Author: chilakaluripetalocalnews@gmail.com

ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిజెపి పార్టీ ఆఫీస్ విజయవాడ నందు మన ప్రియతమ నేత మాధవన్ గారు రాష్ట్ర బాధ్యతలు స్వీకరించినారు ఈ సందర్భంగా పల్నాడు జిల్లా అధ్యక్షులు శ్రీ ఏలూరు శశి కుమార్ గారి ఆధ్వర్యంలో నేను బిజెపి పార్టీ లోకి చేరడం జరిగింది నాతోపాటు చిలకలూరిపేట నియోజకవర్గ నుండి 100 మంది కార్యకర్తలు బిజెపి పార్టీ కండువా కప్పుకొని పార్టీని సంస్థాపకతంగా ముందుకు తీసుకెళ్లటానికి కృషి చేస్తామని ప్రమాణం చేసినారు. ఈ కార్యక్రమంలో చిలకలూరిపేట నియోజకవర్గ బిజెపి కన్వీనర్ తాడిపర్తి జయరామిరెడ్డి కో కన్వీనర్ మల్లెల శివ నాగేశ్వరరావు మాజీ పట్టణ అధ్యక్షులు పోత్తూరి బ్రహ్మానందం జిల్లా కో కన్వీనర్ బండారు నాగరాజు ఎడ్లపాడు మండల అధ్యక్షులు తులాబందుల సత్యనారాయణ బీజేవైఎం స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ పుల్లుగుజ్జు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Read More

మాజీ మంత్రి శ్రీమతి విడుదల రజిని ఆదేశానుసారం పట్టణ అధ్యక్షులు షేక్ ధరియావలి మరియు పల్నాడు జిల్లా యూత్ ప్రెసిడెంట్ కందుల శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఘనంగా వైయస్సార్ 76వ జయంతి వేడుకలు ఈరోజు డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 76వ జయంతి సందర్భంగా చిలకలూరిపేట నియోజకవర్గం లోని పలు గ్రామాలలో మరియు పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఆయన విగ్రహాలకి పూలమాలలు వేసి,పాలాభిషేకం చేసి ఆయనకి నివాళులర్పించారు. ముందుగా మాజీ మంత్రి శ్రీమతి విడదల రజని గారి నివాసంలో డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి కేక్ కటింగ్ కార్యక్రమం జరిగింది. తరువాత వైయస్సార్ అభిమానులు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పలువురు నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా రక్తదానం చేయడం జరిగింది. ముందుగా పల్నాడు జిల్లా యూత్ ప్రెసిడెంట్ మరియు యువ నాయకుడు కందుల శ్రీకాంత్ రక్తదానం చేయడంతో పలువురు యువకులు కూడా ఆయనను స్ఫూర్తిగా తీసుకొని స్వచ్ఛందంగా…

Read More

చంద్రబాబు ఏడాది పాలన….. రాష్ట్రప్రగతికి బాటలు వేసింది : ప్రత్తిపాటి. జగన్ విధ్వంస విద్వేష పాలన నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించడంతో పాటు ప్రజల సంతృప్తి… రాష్ట్ర ప్రగతికి బాటలు వేసేలా ఏడాదిలో కూటమిప్రభుత్వం గొప్పవిజయాలు సాధించిందని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. మంగళవారం ఆయన పట్టణంలోని 34, 35 వార్డుల్లో ఇంటింటికీ తిరిగి ప్రజలతో మమేకమై, కూటమిప్రభుత్వ ఏడాది ప్రగతిని వివరించారు. అంతకు ముందు పార్టీ శ్రేణులతో సమావేశమై కూటమిప్రభుత్వ పనితీరును ప్రజలకు వివరించడంపై వారికి దిశానిర్దేశం చేశారు. మన నాయకుడు చేసినమంచిని కాలర్ ఎగరేసి గర్వంగా చెప్పుకుందాం.. జగన్ ఐదేళ్లలో సాధించలేనిది.. చంద్రబాబు ఏడాదిలోనే సాధించారని, కూటమిప్రభుత్వ సుపరిపాలనను ప్రజలకు అర్థమయ్యేలా పార్టీ శ్రేణులు వివరించాలని ప్రత్తిపాటి సూచించారు. వైసీపీ నాయకుల్లా మాయమాటలు చెప్పి ప్రజల్ని మోసగించలేదని.. అందరం గర్వంగా చెప్పుకునేలా మన నాయకుడు సంవత్సరంలోనే ఎన్నో మంచిపనులు చేశారని ప్రత్తిపాటి స్పష్టంచేశారు.

Read More

గంజాయి, డ్రగ్స్, స్మగ్లింగ్ చేస్తే తాట తీస్తా….. నిషేధిత గంజాయి అమ్మితే చట్ట పరంగా కఠిన చర్యలు తీసుకుంటాం చిలకలూరిపేట పట్టణంలో గంజాయి, డ్రగ్స్ స్మగ్లింగ్ పై ఉక్కుపాదం మోపిన పోలీసులు టౌన్, రూరల్ పరిధిలో ఉన్న వ్యాపార సంస్థలు పై పోలీసులు దాడులు యువతను నాశనం చేసే పదార్థాలు అమ్మితే చర్యలు తీసుకుంటామన్నా పట్టణ CI రమేష్ గ్రామీణ ప్రాంతాల్లో గంజాయి విక్రయిస్తే కేసులు నమోదు చేస్తాం… SI అనీల్ చిలకలూరిపేట మండలం లోని పలు గ్రామాల్లో పర్యటించి బడ్డి కోట్లపై దాడులు చేసి, విస్తృతంగా తనిఖీలు నిర్వహించిన SI అనీల్

Read More

కేసరి యాక్టీవ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్ చీరాల టౌన్ ప్రెసిడెంట్ గా నియమితులైన కారుమంచి వీరాంజనేయులుఈరోజు చిలకలూరిపేట మున్సిపల్ చైర్మన్ షైక్ రఫానీ చేతుల మీదుగా నియామక పత్రం అందుకున్న కారుమంచి వీరాంజనేయులు ఈ నియామక పత్రం అందించిన వారిలో లోకసత్త పార్టీ ఇంచార్జి భానుప్రసాద్ రాధ రంగా మిత్ర మండలి కన్వీనర్ అచ్చుకోల మురళి కృష్ణ తదితరులు పాల్గొన్నారు మల్లెల న్యూస్ ఛానల్ బాపట్ల జిల్లా చీరాల మీడియా ఇంచార్జ్ కేసరి యాక్టీవ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్ అభ్యున్నతికి… పత్రిక విలేకరుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తాను అని కేసరి యాక్టీవ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్ బాపట్ల జిల్లా చీరాల పట్టణ ప్రెసిడెంట్ కారుమంచి వీరాంజనేయులు తెలియజేశారు కేసరి యాక్టీవ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు మల్లెల శివ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నియామక పత్రం అందుకున్న కారుమంచి వీరాంజనేయులు తన ఈ నియామకానికి సహాయ సహకారాలు అందించిన…

Read More

కూటమి ప్రభుత్వానికి అభిప్రాయబేధాల కంటే అభివృద్ధే ముఖ్యం : ప్రత్తిపాటి పురపాలక అధికారులు… సిబ్బంది.. కౌన్సిలర్లు పట్టణాభివృద్ధి, ప్రజాసమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, చెత్తసేకరణ వీధిలైట్లు రోడ్లు.. డ్రైనేజ్ ల నిర్మాణం.. కాలువల శుభ్రత.. తాగునీటి సరఫరాపై ప్రజల నుంచి ఫిర్యాదులు రాకుండా చూడాలని మాజీమంత్రి. శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఆదేశించారు. స్వార్థపరుల బేధాభిప్రాయాల కంటే అభివృద్దే ముఖ్యం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో సోమవారం ఆయన వార్డు కౌన్సిలర్లు, అధికారులతో పట్టణంలో చేపట్టాల్సిన అభివృద్ధిపనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా తమ వార్డుల్లోని సమస్యలపై కౌన్సిలర్లు ప్రత్యేక దృష్టిపెట్టాలని, ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల పరిష్కారంలో చురుగ్గా వ్యవహరించాలని ప్రత్తిపాటి సూచించారు. ఇతర పార్టీల కౌన్సిలర్లు చెప్పినా..చెప్పకపోయినా స్థానికులతో మాట్లాడి ఆయా వార్డుల్లోని సమస్యల్ని కూడా అధికారులే పరిష్కరించాలన్నారు. కూటమిప్రభుత్వం అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తుంది, ప్రజాభిప్రాయాలను గౌరవిస్తుంది తప్ప… స్వార్థపరుల బేధాభిప్రాయాలను కాదని ప్రత్తిపాటి స్పష్టం చేశారు. రూ.5.40 కోట్లతో రోడ్లు..డ్రైనేజ్…

Read More

వ్యాపారులారా, ట్రేడ్ లైసెన్స్ రెన్యూవల్ పేరుతో మోసగాళ్ల బారిన పడకండి మున్సిపల్ కమిషనర్ పి. శ్రీహరిబాబు చిలకలూరిపేటలో కొందరు మోసగాళ్లు మున్సిపల్ కమిషనర్ పేరుతో ఫోన్‌లు చేసి వ్యాపారులను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారు. ట్రేడ్ లైసెన్స్‌ల రెన్యూవల్ చేసుకోవాలని, లేనిపక్షంలో దుకాణాలను సీజ్ చేస్తామని చెప్పి భయపెడుతున్నారు. చాలా మంది వ్యాపారులు ఈ బెదిరింపులకు భయపడి, వారు సూచించిన నంబర్‌కు ఫోన్‌పే ద్వారా డబ్బులు పంపిస్తున్నారు.ఈ విషయం మున్సిపల్ కమిషనర్ పి. శ్రీహరిబాబు దృష్టికి రావడంతో ఆయన తీవ్రంగా స్పందించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మున్సిపల్ కమిషనర్ హెచ్చరిక మున్సిపల్ కమిషనర్ పి. శ్రీహరిబాబు మీడియాతో మాట్లాడుతూ, ట్రేడ్ లైసెన్స్ చెల్లించాలని 9121097923 నంబర్ నుండి వచ్చే ఫోన్ కాల్స్‌ను నమ్మవద్దని, వాటికి స్పందించవద్దని సూచించారు. ట్రేడ్ లైసెన్స్ రెన్యూవల్ ఆన్‌లైన్ ద్వారా మాత్రమే చేయించుకోవాలని, మధ్యవర్తులను లేదా తన పేరుతో వచ్చే ఫోన్ కాల్స్‌ను నమ్మవద్దని ఆయన స్పష్టం…

Read More

కొండవీడులో మొహర్రం ఉత్సవాల్లో పాల్గొన్న ప్రత్తిపాటి మొహరాన్ని పురస్కరించుకొని యడ్లపాడు మండలం కొండవీడులో చేపట్టిన ఉత్సవాల్లో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పాల్గొన్నారు. త్యాగానికి ప్రతీక అయిన మొహరం వేడుకలు ముస్లింలకు అత్యంత ముఖ్యమైనవని ప్రత్తిపాటి చెప్పారు. మొహమ్మద్ ప్రవక్త మనవడు హుస్సేనీ ఆత్మత్యాగానికి గుర్తుగా ముస్లిం సోదరులు జరుపుకునే సంతాప కార్యక్రమాల్లో భాగమైన పీర్ల ఊరేగింపును ప్రత్తిపాటి ప్రారంభించారు. ఊరేగింపును జాగ్రత్తగా గమనించాలని, పూర్తయ్యేవరకు ఎక్కడా ఎలాంటి ఘటనలు లేకుండా చూడాలని స్థానిక పోలీస్ సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట టీడీపీ నాయకులు నెల్లూరి సదాశివరావు, కామినేని సాయిబాబు, బండారుపల్లి సత్యనారాయణ, పలువురు గ్రామ నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

Read More

ప్రత్తిపాటి పుల్లారావు గారి ఆధ్వర్యంలో త్వరలో పేట నియోజకవర్గ ప్రజలకు అందుబాటులోకి రానున్న హెల్త్ చెక్ అప్ ATM , ప్రత్తిపాటి పుల్లారావు పై పలువురు ప్రముఖుల ప్రశంసలుచిలకలూరిపేట నియోజకవర్గంలో ప్రజలందరూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలనే సంకల్పంతో మాజీ మంత్రి వర్యులు, స్థానిక శాసన సభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారి ఆధ్వర్యంలో DHOS (దండమూడి హెల్త్ ఆఫీస్ సర్వీసెస్) హెల్త్ చెక్ అప్ ATM యంత్రాన్ని త్వరలో నియోజకవర్గ ప్రజలకు అందుబాటులోకి తేనున్నారు.15 లక్షల రూపాయల వ్యయంతో కూడిన ఈ యంత్రం ద్వారా 43 రకాల ఆరోగ్య పరీక్షలను చేసి, నివారణా చర్యలను కూడా నిపుణులు సూచించే విధంగా , త్వరలో ప్రత్తిపాటి గార్డెన్ నందు ఈ యంత్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ యంత్రం ద్వారా షుగర్ రాండమ్ టెస్ట్, లిపిడ్ ప్రొఫైల్, బీపీ, హార్ట్ బీట్, ఆక్సిజన్ లెవెల్స్ చెకప్, BMI పరీక్ష,డిజిటల్ హెల్త్ రిపోర్ట్ వంటి అధునాతన పరీక్షలను…

Read More

నాయకులకు, అధికారులకు కృతజ్ఞతలు, శుభాకాంక్షలు: మాదాసు భాను ప్రసాద్ పట్టణాన్ని సుందరంగా, రహదారులను సౌకర్యవంతంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యత!! పట్టణంలో లోక్ సత్తా పార్టీ నాయకులు మాదాసు భాను ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలందరికీ తొలి ఏకాదశి, మొహరం శుభాకాంక్షలు తెలియజేశారు. అందరు భక్తిశ్రద్ధలతో, సంతోషంగా పండుగలను జరుపుకోవాలని ఆయన కోరారు. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం బాగా పెరిగిందని తద్వారా ప్రజలకు సేవలు చేరువ చేయుటకు వీలు కుదురుతుంది అని అన్నారు. యువత ప్రచార ఆర్భాటాలకు దూరంగా ఉండి అవకాశాలను సద్వినియోగం చేసుకొని అభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా, ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఫ్లెక్సీలను తొలగించడం వలన ప్రజల రాకపోకలకు సౌకర్యవంతంగా ఉంటుందని అన్నారు. పోలీసు యంత్రం సీసీ కెమెరాల సాంకేతికతను సద్వినియోగం ఉపయోగించి నేరాలను, రోడ్డు ప్రమాదాలను అరికట్టాలంటే సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉన్న ప్రధాన కూడళ్ళలో ఎటువంటి ఆటంకాలు…

Read More