వార్డులో వృద్ధురాలికి చేయూత
- యోగాంధ్రతో ప్రపంచ రికార్డు
- వినియోగదారుల హక్కుల పోస్టర్ ను ఆవిష్కరించిన తహసిల్దార్ షేక్ మొహమ్మద్ హుస్సేన్