భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వీరబాల దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది

భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో విజ్ఞాన విహార్ స్కూల్ నందు వీర బాల దివాస్ కార్యక్రమంలో పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు మాట్లాడుతూ చిన్న వయసులోనే దేశం కోసం, ధర్మం కోసం ప్రాణ త్యాగానికి సిద్ధమై, మొఘలుల మత మార్పిడి ఒత్తిడులకు ఏమాత్రం తలవంచక, అసమాన సాహసంతో ధర్మ పరిరక్షణ కోసం శ్రీ గురు గోవింద్ సింగ్ మహారాజ్ పుత్రులు బాబా అజీత్ సింగ్, బాబా జుజార్ సింగ్, బాబా జోరవర్ సింగ్, బాబా ఫతే సింగ్ చేసిన ఆత్మత్యాగం భారత చరిత్రలో స్వర్ణాక్షరాలతో లిఖించబడిన అమర గాథ.
సత్యం, ధర్మం, స్వేచ్ఛ కోసం ప్రాణాలను సైతం లెక్కచేయని ఆ వీర బాలుల త్యాగం ఈ తరతరాలకు ప్రేరణగా నిలుస్తుంది. అతి చిన్న వయసులోనే దేశం కోసం, ధర్మం కోసం ప్రాణ త్యాగానికి సిద్ధమై,మొఘలుల మత మార్పిడి ఒత్తిడులకు ఏమాత్రం తలవంచక,
అసమాన సాహసంతో ధర్మ పరిరక్షణ కోసం ప్రాణాలనే అర్పించినశ్రీ గురు గోవింద్ సింగ్ మహారాజ్ పుత్రులు
మన భారతదేశానికి నిజమైన దేశభక్తి నిర్వచనం.స్వేచ్ఛ, విశ్వాస స్వాతంత్ర్యం, ధర్మ పరిరక్షణ అన్న విలువలు
రాజ్యాధికారాలకైనా, దుర్మార్గ పాలనకైనా లొంగవనివీరి ఆత్మత్యాగం స్పష్టంగా చాటిచెప్పింది.నేడు రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్ఛను ఆస్వాదిస్తున్న మనమంతా,ఆ స్వేచ్ఛ వెనుక ఉన్న ఈ వీర బాలులత్యాగాన్నిమర్చిపోకూడదు వీరత్వాన్ని స్మరించుకుంటూ, వీర్ బాల్ దివస్ సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిద్దాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు పల్నాడు జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు నెల్లూరి ఈశ్వర్ రంజిత్,పల్నాడు జిల్లా కార్యవర్గ సభ్యులు వరికూటి నాగేశ్వరరావు, పట్టణ ఉపాధ్యక్షులు సింగిరేసు పోలయ్య, ఆర్ఎస్ఎస్ పోలూరి శ్యామోహన్ రావు, విజ్ఞాన్ విహార్ హై స్కూల్ హెడ్ మాస్టర్ హరి ప్రసాదరావు, పట్టణ ఉపాధ్యక్షుడు కోటచంద్ర బిజెపి నాయకులు కోమటి వాసు మైనార్టీ మోర్చా అధ్యక్షులు షేక్ మహబూబ్ సుభాని మరియు బిజెపి నాయకులు పాల్గొన్నారు.

Share.
Leave A Reply