ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అనధికార లే అవుట్ ల క్రమబద్ధీకరణ కోసం ఏర్పాటు చేసిన అవకాశాన్ని వినియోగించుకోవాలి
కేంద్ర ప్రభుత్వ ప్రియతమ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రాష్ట్ర అభివృద్ధికి వేల కోట్ల రూపాయలు నిధులను కేటాయించడం రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడటం ఎంతో హర్షించదగ్గ విషయం నిధులు కేటాయించినందుకు ప్రధానమంత్రి కి పల్నాడు జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అలాగే రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి ఎన్నో చర్యలు తీసుకుంటున్నా సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గార్ల నాయకత్వం లో 2025 జూన్ 30వ తేదీలోపు అనధికారికంగా వేసిన లేఔట్లను క్రమబద్ధీకరించుకునేందుకు అవకాశం కల్పించారు. ఈ సదవకాశం ను ప్లాట్లు కొనుగోలు చేసిన యజమానులు లే అవుట్ వేసిన యజమానులు వెంటనే స్పందించి తమ తమ ప్లాట్లు లేఔట్లు క్రమబద్ధీకరించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ విషయంపై పల్నాడు జిల్లాలో ఉన్న పల్నాడు జిల్లా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అధికారులు అలాగే పల్నాడు జిల్లాలో ఉన్న అన్ని మున్సిపల్ శాఖ టౌన్ ప్లానింగ్ అధికారులు ఈ విషయంపై అన్ని మున్సిపల్ ఏరియాలలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి ప్రజలకు లేఅవుట్ క్రమబద్ధీకరణ గురించి తెలియజేయాలని భారతీయ జనతా పార్టీ పల్నాడు జిల్లా తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ విషయంలో ఎటువంటి నిర్లక్ష్యం వహించిన కూటమి ప్రభుత్వం తీసుకునే చర్యలకు ప్రభుత్వ అధికారులు ఇబ్బంది పడాల్సిన ఆవశ్యకత ఉంది. ప్రభుత్వ ఆదాయానికి కాసులకు కక్కుర్తి వడి నిర్లక్ష్యం వహించే ప్రభుత్వ అధికారుల పై మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు తగు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్న మల్లెల శివ నాగేశ్వరరావు భారతీయ జనతా పార్టీ పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు
Trending
- చిలకలూరిపేటలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల విజయోత్సవాలు ఘనంగా నిర్వహణ
- పల్నాడు జిల్లా బిజెపి కార్యాలయంలో ‘జనతా వారధి’ కార్యక్రమం నిర్వహించడం జరిగింది
- టీడ్కో గృహాల ఓటర్ల మ్యాపింగ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలి: నవతరం పార్టీ
- అక్రమ సంబంధం నేపథ్యంలో దారుణ హత్య.. భార్యాభర్తల అరెస్ట్
- నియోజకవర్గంలో టీడీపీ విజయం శాశ్వతం కావాలి : ప్రత్తిపాటి పుల్లారావు
- మోదీ రికార్డు ఎప్పటికీ చెక్కు చెదరదు : ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు
- చిలకలూరిపేటలో టైర్ పేలి అదుపుతప్పిన కారు.. ఐదుగురికి స్వల్ప గాయాలు
- జిల్లాలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్- సర్ (ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ) ప్రక్రియలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి



