మాచర్లలో బీజేపీ మండల మహా ప్రశిక్షణ అభియాన్ సన్నాహక సమావేశం

భారతీయ జనతా పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ మండల lమహా ప్రశిక్షణ అభియాన్” కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మాచర్లలో మంగళవారం సన్నాహక సమీక్ష సమావేశం జరిగింది

ఈ సమావేశానికి బీజేపీ పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమ నిర్వహణపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. అలాగే జిల్లా కిసాన్ మోర్చా త్రీ మెన్ కమిటీ సభ్యులు వరికుటి నాగేశ్వరావు పాల్గొన్నారు
పట్టణ అధ్యక్షుడు ఓర్సు క్రాంతి కుమార్, ప్రధాన కార్యదర్శి ఏచూరి సురేష్ కార్యక్రమ ఏర్పాట్లు, పాల్గొనబోయే కార్యకర్తలు, శిక్షణ విధానాలపై వివరాలు అందించారు. ఈ సందర్భంగా మల్లెల శివ నాగేశ్వరరావు పలు కీలక సూచనలు చేస్తూ, శిక్షణ కార్యక్రమం పార్టీ బలోపేతానికి దోహదపడేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
మహా ప్రశిక్షణ అభియాన్ ద్వారా పార్టీ సిద్ధాంతాలు, విధానాలు, ప్రజా సేవా కార్యక్రమాలపై కార్యకర్తలకు అవగాహన పెంపొందించి, బూత్ స్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యమని తెలిపారు

Share.
Leave A Reply