సీఎం.ఆర్.ఎఫ్ సాయం… వ్యాధిగ్రస్తులకు వరం : ప్రత్తిపాటి వివిధ రకాల దీర్ఘకాల వ్యాధులు, తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడే పేదల్ని సీఎం.ఆర్.ఎఫ్ సాయం వరంలా ఆదుకుంటోందని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. దీర్ఘకాలిక రోగాలు, వ్యాధులతో బాధపడుతున్న 32 మంది వ్యాధిగ్రస్తులు, వారి కుటుంబసభ్యులకు శనివారం ప్రత్తిపాటి తన నివాసంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల్ని అందచేశారు. 32 మందికి రూ.27.76లక్షల చెక్కులు, అత్యవసర వైద్యసేవల నిమిత్తం ఒకరికి 1.75లక్షల విలువైన ఎల్.ఓ.సీని ప్రత్తిపాటి స్వయంగా బాధితులకు అందించారు. చెక్కులు, ఎల్.వో.సీలు అందించిన అనంతరం ఆయన వారితో మాట్లాడి కుటుంబస్థితిగతుల గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గత ప్రభుత్వం బటన్ నొక్కుడు ముసుగులో పేదల జీవితాల్ని కోలుకోలేని విధంగా దెబ్బతీసిందన్నారు. ఒకచేత్తో రూపాయి ఇచ్చి మరో చేత్తో వివిధ మార్గాల్లో 10 రూపాయలు లాక్కుందన్నారు. చెత్తపన్ను..ఇంటిపన్ను.కొళాయిపన్ను అంటూ ఇష్టానుసారం పన్నులేసి, నిత్యావసరాల ధరల పెంపు, కల్తీమద్యం అమ్మకాలతో పేద,…
Author: chilakaluripetalocalnews@gmail.com
వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మాజీ మంత్రి వర్యులు శ్రీమతి విడదల రజిని గారి ఆశీస్సులతో చిలకలూరిపేట పట్టణం,చిలకలూరిపేట రూరల్,యడ్లపాడు,నాదెండ్ల మండల అధ్యక్షులను నియమించడమైనది.. చిలకలూరిపేట పట్టణ అధ్యక్షుడు గా షేక్ దరియావలి.. చిలకలూరిపేట రూరల్ మండల అధ్యక్షుడుగా దేవినేని శంకర్ రావు.. నాదెండ్ల మండల అధ్యక్షుడుగా మంగు ఏడుకొండలు… యడ్లపాడు మండల అధ్యక్షుడుగా వడ్డేపల్లి నరసింహ రావు లను నియమించడమైనది.. ఇట్లువైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీచిలకలూరిపేట నియోజకవర్గం
ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం (apjf ) ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు, రోటరీక్లబ్ మాజీ అధ్యక్షులు దండా గోపి గారి తల్లి గారైనా శ్రీమతి దండా సుమతి దేవి గారు మృతి చెందడం జరిగింది, మిట్టపాలెం గ్రామంలోని వారి స్వగృహం వద్ద ఉంచిన వారి పార్థివ దేహాన్ని సందర్శించి, నివాళులర్పించి, వారి కుటుంబసభ్యులను పరామర్శించిన మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారు…ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు షేక్ కరీముల్లా, షేక్ రఫ్ఫాని, జవ్వాజి మదన్, కందుల రమణ, మద్దుమాల రవి, గంగా శ్రీనివాసరావు, తుబాటి శ్రీహరి, మరియు గ్రామ పార్టీ నాయకులు పాల్గొన్నారు…
ఇన్నర్వీల్ క్లబ్ ఆధ్వర్యంలో దివ్యాంగురాలికి ట్రైసైకిల్ అందజేత దివ్యాగులకు చేయూత నిస్తున్నా ఇన్నర్ వీల్ క్లబ్ మహిళ ల ఆర్థిక సహాయం తో సేవా కార్యక్రమాలు స్నేహం, సేవా అనే దృక్పథంతో ఇన్నర్వీల్ క్లబ్ పని చేస్తుందని క్లబ్ అధ్యక్షురాలు గట్టు సరోజిని అన్నారు. ఇన్నర్వీల్ క్లబ్ ఆఫ్ చిలకలూరిపేట ఆధ్వర్యంలో పట్టణంలోని సుగాలీ కాలనీలో నివాసం ఉండే కోటమ్మబాయి అనే దివ్యాంగురాలికి శుక్రవారం ట్రైసైకిల్ అందజేశారు. స్థానిక స్వాతి జ్యువలర్స్ అధినేత కొత్తూరి సూర్య నారాయణ అందించిన ఆర్దిక సహాకారంతో ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టినట్లు గట్టు సరోజిని తెలిపారు. గతం నుంచి క్లబ్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించి సేవకు ప్రతిరూపంగా నిలిచిందని పేర్కొన్నారు. ఇన్నర్ వీల్ క్లబ్ చేపట్టే సేవా కార్యక్రమాలు సమాజంలో సానుకూల మార్పు తీసుకురావడానికి దోహదపడతాయని వెల్లడించారు. క్లబ్ ఆధ్వర్యంలో ఇప్పటికే పలువురు దివ్యాంగులకు ట్రైసైకిళ్లు అందజేసినట్లు గుర్తు చేశారు. కార్యక్రమంలో క్లబ్…
చిలకలూరిపేట పట్టణానికి చెందిన రాధాకృష్ణ జ్యువెలరీ మార్ట్ అధినేత కొల్లా శ్రీరామమూర్తి గారు అనారోగ్య రీత్యా మరణించడం జరిగింది . ఈరోజు వాసవినగర్ లోని వారి స్వగృహం వద్ద ఉంచిన మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించి, వారి కుటుంబసభ్యులను పరామర్శించిన మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారు…ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు షేక్ కరీముల్లా గారు, నెల్లూరి సదాశివరావు గారు, జవ్వాజి మదన్ గారు, బండారుపల్లి సత్యం గారు, కందుల రమణ గారు, బేరింగ్ మౌలాలి గారు, మద్దుమాల రవి గారు, గట్టినేని రమేష్ గారు, గంగా శ్రీనివాసరావు గారు, మురకొండ మల్లిబాబు గారు, కొత్త కోటేశ్వరరావు గారు, రాచుమల్లు సూర్యారావు గారు మరియు వార్డ్ నాయకులు పాల్గొన్నారు…
తనపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం:రజిని AP: సోషల్ మీడియా లో తన పై దుష్ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జాతీయ మానవ హక్కుల సంఘం (NHRC), జాతీయ మహిళా కమిషన్ (NCW)లకు ఫిర్యాదు చేశారు మాజీ మంత్రి విడదల రజిని. ఏబీఎన్ ఛానల్ ద్వారా తాను తీవ్రమైన దూషణలకు గురవుతున్నానని, వ్యక్తిత్వ హననకు పాల్పడుతున్నారని ఆమె ఆరోపించారు. మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, ఆయన కుటుంబసభ్యులు, మాజీ మంత్రి ఆర్కే రోజాపైనా ట్రోలింగ్ జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పర్యావరణ పరిరక్షణ దినోత్సవ సందర్భంగాచిలకలూరిపేటనియోజకవర్గం బిజెపి ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం చిలకలూరిపేట నియోజకవర్గం చిలకలూరిపేట మండలం కోమటినేనివారిపాలెం గ్రామంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపుమేరకు అమ్మకు ఒక మొక్క కార్యక్రమంలో భాగంగా కోమటినేనివారిపాలెం గ్రామంలో మొక్కలు నాటడం కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమం లో కార్యక్రమ కన్వీనర్ మరియు చిలకలూరిపేట నియోజకవర్గ కో కన్వినర్ మల్లెల శివ నాగేశ్వరావు రూరల్ మండలం మాజీ ప్రెసిడెంట్ గోరంట్ల పిచ్చయ్య ఆధ్వర్యంలో మొక్కలు నాటడం జరిగింది . ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం పల్నాడు జిల్లా కన్వీనర్ బండారు నాగరాజు ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి ఆదిమూలం గురు స్వామి బిజెపి నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
నా విజయం నరసరావుపేట ప్రజలకు నాయకులకి కార్యకర్తలకి అంకితం*డాక్టర్ చదలవాడ ఎన్ని ఇబ్బందులు ఉన్నా సంక్షేమాభివృద్ధి కొనసాగుతుంది. శాసనసభ్యులు డాక్టర్. చదలవాడ అరవిందబాబు. విజయోత్సవ ర్యాలీకి భారీ సంఖ్యలో హాజరైన కూటమి నాయకులు, శ్రేణులు. నరసరావుపేట:వైయస్సార్సీపి విధ్వంసకర పాలనలో ప్రజలకు జరిగిన నష్టం, కృషీవలుడు చంద్రబాబు కష్టంతో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకున్నామని శాసనసభ్యులు డా. చదలవాడ అరవింద్ బాబు అన్నారు. గురువారం పట్టణంలో ఆయన కార్యాలయము నుండి కూటమి పాలనకు ఏడాది పూర్తయిన సందర్భంగా విజయోత్స ర్యాలీని ప్రారంభించారు. ర్యాలీలో ఆయన స్వయంగా ట్రాక్టర్ నడిపారు. వందల సంఖ్యలో కార్యకర్తలతో చెక్ పోస్ట్ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ జరిగింది. కూటమి నాయకులు, శ్రేణులు, మహిళలు, తెదేపా, జనసేన, బిజెపి జెండాలు చేతబూని కూటమి ప్రభుత్వ అనుకూల నినాదాలు చేస్తూ ద్విచక్ర వాహనాలు, ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అభిమానులు ఏర్పాటు…
మద్యం తాగి కింద పడిన వ్యక్తిని టిడిపి వ్యక్తులు కొట్టారనడం మంచి పద్ధతి కాదు కొత్త బోధనం ఉప సర్పంచ్ తోట శ్రీనివాసరావు రాజుపాలెం మండలం కొత్త బోధనం గ్రామంలో రాంపాటి శ్రీహరి అనే వ్యక్తి మద్యం తాగి కింద పడిపోయి దెబ్బలు తగిలితే ఆ విషయాన్ని పక్కన పెట్టి వైసిపి సమన్వయకర్త గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి నేడు అతని పరామర్శించి టిడిపికి చెందిన వ్యక్తులు దాడి చేశారంటూ మాట్లాడటం మంచి పద్ధతి కాదని గ్రామ ఉపసర్పంచ్ తోట శ్రీనివాసరావు పేర్కొన్నారు. అలానే శ్రీ హరి అనే వ్యక్తి తన పేరే సరిగా రాయలేనప్పుడు సోషల్ మీడియాలో ఏం పోస్టులు పెడుతున్నారో ఎంత యాక్టివ్ గా ఉన్నారో తెలియజేయలన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పార్టీ కోసం పని చేస్తారు కానీ ఎక్కడ కూడా దాడులకు పాల్పడరు పేర్కొన్నారు. వైసీపీ నాయకులు మాట్లాడితే గ్రామాలలో గొడవలు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని…
సత్తెనపల్లి పట్టణం రఘురామ్ నగర్ ప్రజావేదిక నందు కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగాకేక్ కట్ చేసిన కూటమి నాయకులు జగన్ హయాంలో రాక్షస ,అరాచక పాలన సాగింది.. వైసీపీ పాలనలో ఎన్నికల ఎప్పుడు వస్తాయని ప్రజలు ఎదురుచుశారు .. జరిగిన ఎన్నికల్లో ప్రజలు జగన్ కు బుద్ధి చెప్పారు .. కూటమి ప్రభుత్వం లో ప్రజాస్వామ్య పాలన జరుగుతుంది .. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు ఆధికారంలోకి రావటంతో రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిని సమిక్షించారు .. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు ఒక్క ఛాన్స్ అంటూ ప్రజలను మభ్యపెట్టి అధికారం రాగానే వారిని ఘోరంగా మోసం చేసిన జగన్ను ప్రజలు తమ ఓటుతో తరిమికొట్టిన రోజు కూటమి ప్రభుత్వంపై అపార నమ్మకంతో చారిత్రాత్మక విజయాన్ని అందించిన ప్రజలకు ధన్యవాదాలు









