పురుగుల మందు తాగి భర్త ఆత్మహత్య ..దూరం పెట్టిందని తీవ్ర మనస్తాపం

చిలకలూరిపేట రూరల్ మురికిపూడి విషాదంచోటుచేసుకుంది. పెళ్లైన నెల రోజులకే భార్య తనను దగ్గరకు రానివ్వడం లేదనే తీవ్ర మనస్తాపంతో ఓ భర్త పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మురికిపూడి గ్రామంలో జరిగింది.మురికిపూడికి చెందిన బొమ్మన బోయిన వీరాంజనేయులు (23) అదే గ్రామానికి చెందిన యువతిని వివాహం చేసుకున్నారు. పెళ్లై నెల రోజులు గడుస్తున్నా భార్య తనను దగ్గరకు రానివ్వకపోవడంతో వీరాంజనేయులు తీవ్రంగా కుమిలిపోయేవారు. ఇదే విషయాన్ని పదేపదే గుర్తు చేసుకుంటూ పొలంలోకి వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు.
పురుగుల మందు తాగిన విషయాన్ని వీరాంజనేయులు తన స్నేహితులకు తెలియజేశారు.

వెంటనే వారు వీరాంజనేయులును పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న చిలకలూరిపేట రూరల్ పోలీసులు ఆసుపత్రికి చేరుకుని మరణ వాంగ్మూలం నమోదు చేసుకున్నారు.తన భార్య మరొక వ్యక్తిని ప్రేమించిన కారణంగా తనతో దాంపత్య జీవితానికి అంగీకరించలేదని వీరాంజనేయులు మరణ వాంగ్మూలంలో పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ అనిల్ తెలిపారు

Share.
Leave A Reply