వ్యవసాయ భూముల్లో యదేచ్చగా మట్టి దోపిడి.

అధికారం లేకపోయినా… నాయకుల తీరు మారలేదు.

తాహసిల్దార్ కు రైతుల వినతి.

చిలకలూరిపేట.
మండలంలోని మురికిపూడి గ్రామంలో భూ బకాసురులు ప్రతినిత్యం ఎవరు ఆదమరుస్తురో ఎక్కడ వ్యవసాయం చేయకుండా ఖాళీగా కనపడుతుందా అని గ్రామమంతా నిఘానేత్రంతో చూస్తుంటారు. గత ప్రభుత్వం హయాంలో మంత్రి విడదల రజిని అనుచరుడు బినామీ ఆరుమళ్ళ వెంకట శివ, గ్రామ సర్పంచ్ భర్త ఉసత్రి రాంబాబు గ్రామంలో మాజీ మంత్రి విడదల రజిని అనుచరులుగా ఉంటూ అనేక దందాలు అనేక భూస్కాముల్లో ప్రధాన వ్యక్తులుగా ఉన్నారు. వీరిపై హైకోర్టులో కేసులు పెండింగ్ లో ఉన్నాయి.ప్రభుత్వం మారినా.. వీరు తీరు మారలేదు, గుట్టు చప్పుడు కాకుండా వీరి పనులు యాదేచ్చుగా కొనసాగించుచున్నారు. ప్రవేట్ వెంచర్లకు మట్టి తోలకాలకు క్రొత్త, పాత చెరువులోని మట్టిని అమ్మకాలు జరిపారు. పట్టా భూములను సైతం లెక్కచేయకుండగా అందులోను మట్టి తీసి అమ్ముకుంటున్నారు.
గ్రామ సర్పంచ్ భర్త అవడం వల్ల అతని ఏది చెప్తే అది జరుగుతుంది. రైతుల పట్టా భూములలో సైతం ఇస్తానుసారంగా రైతులకు తెలియకుండా అమ్ముతున్నారు. ఈ విషయమై బాధిత రైతులు జమ్మలమడక శివకృష్ణ, సూరబోయిన మురళి సురబోయిన వాసు,మరి కొంతమంది రైతులు తాహసిల్దార్ మహమ్మద్ హుస్సేన్ కు రైతులు వినతి పత్రం అందజేశారు. సదరు రైతులు గ్రామీణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.

Share.
Leave A Reply