Author: chilakaluripetalocalnews@gmail.com

నరసరావుపేటలో ప్రజా సమస్యల ప్రజావేదిక పాల్గొన్న ఎమ్మెల్యే డా”చదలవాడ నరసరావుపేట పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ప్రజావేదిక (PGRS) కార్యక్రమన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో నరసరావుపేట శాసనసభ్యులు డా”చదలవాడ అరవింద బాబు నియోజకవర్గంలోని ప్రజల వద్ద నుండి వినతి పత్రాలను అందుకున్నారు ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ప్రజా వేదిక కార్యక్రమంలో భాగంగా ప్రతి శుక్రవారం నియోజకవర్గం టీడీపీ కార్యాలయం నందు ప్రజల సమస్యలు తెలుసుకొనుటకు ప్రజా వేదిక నిర్వహిస్తున్నామని ప్రజా వద్ద నుండి పెద్ద ఎత్తున వినతి పత్రాలు వస్తున్నాయని కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసే విధంగా ప్రభుత్వం పని చేస్తుందని నియోజకవర్గ ప్రజల సమస్యలు తెలుసుకొని సంబంధిత అధికారుల ద్వారా సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు చేపడుతున్నామని తెలియజేశారు వచ్చే నెల నుండి రైతులకు 20.000/- రూపాయల ఆర్ధిక…

Read More

యడ్లపాడు–1 సచివాలయాన్ని సందర్శించిన తహశీల్దార్‌– రేషన్‌ కార్డులపై క్షేత్రస్థాయి పరిశీలన యడ్లపాడు మండల తహశీల్దార్‌ జెట్టి విజయశ్రీ గురువారం యడ్లపాడు–1 సచివాలయాన్ని ఆకస్మికంగా సందర్శించారు. రేషన్‌ కార్డుల జారీ ప్రక్రియపై అక్కడి సిబ్బందితో సమావేశమై దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన, అర్హత నిర్ణయం తదితర ప్రక్రియలను సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అర్హులైన ప్రతికుటుంబానికి రేషన్‌ కార్డు మంజూరు చేయాలని, అనర్హుల వద్ద నుంచి పథకాన్ని కాపాడాల్సిన బాధ్యత కూడా అధికారులపై ఉందన్న విషయాన్ని విస్మరించ వద్దన్నారు. రేషన్‌కార్డుల మంజూరుపై సిబ్బందికి స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చారు. ఆమె వెంట ఉపతహశీల్దారు అనురాధ, మండల రెవెన్యూ ఇన్సె్పక్టర్‌ సుబ్బారావు, వీఆర్వో కేఏ చారి, పంచాయతీ కార్యదర్శి గ్రేడ్‌–6 స్వాతిప్రియ, జీఎంఎస్‌కే రేవతి తదితరులు ఉన్నారు.

Read More

నేడు పోలేరమ్మ తల్లి జాతర ఈ నెల23,24తేదీ లలో శ్రీ పోలేరమ్మ తల్లి జాతర మహోత్సవాలు వైభవంగా నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసిన దేవస్థానం కమిటీ సభ్యులు రెండు రోజులు పూజలు అనంతరం ఈ నెల 26వ తేదీ సోమవారం రాత్రి మహా అన్నదాన కార్యక్రమం పట్టణంలో ని బొందిలి పాలెం లో వేంచేసి ఉన్న శ్రీ పోలేరమ్మ తల్లి దేవస్థాన జాతరకు సర్వం సిద్ధం రెండు రోజుల పాటు పోలేరమ్మ తల్లికి విశేష పూజలు జరిపేందుకు సిద్ధంగా ఉన్న భక్తులు రంగు రంగుల విద్యుత్ కాంతులు తో దేవస్థానం ప్రాంగణం

Read More

కొన్ని స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం ముందుగా మేల్కొవ‌ట‌మే. రానున్న స‌మ‌స్య‌ను ముందుగా గుర్తించి వాటిని ప‌రిష్క‌రించ‌ట‌మే. ఇందుకు అధికారుల‌కు కావ‌ల్సింది ముందు చూపే. ఆ చూపు క‌రువైన‌ప్పుడు ప్ర‌జ‌ల‌కు ఇక్క‌ట్లు త‌ప్ప‌వు. 2013 అక్టోబ‌ర్‌లో వ‌చ్చిన అకాల‌వ‌ర్షాలు ప‌ట్ట‌ణాన్ని ముంచెత్తాయి. జ‌న‌జీవ‌నం అస్థ‌వ్య‌స్థ‌మైంది. ప‌ట్ట‌ణ న‌డి బొడ్డున గ‌డియార‌స్థంబం సెంట‌ర్‌, మార్కెట్ సెంట‌ర్‌లో సైతం వ‌ర్ష‌పు నీరు దుకాణాల్లో చేరి ల‌క్ష‌లాది రూపాయాల న‌ష్టం మిగిల్సింది. లోత‌ట్టు ప్రాంతాల‌ల్లో గుడిసెలు నీట మునిగి ప్ర‌జ‌లు తీవ్రంగా న‌ష్ట‌పోయారు అంతా అయిపోయాక అధికారులు ఇందుకు గ‌ల కార‌ణాలేమిట‌ని ఆరా తీసారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్ర‌ధాన కాల్వ‌ల్లో పూడిక‌లు తీయ‌క‌పోవ‌ట‌మే అని గుర్తించారు. చిన్న‌పాటి వ‌ర్షాల‌కే చిల‌కలూరిపేట ముంపుకు గురౌతుంది. ఇందుకు కార‌ణ‌మేమిటి..? ఎటువంటి చ‌ర్య‌లు తీసుకుంటే ఈ ప‌రిస్థితి నుంచి బ‌య‌ట ప‌డే అవ‌కాశం ఉంది.ప‌ట్ట‌ణంలో గ‌మ్యం లేని కాల్వ‌లు, కాల్వ‌ల‌ను ఆక్ర‌మించుకొని క‌ట్టిన భ‌వ‌నాలు, పూడిక‌లు తీయ‌క వ‌దిలివేయ‌టం, శిధిల‌మైన కాల్వ‌ల‌తో…

Read More

ఇప్పుడు సీజ‌న్ మారింది.. . వానలు మొదలయ్యాయి. వానాకాలంలో వాంతులు, విరేచనాలు, టైఫాయిడ్‌, మలేరియా, చికెన్‌గున్యా, కామెర్లు, డెంగీ తదితర వ్యాధులు సులబంగా వ్యాపించే ప్రమాదం ఉంది.స‌మావేశాలు పెడితే స‌రిపోతుందా..ప‌ట్టణం గ‌తం కంటే విస్త‌రించింది. గ‌తంలో 34వార్డుల్లోనే పారిశుధ్యం అంతంత మాత్రంగా ఉంది. ఇప్పుడు 38 వార్డుల సువిశాల‌మైన ప‌ట్ట‌ణం పారిశుధ్య స‌మ‌స్య జ‌ఠిలంగానే ఉంది. సీజ‌న్ వ్యాధుల‌పై మున్సిప‌ల్ అధికారులు స‌మావేశం పెట్టి మ‌మ అని పించారు. ఇంత‌టితో త‌మ ప‌ని అయిపోయింద‌నిపించుకున్నారు. పారిశుద్ద్యంపై నిర్లక్ష్యం వీడాలి. వర్షాలు కురుస్తున్నా అధికారులు పారిశుద్ధ్యంపై చర్యలు తీసుకోకపోవడం, అనేక ప్రాంతాల్లో చెత్త కుప్పలు పేరుకుపోతున్నాయి. గ‌త ఏడాది డెంగీవ్యాది ల‌క్ష‌ణాల‌తో ప్ర‌జ‌లు ఇబ్బంది ప‌డ్డారు. కొంత‌మంది మృత్యువాత ప‌డ్డారు. అటువంటి ప‌రిస్థితి త‌లెత్త‌కుండా ముంద‌స్తు జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. ప‌లు ప్రాంతాల్లో నీటి కాలుష్య స‌మ‌స్య ఉంది. లీకుల‌తో క‌లుషిత నీరు స‌ర‌ఫ‌రా అవుతుంది. అధికారులు వెంట‌నే స్పందించ‌కుంటే పెను ప్ర‌మాదం పొంచి…

Read More

నిఘా నేత్రం లో చిలకలూరిపేట పట్టణం దేవాలయాలు, మసీదు లు, చర్చిలు వద్ద నిఘా కెమెరాలు తప్పనిసరి-అర్బన్ CI రమేష్ పోలీసు స్టేషన్లో సచివాలయ మహిళ పోలీసు సిబ్బంది తో సమావేశమైన-CI రమేష్ పట్టణంలో ఇళ్లకు, దేవాలయాలకు, మసీదు లకు, చర్చిలకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి.-CI రమేష్ నిఘా కెమెరాలు ఏర్పాటు చేసే విధంగా సచివాలయం సిబ్బంది అవగాహన కల్పించాలి-CI నిఘా పరికరాలు తో పాటు మహిళల భద్రత కోసం శక్తి యాప్ పై కూడా ఆయా వార్డుల పరిధిలో ఉన్న మహిళలు కు అవగాహన కల్పించాలి-CI పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగిన, వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి…. మహిళ పోలీసులు ను ఆదేశించిన-CI రమేష్

Read More

6వ వార్డు ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేకపూజల్లో పాల్గొన్న అనంతరం అన్నదానాన్ని ప్రారంభించిన ప్రత్తిపాటి భక్తులను ఉద్దేశించి మాట్లాడారు.వైశాఖమాసంలో వచ్చే హనుమాన్ జయంతి ఎంతో విశిష్టమైనదని, అజేయశక్తికి, అపార భక్తికి ప్రతిరూపమైన ఆంజనేయుని అనుగ్రహం ఉంటే అన్ని సమస్యలు తీరిపోతాయని ప్రత్తిపాటి చెప్పారు. మతాలకు అతీతంగా ఆంజనేయుని పూజించడం గొప్ప శుభపరిణామమన్నారు. ప్రజలకు, రాష్ట్రానికి మంచి జరగాలని ఆ రామభక్తుని వేడుకున్నట్టు ప్రత్తిపాటి చెప్పారు. కార్యక్రమంలో జనసేన ఇంచార్జి తోట, రాజారమేష్, టీడీపీ నాయకులు జవ్వాజి మధన్ మోహన్, బ్రహ్మానందం, బత్తినేని శ్రీనివాసరావు, తోట సత్యం, తోట బ్రాహ్మస్వాములు, ఏలూరి తిరుపతయ్య, అరె మల్లి, టీడీపీ నాయకులు, తదితరులున్నారు.

Read More

చిలకలూరిపేట పట్టణములో సి.ఆర్ క్లబ్ నందు నడుపబడుతున్న న్యూ షావోలిన్ కుంగూ ఫు అకాడమీ విద్యార్థులు రాష్ట్రస్ధాయి ఊషు పోటీల్లో విజేతలుగా నిలిచి జూన్ నెలలో జైపూర్లో జరగనున్న జాతీయస్థాయికి ఉషు పోటీలకు ఎంపికయిన విద్యార్థులను శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు ప్రత్తిపాటి పుల్లారావు అభినందించారు. ప్రతి తల్లిదండ్రులు మార్షల్ ఆర్ట్స్ గురించి తెలుసుకొని విద్యార్ధినీ విద్యార్థులు సెల్ఫ్ డిఫన్స్ లో అలాగే ప్రభుత్వంచే గుర్తించబడిన ఆటల పోటీల్లో పాల్గొనే విధంగా తీర్చిదిద్దాలని కోరారు. ఏ.పి డిప్యూటి సి.యం పవన్ కళ్యాణ్ కూడా అనేక సందర్భాల్లో ఆడపిల్లలపై ఈ సమాజంలో జరుగుతున్న దాడుల నుండి రక్షణ కొరకు ఆడపిల్లలకు, మహిళలకు కుంగ్ ఫు , కరాటే, ఉషు విద్యలు నేర్పించాలని సూచించిన విషయాన్ని గుర్తుచేశారు. అలాగే మన చిలకలూరిపేట పట్టణంలో ప్రభుత్వంచే గుర్తించబడినటువంటి ఊషు క్రీడను మన పల్నాడు జిల్లా తరుపున మన స్థానిక సి.ఆర్ క్లబ్లో నేర్పిస్తున్న న్యూ షావోలిన్ కుంగూ…

Read More

కూటమిప్రభుత్వంలో వాణిజ్య, వ్యాపార వర్గాలవారు ఎలాంటి ఆందోళన, భయం లేకుండా ప్రశాంతంగా తమ కార్యకలాపాలు సాగించుకునే స్నేహపూర్వక సత్సంబంధాలు ఉన్నాయని, గతంలో మాదిరి వేధింపులు, దౌర్జన్యాలు, బెదిరింపులకు స్థానం లేదని మాజీమంత్రి, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. పట్టణంలోని ఆర్యవైశ్య కల్యాణమండపంలో జరిగిన చిలకలూరిపేట నియోజకవర్గ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్నారు. నూతన కార్యవర్గం అధ్యక్ష, కార్యదర్శులు, కొత్తమసు శ్రీనివాసరావు ,అరెకట్ల కోటేశ్వరరావు, కొప్పురావూరి రాధాకృష్ణ, సభ్యులతో ప్రత్తిపాటి ప్రమాణం చేయించచారు. అనంతరం సభను ఉద్దేశించి ప్రసంగించారు. చిలకలూరిపేట ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో అన్నివర్గాల వారు ఉన్నారని, కూటమిప్రభుత్వంలో వ్యాపారులకు అవసరమైన అన్ని సహాయసహకారాలు అందుతాయని ప్రత్తిపాటి తెలిపారు. వ్యాపారులు ఎలాంటి అభద్రతాభావానికి లోనుకాకుండా తమ పనులు చేసుకోవచ్చన్నారు. గతంలో నియోజకవర్గంలో వ్యాపారుల్ని, ప్రజల్ని భయపెట్టిన వారు ఇప్పుడు కనిపించకుండా పోయారని ప్రత్తిపాటి ఎద్దేవాచేశారు. వ్యాపారులు కష్టపడి పనిచేసుకోవడంతో పాటు, తమ సంపాదనలో కొంత…

Read More

రామ భక్త హనుమంతుడి పుట్టిన రోజుగా ఈ రోజు గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంది. విశ్వాసం ప్రకారం బజరంగబలిని ఈ రోజున హృదయపూర్వకంగా పూజించే భక్తుల కష్టాలన్నింటినీ తొలగిస్తాడు. అంతేకాదు అన్ని రకాల భయాలు, ఇబ్బందుల నుండి విముక్తి పొందుతాడు. హనుమాన్ జయంతి సోదరభావం, ఐక్యతకు చిహ్నంగా కూడా పరిగణించబడుతుంది. ఎందుకంటే హనుమంతుడి భక్తులందరూ కలిసి ఈ పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటారు.హనుమంతుడి జయంతి రోజున పొద్దున్నే నిద్రలేచి హనుమంతుడిని స్మరించుకుని ఆయనకు హృదయపూర్వకంగా నమస్కరించండి. దినచర్యలు ముగించుకున్న తర్వాత ఇల్లు శుభ్రం చేసి స్నానం చేయండి. గంగాజలం ఉంటే స్నానం చేసే నీటిలో గంగాజలం కలుపుకుని స్నానం చేయాలి. ఎరుపు రంగు పూలు, పండ్లు, ధూపం, దీపం, సింధూరం మొదలైన వాటితో హనుమంతుడిని పూజించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. నమ్మకం ప్రకారం ఈ రోజున హనుమాన్ చాలీసా లేదా బజరంగ్ బాణ్ పఠిస్తే హనుమంతుడు త్వరగా సంతోషిస్తాడు. అంతేకాదు సుందరకాండ పఠించడం…

Read More