Author: chilakaluripetalocalnews@gmail.com

మెగా వైద్య శిభిరాన్ని విజయవంతం చేయండి…. డాక్టర్ ముద్దన రమేష్ బాబు చిలకలూరిపేట శాసన సభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు పుట్టిన రోజు సందర్భంగా ఈ నెల 29వ తేదీన శంకర్ కంటి ఆసుపత్రి సహకారంతో నిర్వహించే ఉచిత మెగా నేత్ర వైద్య సేవలను పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ప్రముఖ వైద్యులు, ఐ యం.ఏ. చిలకలూరిపేట అధ్యక్షులు డా. ముద్దన రమేష్ బాబు కోరారు. కార్పొరేట్ వైద్యాన్ని చిలకలూరిపేటకు తీసుకువస్తున్న పుల్లారావు సేవలు వెలకట్టలేనివన్నారు. కేవలం శుక్లాలు మాత్రమే కాకుండా కంటికి సంబంధించిన అన్నిరకాల పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేస్థారన్నారు. ఈ కార్యక్రమంలో క్యాంప్ కన్వీనర్ కంచర్ల శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.

Read More

చిలకలూరిపేట పట్నంలోని 30 వ వార్డు తెలుగుదేశం పార్టీ నూతన కమిటీ చిలకలూరిపేట పట్నంలోని 30 వ వార్డు తెలుగుదేశం పార్టీ నూతన కమిటీలను ప్రకటించిన సందర్భంగా మాజీమంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావుని కలిసి పదవులు దక్కిన వారు శాసనసభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు. 30 వ వార్డు లో పదవులు దక్కిన వారికి మాజీమంత్రి,శాసనసభ్యులు శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. 30 వార్డ్ లో పదవులు దక్కిన వారికి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు శుభాకాంక్షలు తెలియజేశారు

Read More

గురువారం (15.05.2025)టిడిపి పార్లమెంటరీ పార్టీ నేత, గౌరవ నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు గారి షెడ్యూల్ ఉదయం 9 గంటలకు.. కారంపూడిలో, శ్రీ పద్మావతి శ్రీనివాస కళ్యాణం మండపంలో.. బొల్నేడి శ్రీనివాసరావు ( వేపకంపల్లి నాయకులు) గారి కుమార్తె వివాహం. ఉదయం 9.30 గంటలకు.. పిడుగురాళ్ల మండలం, గుత్తి కొండ గ్రామంలో,, బండ్ల వెంకటేశ్వర్లు గారి కుమారుడు వివాహం సందర్భంగా సత్యనారాయణ స్వామి వ్రతం. ఉదయం 10 గంటలకు.. పిడుగురాళ్లలో.. జానపాడు వెళ్లే మార్గంలో.. ఆర్ఓబి శంకుస్థాపన. తర్వాత.. పిడుగురాళ్ల మండలం తుమ్మలచెరువు గ్రామంలో, చెట్టు దగ్గర, వీర్ల పిచ్చయ్య గారి కుమారుడు వివాహం సందర్బంగా హౌస్ విజిట్ పిడుగురాళ్ల మండలం, వీరాపురం గ్రామంలో.. గొడవర్తి రామకృష్ణ గారి కుమారుడి వివాహం సందర్బంగా హౌస్ విజిట్. తర్వాత పిడుగురాళ్ల పట్టణంలో, జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణంలో,,, పబ్లిక్ గ్రీవెన్స్ పిడుగురాళ్ల పట్టణంలోని, మార్కెట్ యార్డ్ లో,, గురజాల నియోజకవర్గస్థాయి రివ్యూ…

Read More

మాజీ మంత్రి వర్యులు శ్రీమతి విడదల రజిని చిలకలూరిపేట లోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన సత్తెనపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ రెడ్డి.

Read More

31 వ వార్డు తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్రెటరీగా నియమితులైన కూనపురెడ్డి రాజేంద్రప్రసాద్. మాజీ మంత్రి,శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఆదేశాల మేరకు 31 వ వార్డు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుల పర్యవేక్షణలో పురుషోత్తపట్నంలో తెలుగుదేశం పార్టీ నూతన కమిటీ లో 31 వ వార్డు తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్రెటరీగా నియమితులైన కూనపురెడ్డి రాజేంద్రప్రసాద్. కూనపరెడ్డి రాజేంద్రప్రసాద్ కు పదవి దక్కడంతో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు శుభాకాంక్షలు తెలియజేశారు

Read More

రేపల్లె మున్సిపల్ ఆఫీస్ కు బదిలీ అయినా TPo సుజాత చిలకలూరిపేట:టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ గా పనిచేస్తున్న కె.సుజాత కు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గా ప్రమోషన్ మీద ,, రేపల్లెకు బదిలీచేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన మున్సిపల్ శాఖ.

Read More

వాహనాలకు నెంబర్ ప్లేట్లు లేకుండా యదేచ్చేగా రోడ్ల మీద ప్రయాణం,, ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరి మీద ఫిర్యాదు చేయాలో అర్థం కాని అయోమయం.. లోక్ సత్తా.. వినుకొండ దగ్గర్లో జరిగిన రోడ్డు ప్రమాదం కారణంగా నలుగురు ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమని లోక్ సత్తా పార్టీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ మాదాసు భాను ప్రసాద్ అన్నారు.ప్రమాదం జరిగినప్పుడు వాటి గురించి మాట్లాడుకోవడం మినహా ప్రమాదాల నివారణకు పటిష్టమైన చర్యలు తీసుకోవడం లేదని అన్నారు.ఇవన్నీ నివారించతగిన ప్రమాదాలని భాను ప్రసాద్ అన్నారు.ప్రపంచంలో ఈ మాదిరిగా మరే దేశంలో రోడ్డు ప్రమాదాల కారణంగా ప్రాణా నష్టం జరగట్లేదు అని అన్నారు. అయినా, అధికారులు అలసత్వం వీడి పటిష్టమైన చర్యలు చేపట్టడంలో విఫలమవుతున్నారని అన్నారు. చిలకలూరిపేట పట్టణంలో వాహనాలకు నెంబర్ ప్లేట్లు లేకుండా యదేచ్ఛగా తిరగడుతూ ప్రమాదాలకు కారణమవుతున్న పట్టించుకునే నాధుడే లేరని అన్నారు.వాహనాలకు నెంబర్ ప్లేట్లు వాడకుండా నేరాలకు పాల్పడిన, యాక్సిడెంట్స్ చేసి…

Read More

నరసరావుపేట పట్టణం, ప్రకాష్ నగర్ నందు ఈరోజు పాపసాని చిన్న రామయ్య కుమార్తెల ఓణీల ఫంక్షన్ సందర్భంగా వారి ఇంటికి వెళ్లి ఆ చిన్నారులను ఆశీర్వదించిన మాజీ మంత్రివర్యులు, చిలకలూరిపేట శాసనసభ్యులు శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారు, ఈ కార్యక్రమంలో నాదెండ్ల మండలం అధ్యక్షులు బండారుపల్లి సత్యనారాయణ గారు, కడియాల రమేష్ గారు, ఆదినారాయణ గారు తదితరులు ఆశీర్వదించడం జరిగింది.

Read More

పిడుగు పాటుకు ఒకరు మృతి యడ్లపాడు మండలంలో బుధవారం సాయంత్రం పిడుగు పడి ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు స్ప్రుహ కోల్పొయి ప్రాణాపాయం నుండి బయటపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కారుచోల గ్రామానికి చెందిన 15 మంది మహిళలు మిర్చికోతలకు వెళ్లారు. ఈ నేపథ్యంలో సాయంత్రం సుమారు 5 గంటలకు ఉరుములు, మెరుపులు రావడంతో పనులు నిలుపుదల చేసి ఇళ్లకు వెళ్లాలని పొలం నుండి రోడ్డుపై ఉన్న ఆటో వద్దకు బయలు దేరారు. కొందరు వడివడిగా ముందుకు వెళ్లగా వెనుక వస్తున్న వారికి సమీపాన పిడుగు పడిన భారీ శబ్ధం వినిపించింది. దీంతో ముగ్గురు మహిళలు కింద పడిపోయారు. రోడ్డుపైకి వచ్చిన మహిళలు వెనక వారు ఇంకా రాలేదని వెళ్లి చూడగా ముగ్గురు మహిళలు పొలంలో పడిపోవడం గమనించి కేకలు వేయగా, రైతులు పరుగున వచ్చి చూశారు. వారిలో షేక్‌ పర్వీన్‌(35) అనే మహిళ చెవుల నుండి రక్త…

Read More

వైభవో పేతంగా వాసవీమాత ప్రతిష్టా మహోత్సవం యడ్లపాడు మండలంలోని ఉన్నవ గ్రామం ఆధ్మాతిక కార్యక్రమాలతో బుధవార కళకళలాడింది. గ్రామంలో నూతనంగా నిర్మించిన ఆలయంలో పలు దేవతామూర్తుల విగ్రహాలు ప్రతిష్టించారు. బుధవారం ఉదయం 9.27 గంటలకు తపోవ్రతాన్ని, అహింసా సూత్రాన్ని పాటించిన శాంతి స్వరూపిణి..వైశ్యుల కులదైవమైన శ్రీవాసవీ కన్యాక పరమేశ్వరీదేవి అమ్మవారి ప్రతిష్టా మహోత్సవం వైభవోపేతంగా జరిగాయి. ఇందులో భాగంగా మహాగణపతి, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, సింహవాహన, విమాన కలశాల ప్రతిష్ఠలు డాక్టర్‌ జంధ్యాల వెంకట రామలింగేశ్వరశాస్త్రి పర్యవేక్షణలో వేద మంత్రోచ్ఛారణల నడుమ ఘనంగా నిర్వహించారు. అనంతరం గణపతి పూజ, పుణ్యాహవాచనం, కడన్యాసము, హోమం, నేత్రోన్మీలనం, మహా కుంభాభిషేకం, ధేను దర్శనం, మహా పూర్ణాహుతి వంటి పూజా కార్యక్రమాల్లో గ్రామస్తులే కాకుండా సమీప ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తుగా హాజరై అమ్మవారిని దర్శించి పూజించి తరించారు. ఈ ఆధ్మాత్మిక కార్యక్రమానికి హాజరైన వేలాది భక్తులకు దేవస్థాన కమిటీ అన్నసంతర్పణ ఏర్పాటు చేశారు. ఉదయం నుండి సాయంత్రం…

Read More