కడప మహానాడులో విజయవాడ మాజీ ఎమ్మెల్యే స్టేజీ పై కుప్పకూలిన ఘటన

వెంటనే స్పందించి ప్రథమ చికిత్స అందించి ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లిన నరసరావుపేట ఎమ్మెల్యే డా౹౹చదలవాడ అరవింద బాబు

కడపలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న కడప మహానాడు వేదికపై పార్టీ ప్రసంగం జరుతున్న క్రమంలో విజయవాడ మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఆకస్మికంగా కుప్పకూలారు.ఘటన చూసిన వెంటనే సీఎం చంద్రబాబు నాయుడు వేదిక మీదున్న నరసరావుపేట ఎమ్మెల్యే డా౹౹చదలవాడ అరవింద బాబును ప్రథమ చికిత్స చేయాలని ఆదేశించడంతో స్పందించిన డా౹౹చదలవాడ ప్రాథమిక చికిత్స అందించి దగ్గరలో ఉన్న సన్ రైజు హాస్పిటల్ కు తీసుకుని వెళ్ళారు.వైద్య పరీక్షల అనంతరం వైద్యులు సకాలంలో తీసుకొనిరావడం వలన జలీల్ ఖాన్ గారి ఆరోగ్యానికి ఎటువంటి ప్రమాదం లేదని తెలిపారు.హాస్పిటల్ లో జలీల్ ఖాన్ ఆరోగ్య పరిస్థిని తెలుసుకొని ఎప్పటికప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారికి మరియు కేంద్ర కార్యాలయానికి సమాచారం అందిస్తున్నారు.

Share.
Leave A Reply