ఈజిప్టులో పర్యటిస్తున్న బృందం
ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు వ్యూహాత్మక ప్రణాళికతో ప్రపంచ పర్యటన నిర్వహిస్తున్న అఖిలపక్ష బృందాల్లో ఒకటైన సుప్రియా సులే నేతృత్వంలోని బృందం ఈజిప్టులో పర్యటిస్తోంది. ముందుగా కైరోలోని జమాలెక్‌లోని అల్-హోర్రెయా పార్కులో మహాత్మా గాంధీ గారికి ఈ ప్రతినిధి బృందం నివాళులర్పించింది. ఈ బృందం ఆ దేశంలోని ప్రస్తుత, మాజీ మంత్రులు, ప్రముఖ రచయితలు, సమాజకర్తలు, నాయకులతో సహా ఈజిప్టులోని కీలక సంభాషణకర్తలతో కూడా చర్చలు జరుపుతోంది. ఉగ్రవాద నిరోధకతపై సన్నిహిత ద్వైపాక్షిక సహకారం గురించి వివరిస్తూ, దేశ సహకారాన్ని కోరారు.
ఈ బృందంలో :
ఎంపీలు.. సుప్రియా సులే, లావు శ్రీకృష్ణ దేవరాయలు, రాజీవ్ ప్రతాప్ రూడీ, మనీష్ తివారీ, అనురాగ్ సింగ్ ఠాకూర్, విక్రమ్‌జీత్ సింగ్ సాహ్నే, ఆనంద్ శర్మ, వి. మురళీధరన్, సయ్యద్ అక్బరుద్దీన్ (ఐక్యరాజ్యసమితికి భారతదేశ మాజీ శాశ్వత ప్రతినిధి) ఉన్నారు.