నిఘా నేత్రం లో చిలకలూరిపేట పట్టణం దేవాలయాలు, మసీదు లు, చర్చిలు వద్ద నిఘా కెమెరాలు తప్పనిసరి-అర్బన్ CI రమేష్ పోలీసు స్టేషన్లో సచివాలయ మహిళ పోలీసు సిబ్బంది తో సమావేశమైన-CI రమేష్ పట్టణంలో ఇళ్లకు, దేవాలయాలకు, మసీదు లకు, చర్చిలకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి.-CI రమేష్ నిఘా కెమెరాలు ఏర్పాటు చేసే విధంగా సచివాలయం సిబ్బంది అవగాహన కల్పించాలి-CI నిఘా పరికరాలు తో పాటు మహిళల భద్రత కోసం శక్తి యాప్ పై కూడా ఆయా వార్డుల పరిధిలో ఉన్న మహిళలు కు అవగాహన కల్పించాలి-CI పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగిన, వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి…. మహిళ పోలీసులు ను ఆదేశించిన-CI రమేష్
Author: chilakaluripetalocalnews@gmail.com
6వ వార్డు ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేకపూజల్లో పాల్గొన్న అనంతరం అన్నదానాన్ని ప్రారంభించిన ప్రత్తిపాటి భక్తులను ఉద్దేశించి మాట్లాడారు.వైశాఖమాసంలో వచ్చే హనుమాన్ జయంతి ఎంతో విశిష్టమైనదని, అజేయశక్తికి, అపార భక్తికి ప్రతిరూపమైన ఆంజనేయుని అనుగ్రహం ఉంటే అన్ని సమస్యలు తీరిపోతాయని ప్రత్తిపాటి చెప్పారు. మతాలకు అతీతంగా ఆంజనేయుని పూజించడం గొప్ప శుభపరిణామమన్నారు. ప్రజలకు, రాష్ట్రానికి మంచి జరగాలని ఆ రామభక్తుని వేడుకున్నట్టు ప్రత్తిపాటి చెప్పారు. కార్యక్రమంలో జనసేన ఇంచార్జి తోట, రాజారమేష్, టీడీపీ నాయకులు జవ్వాజి మధన్ మోహన్, బ్రహ్మానందం, బత్తినేని శ్రీనివాసరావు, తోట సత్యం, తోట బ్రాహ్మస్వాములు, ఏలూరి తిరుపతయ్య, అరె మల్లి, టీడీపీ నాయకులు, తదితరులున్నారు.
చిలకలూరిపేట పట్టణములో సి.ఆర్ క్లబ్ నందు నడుపబడుతున్న న్యూ షావోలిన్ కుంగూ ఫు అకాడమీ విద్యార్థులు రాష్ట్రస్ధాయి ఊషు పోటీల్లో విజేతలుగా నిలిచి జూన్ నెలలో జైపూర్లో జరగనున్న జాతీయస్థాయికి ఉషు పోటీలకు ఎంపికయిన విద్యార్థులను శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు ప్రత్తిపాటి పుల్లారావు అభినందించారు. ప్రతి తల్లిదండ్రులు మార్షల్ ఆర్ట్స్ గురించి తెలుసుకొని విద్యార్ధినీ విద్యార్థులు సెల్ఫ్ డిఫన్స్ లో అలాగే ప్రభుత్వంచే గుర్తించబడిన ఆటల పోటీల్లో పాల్గొనే విధంగా తీర్చిదిద్దాలని కోరారు. ఏ.పి డిప్యూటి సి.యం పవన్ కళ్యాణ్ కూడా అనేక సందర్భాల్లో ఆడపిల్లలపై ఈ సమాజంలో జరుగుతున్న దాడుల నుండి రక్షణ కొరకు ఆడపిల్లలకు, మహిళలకు కుంగ్ ఫు , కరాటే, ఉషు విద్యలు నేర్పించాలని సూచించిన విషయాన్ని గుర్తుచేశారు. అలాగే మన చిలకలూరిపేట పట్టణంలో ప్రభుత్వంచే గుర్తించబడినటువంటి ఊషు క్రీడను మన పల్నాడు జిల్లా తరుపున మన స్థానిక సి.ఆర్ క్లబ్లో నేర్పిస్తున్న న్యూ షావోలిన్ కుంగూ…
కూటమిప్రభుత్వంలో వాణిజ్య, వ్యాపార వర్గాలవారు ఎలాంటి ఆందోళన, భయం లేకుండా ప్రశాంతంగా తమ కార్యకలాపాలు సాగించుకునే స్నేహపూర్వక సత్సంబంధాలు ఉన్నాయని, గతంలో మాదిరి వేధింపులు, దౌర్జన్యాలు, బెదిరింపులకు స్థానం లేదని మాజీమంత్రి, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. పట్టణంలోని ఆర్యవైశ్య కల్యాణమండపంలో జరిగిన చిలకలూరిపేట నియోజకవర్గ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్నారు. నూతన కార్యవర్గం అధ్యక్ష, కార్యదర్శులు, కొత్తమసు శ్రీనివాసరావు ,అరెకట్ల కోటేశ్వరరావు, కొప్పురావూరి రాధాకృష్ణ, సభ్యులతో ప్రత్తిపాటి ప్రమాణం చేయించచారు. అనంతరం సభను ఉద్దేశించి ప్రసంగించారు. చిలకలూరిపేట ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో అన్నివర్గాల వారు ఉన్నారని, కూటమిప్రభుత్వంలో వ్యాపారులకు అవసరమైన అన్ని సహాయసహకారాలు అందుతాయని ప్రత్తిపాటి తెలిపారు. వ్యాపారులు ఎలాంటి అభద్రతాభావానికి లోనుకాకుండా తమ పనులు చేసుకోవచ్చన్నారు. గతంలో నియోజకవర్గంలో వ్యాపారుల్ని, ప్రజల్ని భయపెట్టిన వారు ఇప్పుడు కనిపించకుండా పోయారని ప్రత్తిపాటి ఎద్దేవాచేశారు. వ్యాపారులు కష్టపడి పనిచేసుకోవడంతో పాటు, తమ సంపాదనలో కొంత…
రామ భక్త హనుమంతుడి పుట్టిన రోజుగా ఈ రోజు గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంది. విశ్వాసం ప్రకారం బజరంగబలిని ఈ రోజున హృదయపూర్వకంగా పూజించే భక్తుల కష్టాలన్నింటినీ తొలగిస్తాడు. అంతేకాదు అన్ని రకాల భయాలు, ఇబ్బందుల నుండి విముక్తి పొందుతాడు. హనుమాన్ జయంతి సోదరభావం, ఐక్యతకు చిహ్నంగా కూడా పరిగణించబడుతుంది. ఎందుకంటే హనుమంతుడి భక్తులందరూ కలిసి ఈ పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటారు.హనుమంతుడి జయంతి రోజున పొద్దున్నే నిద్రలేచి హనుమంతుడిని స్మరించుకుని ఆయనకు హృదయపూర్వకంగా నమస్కరించండి. దినచర్యలు ముగించుకున్న తర్వాత ఇల్లు శుభ్రం చేసి స్నానం చేయండి. గంగాజలం ఉంటే స్నానం చేసే నీటిలో గంగాజలం కలుపుకుని స్నానం చేయాలి. ఎరుపు రంగు పూలు, పండ్లు, ధూపం, దీపం, సింధూరం మొదలైన వాటితో హనుమంతుడిని పూజించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. నమ్మకం ప్రకారం ఈ రోజున హనుమాన్ చాలీసా లేదా బజరంగ్ బాణ్ పఠిస్తే హనుమంతుడు త్వరగా సంతోషిస్తాడు. అంతేకాదు సుందరకాండ పఠించడం…
చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించి దేశ స్థాయిలో రైతు నాయకుడిగా ఎదిగిన సోమేపల్లి సాంబయ్య మనల్ని వదిలి వెళ్లి సంవత్సరాలు గడుస్తున్నా నేటికి ఆయన పేట ప్రజల హృదయాల్లో చిరంజీవిగా ఉన్నారు. సోమపల్లి సాంబయ్యకు నివాళులు అర్పిస్తూ … చిలకలూరిపేట నియోజకవర్గ అభివృద్దిలోనూ, రాజకీయాల్లోనూ మాజీ ఎమ్మెల్యే సోమేపల్లి సాంబయ్య ది వినూత్న శైలీ. స్వచ్చమైన, నీతి వంతమైన రాజకీయాలకు ఆయన పెట్టింది పేరు. రాజకీయాలంటే ప్రజల సేవ కోసమని నమ్మిన సోమేపల్లి తన జీవిత చరమాంకం వరకు ప్రజల సేవలోనే గడిపారు. విద్యావంతుడు రాజకీయనాయకుడైతే ప్రజల జీవితాల్లో ఏ విధంగా మార్పు వస్తుందన్న విషయానికి ప్రత్యేక నిదర్శనం సాంబయ్యగా చెప్పవచ్చు. ప్రజల సేవ కోసం అలనాడే గుంటూరు ఏసీ కళాశాలలో అద్యాపకుని ఉద్యోగాన్ని సైతం వదులుకొని రైతు నాయకుడిగా ఎదిగిన సోమేపల్లి వర్ధంతి నేడుప్రజల కోసం నిలబడ్డ నాయకుడ్ని ప్రజలు అక్కున చేర్చుకుంటారని, ఆ నాయకుడి కోసం చివరి…
చిలకలూరిపేట పట్టణంలోని, శ్రీరస్తు ఫంక్షన్ హల్ నందు జరుగుచున్న వినుకొండ ఎమ్మార్వో సభావతు సురేష్ నాయక్ గారి తమ్ముడు దుర్గాప్రసాద్ నాయక్ గారి వివాహానికి హాజరై, ఆ నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారు…ఈ వేడుకలో తెలుగుదేశం పార్టీ నాయకులు షేక్ కరీముల్లా గారు, జవ్వాజి మదన్ గారు, కామినేని సాయిబాబా గారు, కందుల రమణ గారు, తుపాకుల అప్పారావు గారు, తుబాటి శ్రీహరి గారు, తదితరులు పాల్గొన్నారు..
అంతర్జాతీయ యోగ మాసోత్సవ కార్యక్రమంలో కమిషనర్ పీ. శ్రీ హరిబాబు చిలకలూరిపేట :కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మాజీమంత్రి స్థానిక శాసన సభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు సూచనల మేరకు పురపాలక సంఘం నందు అంతర్జాతీయ యోగ మాసోత్సవ కార్యక్రమం మే 21 నుండి జూన్21వరకునిర్వహించనున్నారు.ఇందులో భాగంగాపురపాలక సంఘ కార్యాలయంలో ఉన్న మైలవరపు గుండయ్య మున్సిపల్ కౌన్సిల్ హాల్ నందు మొదటిరోజు జరిగిన కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ పీ. శ్రీహరిబాబు మాట్లాడుతూ యోగ యొక్క ప్రయోజనాలు చాలా ఉన్నాయి అని, శారీరక, మానసిక మరియు ఆధ్యాత్మిక శ్రేయస్సును మెరుగుపరుస్తాయనీ పేర్కొన్నారు. యోగా యొక్క సాధారణ అభ్యాసం బలం, వశ్యత మరియు సమతుల్యతను మెరుగుపరుస్తుంది, రక్తపోటును తగ్గిస్తుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది మరియు మానసిక స్పష్టతను పెంచుతుందనీ తెలిపారు. క్రమం తప్పకుండా సాధన చేయడం వల్ల శారీరక బలం మరియు సమతుల్యతఆరోగ్యంమెరుగుపడతాయి అని తెలియజేశారు.
అన్నదానానికి భారీ విరాళం పురుషోత్తమ పట్నం సాయిబాబా మందిరానికి50,000నగదు అందజేత చిలకలూరిపేట పట్టణంలో ని12వ వార్డ్ టీడీపీ నాయకులు తుళ్లూరి సాంబయ్యఆదిలక్ష్మి దంపతుల 60వ వివాహా మహోత్సవం సందర్భంగా స్థానిక పురుషోత్తమ పట్నం లో వేంచేసి ఉన్న శ్రీ షిర్డీసాయి మందిరంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మందిర ప్రధాన అర్చకులు మురికిపుడి లక్ష్మీ నారాయణ ,దంపతులు పేరు మీద అర్చన చేశారు. అనంతరం సాంబయ్య ఆదిలక్ష్మి దంపతులు సాయిబాబా మందిరంలో భక్తులకు అన్నదాన నిమిత్తం50000రూపాయల ను ఆర్థిక సహాయం అందించారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు బత్తినేని శ్రీనివాసరావు కు ఈ50000ఆర్థిక సహాయాన్ని ఇచ్చారు. అదేవిధంగా పట్టణంలో ని చీరాల రోడ్డు లో ఉన్న బాపూజీ వృద్ధుల ఆశ్రమంలో వృద్ధులు కు అన్నదనం పంపిణీ చేశారు. అన్నదానికి ఆర్థిక సహాయాన్ని అందించిన తుళ్ళూరి సాంబయ్య ఆదిలక్ష్మి దంపతులు ను పలువురు ప్రముఖులు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉప్పాలబాజి, ఉప్పాల సుభాని, ఉప్పాల…
యూట్యూబ్ న్యూస్ చానల్స్ జర్నలిస్ట్ ల సమస్యలు పరిష్కరించాలి. YJA.ఏపీ అసోసియేషన్ పల్నాడు జిల్లా కమిటీ జిల్లాలో పలు నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు,జిల్లా టీడీపీ పార్టీ అధ్యక్షులకు వినతి పత్రాలు అందజేసిన పల్నాడు జిల్లా కమిటీ నాయకులు. యూట్యూబ్ న్యూస్ చానల్స్ జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు మంజూరు చేయాలి, అక్రిడేషన్ కమిటీలో అవకాశం కల్పయించాలి. పల్నాడు జిల్లా //యూట్యూబ్ న్యూస్ చానల్స్ ఆఫ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు గుండారెడ్డి మల్లికార్జున రెడ్డి గారు, రాష్ట్ర జనరల్ సెక్రెటరీ వల్లూరు. మధు సుధను రావు గారి ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా కమిటీ నాయకత్వం ఆధ్వర్యంలో పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ గారికి, పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కొమ్మాలపాటి శ్రీధర్ గారికి, ప్రభుత్వ చీఫ్ విప్ మరియు వినుకొండ శాసనసభ్యులు జివి ఆంజనేయులు గారికి, గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు గారికి, నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ…









