Author: chilakaluripetalocalnews@gmail.com

ప్రముఖ శైవ క్షేత్రంగా పేరుగాంచిన కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామివారిని ప్రముఖ సినీ నటుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత రాజేంద్రప్రసాద్ ఆదివారం ఉదయం దర్శించుకున్నారు స్వామివారి సన్నిధికి విచ్చేసిన ఆయనకు బీసీ వెల్ఫేర్ శాసనసభ కమిటీ సభ్యులు, నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద బాబు గారు ఆలయ ప్రాంగణంలో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా త్రికోటేశ్వర స్వామివారికి నిర్వహించిన ప్రత్యేక అభిషేకాలు, పూజా కార్యక్రమాలలో సినీ నటుడు రాజేంద్రప్రసాద్, ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు గారు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. కోటప్పకొండ వైభవం, మహాశివరాత్రి తిరుణాళ్ల సందర్భంగా చేపడుతున్న విస్తృత ఏర్పాట్ల గురించి ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు గారు రాజేంద్రప్రసాద్‌కు వివరించారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని సుమారు 20 నుంచి 25 లక్షల మంది భక్తులు కోటప్పకొండకు విచ్చేసే అవకాశముందని తెలిపారు.

Read More

చిలకలూరిపేటలో వినూత్న మోసం: వ్యాపారులు జాగ్రత్త చిలకలూరిపేట: పట్టణంలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. అమాయక వ్యాపారుల నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని వేల రూపాయలు కాజేస్తున్నారు. తాజాగా మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్‌లోని ఒక చికెన్ సెంటర్‌లో జరిగిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. అసలేం జరిగిందంటే?మున్సిపాలిటీ గదుల్లో చికెన్ వ్యాపారం నిర్వహిస్తున్న దస్తగిరి అనే వ్యాపారి వద్దకు ఒక వ్యక్తి సూటు, బూటు ధరించి నాగరికుడిలా వచ్చాడు. తొలుత రూ. 1000 విలువైన మాంసాన్ని కొనుగోలు చేసి, ఆ మొత్తాన్ని ఆన్‌లైన్ ద్వారా చెల్లించాడు. ఆ డబ్బులు ఖాతాలో జమ కావడంతో వ్యాపారి అతడిని నమ్మాడు.ఆ తర్వాత, తనకు అత్యవసరంగా నగదు కావాలని, మీ ఖాతాకు రూ. 20,000 పంపిస్తానని, అది చూసుకుని తనకు నగదు ఇవ్వాలని సదరు వ్యక్తి కోరాడు. వ్యాపారి సరేననడంతో, తన మొబైల్‌లో డబ్బులు పంపినట్లుగా ‘సక్సెస్‌ఫుల్’ అని మెసేజ్ చూపించాడు. వ్యాపార తొందరలో ఉన్న దస్తగిరి, ఆ…

Read More

అద్భుతమైన నిర్మాణాలు.. శిల్పకళ, చిత్రకళ, జలకళకు ప్రతీక కొండవీడు రెడ్డిరాజుల ఏలుబడిలో ఆనాడే తెలుగు సాహిత్యం, చిత్రకళ, శిల్పకళ, యుద్ధ నైపుణ్యాలకు, శత్రు రక్షణకు ప్రధాన స్థావరంగా కొండవీడు కోట నిలిచిందని, ఇక్కడ చేసేది సామాన్య ట్రెక్కింగ్ కాదని, మన చరిత్రతో సంభాషిస్తూ, మన పూర్వీకులతో కలిసి అడుగులు వేయడం అని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. కొండవీడు ఉత్సవాల్లో భాగంగా తొలిరోజు ఉత్సవాలకు ప్రత్యేక అతిథిగా విచ్చేసిన ఆయన అతిథులు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు, స్థానిక శాసనసభ్యులు, మాజీమంత్రి ప్రత్తిపాటితో కలిసి కొండవీడు ఉత్సవాలను లాంఛనంగా ప్రారంభించారు. తొలుత ఉత్సవాలకు విచ్చేసిన కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీ లావు, ఎమ్మెల్యే ప్రత్తిపాటికి అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఉత్సవాల ప్రాంగంణంలో ఏర్పాటుచేసిన వేదికపై నుంచి వారు ప్రసంగించారు. తెలివైన ప్రణాళికలు, దూరదృష్టి నిర్మాణాలకు ప్రతీకలు కొండవీడు నిర్మాణాలు…

Read More

కొండవీడు అభివృద్ధికి “చతుః షష్టి కళల రేడు — మన కొండవీడు” నినాదాన్ని స్వీకరించాలి పల్నాడు జిల్లా కలెక్టర్‌కు చిలకలూరిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త రాష్ట్ర కాంగ్రెస్ మాజీ ప్రధాన కార్యదర్శి ఎం. రాధాకృష్ణ ఎడ్లపాడు మండల కాంగ్రెస్ నాయకుల విజ్ఞప్తి చారిత్రక ప్రాధాన్యత కలిగిన కొండవీడు కోటను అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు పల్నాడు జిల్లా కలెక్టర్ శ్రీమతి కృతికా శుక్లా చూపిస్తున్న చొరవ అభినందనీయమని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త మరియు రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి ఎం. రాధాకృష్ణ పేర్కొన్నారు. కొండవీడు ఫెస్టివల్ ఏర్పాట్ల పరిశీలనలో ఉన్న జిల్లా కలెక్టర్‌ ను కలిసి రాధాకృష్ణ కాంగ్రెస్ నాయకులు ఒక వినతిపత్రాన్ని సమర్పించారు.ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ గతంలో ప్రసిద్ధ శివ క్షేత్రమైన కోటప్పకొండను “కోటి వేల్పుల అండ– కోటప్పకొండ” అనే నినాదంతో అభివృద్ధి చేసిన తీరును వివరించి, అదే స్ఫూర్తితో కొండవీడు అభివృద్ధికి “చతుః షష్టి…

Read More

మాచర్ల పట్టణంలో జనతా వారధి కార్యక్రమం నిర్వహించడం జరిగింది మాచర్ల పట్టణంలో జనతా వారధి కార్యక్రమం మాచర్ల పట్టణ అధ్యక్షుడు ఓర్సు క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది . ఈ కార్యక్రమంలో పలు సిసి రోడ్ల గురించి ఫిర్యాదులు స్వీకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం కన్వీనర్ బొగ్గవరపు మస్తాన్ రావు గారు కో కన్వీనర్ సురేష్ బాబు శివ కోటయ్య నాయక్ బిజెపి సీనియర్ నాయకులు పోకూరి కాశీపతి పట్టణ ఉపాధ్యక్షుడు మారం వంశీకృష్ణ బిజెపి నాయకులు మొగిలి అద్దయ్య పాల్గొన్నారు

Read More

భారత ప్రధాన మంత్రి మాన్య శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన జనతా వారధి కార్యక్రమంలో నకరికల్ మండల ఇన్చార్జిగా పాల్గొని మండల ప్రజల యొక్క సమస్యలు తెలుసుకొని వారి నుంచి వినతులు స్వీకరించి సంబంధిత అధికారులు పంపించటం జరిగింది. నకరికల్లు మండలంలో జనతా వారిది కార్యక్రమం నిర్వహించడం జరిగింది అధ్యక్షులు మున్వర్ బాజీ గారు,మండల సీని నాయకులు అనుమోలు శ్రీనివాసరావు గారు,మండల ప్రధాన కార్యదర్శి మోహన కృష్ణ గారు,కోటపాటి వీరాంజనేయులు గారు, ఎర్ల నాగరాజు గారు తదితర నాయకులు,అభిమానులు పాల్గొన్నారు

Read More

జనతా వారిది కార్యక్రమంలో భాగంగా కట్టమూరు గ్రామంలో రైతు కల్లూరి నరసింహారావు తన సమస్యను సత్తెనపల్లి మండలం కో కన్వీనర్ జవాజి రమణకు అర్జీ ఇవ్వడం జరిగింది జనతా వారిది కార్యక్రమంలో భాగంగా కట్టమూరు గ్రామంలో రైతు కల్లూరి నరసింహారావు తన సమస్యను సత్తెనపల్లి మండలం కో కన్వీనర్ జవాజి రమణకు అర్జీ ఇవ్వడం జరిగింది తక్షణమే మేము తాసిల్దారు గారికి సమస్యలను వారి వద్దకు తీసుకెళ్లగా కల్లూరు నరసింహారావు భూమిని ఆన్లైన్ అడంగల్ వెబ్ నందు తప్పు సర్వే నెంబర్ నమోదు అవ్వటం వల్ల మిగిలిన రైతులు కూడా ఇబ్బంది పడటం జరిగింది. దానిని ఎమ్మార్వో గారి దృష్టికి కన్వీనర్ సురేష్ గారు కోకన్వీనర్ జవాజీ రమణ మరియు బిజెపి కార్యకర్తలు తోటపాలెం ఏలియా, నెల్లూరి నరేంద్రబాబు, ప్రసాదు గ్రామతీసుకెళ్లి పక్కన రైతులు సమస్యను వివరంగా చెప్పడం జరిగింది తక్షణమే తాసిల్దారు గారు సర్వేయర్ మరియు విఆర్ఓ రోవర్ తో…

Read More

శ్యావల్యాపురం మండలం వేల్పూరు గ్రామంలో జనతా పార్టీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది కేంద్ర రాష్ట్ర బిజెపి పార్టీ ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశి కుమార్ గారు శావల్యాపురం మండల సీనియర్ నాయకులు అడుసుమల్లి వీరేంద్ర గారు ఈపూరు మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ శ్రీ గోరంట్ల సత్యనారాయణ గారు వినుకొండ నియోజకవర్గం మాజీ కన్వీనర్ శ్రీ యార్లగడ్డ లెనిన్ కుమార్ గారి సూచనల మేరకు ఈరోజు జనతా వారిది కార్యక్రమాన్ని శావల్యాపురం మండల అధ్యక్షుడు గట్టుపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వేల్పూరు గ్రామంలో నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా వేల్పూరు గ్రామంలో ఇంటర్ ఇంటర్మీడియట్ విద్యకు సంబంధించి జిల్లా పరిషత్ హై స్కూల్ ప్లస్ టు ని రెండు సంవత్సరాల క్రితం ప్రభుత్వం మంజూరు చేసినప్పటికీ ఇంతవరకు లెక్చరర్స్ ని లేడీస్ హాస్టల్ మంజూరు చేయలేదని వచ్చే విద్యా సంవత్సరానికైనా…

Read More

పల్నాడు జిల్లా జనతా వారిది టీం ఆధ్వర్యంలో గురువారం గురజాల లొ జనతా వారధి కార్యక్రమం నిర్వహించడం జరిగింది రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పి వి ఎన్ మాధవ్ గారు ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరు శశి కుమార్ గారి నేతృత్వంలో 05-02-2026 వ తేది గురువారం గరజాల పాత పాట అమ్మవారు గుడి సెంటర్ లో జనతా వారధి కార్యక్రమనికి పల్నాడు జిల్లా జనతా వారధి కన్వినర్ మరియు పల్నాడు జిల్లాఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు ముఖ్య అతిధిగా పాల్గొని ప్రజల వద్దనుండి పిర్యాదులు స్వీకరించరు. ఈ కార్యక్రమం లొ గురజాల మండల బిజెపి జనతా వారిది కన్వీనర్ పిండి రామాంజనేయులు మండల అధ్యక్షురాలు నాగమణి సీనియర్ నాయకులు కో కన్వీనర్ తవిటి రమేష్ కంచుకోటయ్య గారు ఇమిటి శెట్టి శ్రీనివాసరావు గారు .ఫిర్యాదులు. పాగళ్ళు క్రాంతి పసుపులేటి వేణుగోపాల్ ఫిర్యాదులు ఇచ్చారు సదరు ఈ విషయం…

Read More

ఆధ్యాత్మిక‌ గురువు సంత్ ర‌విదాస్ జ‌యంతి సందర్బంగా చెప్పులు కుట్టే వారిని బీజేపీ తరుపున ఘనంగా సన్మానించడం జరిగింది కులభేదాలు, అసమానతలు లేని సమాజం, సమానత్వం, ప్రేమయే జీవన మార్గమని మాన‌వాళికి బోధించిన ఆధ్యాత్మిక‌ గురువు సంత్ ర‌విదాస్ జ‌యంతి శుభాకాంక్ష‌లు చిలకలూరిపేట బీజేపీ తరుపున తెలియజేస్తూ ఈ సందర్భంగా వారి బోధనలను గుర్తు చేసుకున్నారు సంత్ రవిదాస్ గారి జన్మదిన ఉత్సవాలలో భాగంగా ఈరోజు చిలకలూరిపేట పట్టణం లొ చర్మకారులను ఘనంగా బీజేపీ తరుపున దుశ్యాలువ తో సన్మానించారు ఈ కార్యక్రమం లొ పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు పట్టణ ప్రధాన కార్యదర్శి సింగిరేసు పోలయ్య పట్టణ మాజీ అధ్యక్షులు దడబడ పుల్లయ్య మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ మహబూబ్ సుభాని పట్టణ కార్యదర్శి గుమ్మా బాలకృష్ణ పట్టణ ఉపాధ్యక్షులు కోటా చంద్ర ఆఫీసు ఇన్చార్జి జోలపురం రాయుడు బీజేపీ నాయకులు సల్మాన్ మహిళా నాయకురాలు రాణి…

Read More