రేపు నాగార్జున సాగర్ వద్ద యోగాంధ్ర

నరసరావు పేట,జిల్లాలోని ప్రముఖ పర్యాటక పర్యాటక ప్రదేశం నాగార్జునసాగర్ వద్ద రేపు ఉదయం 6 గంటల నుండి 8 గంటల వరకూ సామూహిక యోగా కార్యక్రమం నిర్వహించనున్నామని జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు వెల్లడించారు.

యోగాంధ్ర మాసోత్సవాల్లో భాగంగా జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో కార్యక్రమాలు నిర్వహించి యోగా అవశ్యకతను ప్రజల్లోకి తీసుకువెళ్తున్నామన్నారు.

మే 28న ఇప్పటికే కోటప్పకొండపై సామూహిక యోగా నిర్వహించామన్నారు. జూన్ 11న కొండవీడు కోటపై, జూన్ 18న అమరావతి ధ్యాన బుద్ధ విగ్రహం వద్ద సామూహిక యోగా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.

Share.
Leave A Reply