ప్రమాదంలో చనిపోయిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుని కుటుంబానికి 5 లక్షల రూపాయల చెక్కు అందజేత.
చిలకలూరిపేట, నాదెండ్ల మండలం, గణపవరం గ్రామానికి చెందిన జనసేన పార్టీ క్రియాశ్రీలక సభ్యుడు గజ్జ. శ్రీకాంత్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం జరిగింది. అతడు జనసేన పార్టీ క్రియా శిలక సభ్యత్వం ఉండటం వలన పార్టీ నుండి ఐదు లక్షల ప్రమాద బీమా చెక్కును వారి కుటుంబ సభ్యులకు సోమవారం మంగళగిరిలోని ఆర్ ఆర్ ఆర్ ఫంక్షన్ హాల్ వేదికగా ఎమ్మెల్సీ శ్రీ కె .నాగబాబు గారు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా మంగళవారం స్థానిక పార్టీ కార్యాలయంలో శ్రీకాంత్ కుటుంబ సభ్యులు జనసేన సమన్వయకర్త తోట రాజా రమేష్ గారిని కలిసి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ సందర్భంగ రాజా రమేష్ మాట్లాడుతూ దేశంలోనే రాజకీయ పార్టీల కార్యకర్తల బాగోగులు గురించి ఆలోచించే పార్టీ జనసేన అని అన్నారు. చనిపోయిన శ్రీకాంత్ కుటుంబ సభ్యులకు పార్టీ తరఫున పూర్తిగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు మండలనేని చరణ్ తేజ్, జిల్లా సంయుక్త కార్యదర్శి షేక్. సుభాని, పఠాన్ ఖాదర్ బాషా, పాపన హనుమంతరావు, శరత్, సాయి తదితరులు పాల్గొన్నారు.
Trending
- మండలనేని సుబ్బారావు పుట్టినరోజు
- దత్త సాయి సన్నిధి లో విష్ణు సహస్ర నామ పారాయణ భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమం —-
- డీఎస్సీ నియామకాలను వెంటనే చేపట్టాలి -ఎస్టీయూ
- ఆగస్ట్ 15 తర్వాత సంక్షేమం అమల్లో దేశంలో ఏపీనే టాప్ : ప్రత్తిపాటి.
- సోనా ప్రసాద్ చేస్తున్న పాదయాత్రకు మద్దతు తెలియజేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు
- మర్రి శ్రీనాథ్ పుట్టినరోజు వేడుకలు
- జనసేన ఆధ్వర్యంలో పట్టణంలో 26వ వార్డులో వృద్ధురాలికి చేయూత
- యోగాంధ్రతో ప్రపంచ రికార్డు