జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణ కు చర్యలు
పల్నాడు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగిన జిల్లా రోడ్డు భద్రత కమిటీలో జిల్లాలో రోడ్డు ప్రమాదాలు గతంలో కన్నా అధికంగా జరుగుతున్న కారణంగా వాటిని నివారించడానికి జిల్లా కలెక్టర్ రవాణా శాఖ, పోలీస్ శాఖ వారిని జాయింట్ ఎన్ఫోర్స్మెంట్ నిర్వహించమని ఆదేశాలు జారీ చేయడం జరిగినది.
ఈ ఆదేశాల మేరకు తేది 29-05-2025 న ఆర్టీసీ, పోలీస్ శాఖ మరియు రవాణా శాఖ అధికారులు రావిపాడు రోడ్డు, వినుకొండ రోడ్డు మరియు గుంటూరు రోడ్డు నుండి వెళ్లే రహదారిలో తనిఖీలు నిర్వహించడం జరిగినది.
ఈ తనిఖీలలో భాగంగా పరిమితికి మించి ప్రయాణం చేస్తున్న వాహనములపై కేసులు నమోదు చేయడం జరిగినది. ఈ తనిఖీలలో ఆటో రిక్షాలు వాహనములపై తనిఖీలు నిర్వహించి 33 వాహనాలపై కేసు నమోదు చేసి అందులో 7 వాహనములను సీజ్ చేయడం జరిగినది, Rs.2,20,000/-, అపరాధ రుసుము సేకరించడమైనది.
ఈ తనిఖీలలో నరసరావుపేట డిపో మేనేజర్ శ్రీ బి శ్రీనివాసరావు , రవాణా శాఖ వారి తరపునుంచి మోటార్ వాహనాల తనిఖీ అధికారి శ్రీ ఎన్ శివ నాగేశ్వరావు , పోలీస్ శాఖ వారి తరఫునుంచి ఎస్సై కిషోర్ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని దీనివల్ల రోడ్లపై జరిగే ప్రమాదాలనునిర్మూలించవచ్చనితెలియపరచడమైనది