రిస్కు తో కూడిన డెలివరీ నివాహనం లొనే సాధ్యం చేసిన108 సిబ్బంది
వివరాలు ఇలా….అర్ధరాత్రి అంబులెన్స్ లో పండంటి మగ బిడ్డ జననం.వివరాలలోకి వెళితే నాదెండ్ల మండలం ఎండుగంపాలెం గ్రామానికి చెందిన కాలవ గట్టుమీద నివసించే ఎండేటి భద్రయ్య భార్య అడివమ్మ 18 సంవత్సరాలు అర్ధరాత్రి ప్రసవ నొప్పులతో బాధపడుతుందని ఎడ్లపాడు 108 అంబులెన్స్ కు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న వెంటనే 108 సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని ఆమెను పరీక్షించి అంబులెన్స్ లో ఎక్కించుకొని కొంచెం దూరం వెళ్లాక నొప్పులు అధికమయ్యాయి.
అంబులెన్స్ ని రోడ్డు పక్కన ఆపి ఆమెకు EMT యడ్ల శోభన్ బాబు, పైలట్ SK అల్లాబక్షు ప్రసవం చేశారు.
ఇందులో గ్రామానికి చెందిన ఆశ వర్కర్ బిందు పాల్గొన్నారు .
ఆమెకి ఇది తొలి కాన్పు పండంటి మగ బిడ్డ జన్మించడం జరిగింది .
తొలి కాన్పులోనే మగ బిడ్డ జన్మించడంతో కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్త పరచారు.
క్షేమంగా ప్రసవం చేసినందుకు 108 సిబ్బందికి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.
తల్లి బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. వీరిని నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది.
విషయం తెలుసుకున్న పల్నాడు జిల్లా108 మేనేజర్ S. సుబ్బారావు సిబ్బందిని అభినందించారు.