Author: chilakaluripetalocalnews@gmail.com

మాజీ జి డి సి సి బ్యాంక్ చైర్మన్ మానం వెంకటేశ్వర్లు గారి మాతృమూర్తి మానం మాణిక్యమ్మ గారు స్వర్గస్తులైనారు, ఆమె పార్దివదేహాన్ని సందర్శించి నివాళులర్పించి, అనంతరం వారి కుటుంబసభ్యులను పరామర్శించిన మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారు…ఈ కార్యక్రమం లో షేక్ కరీముల్లా, నెల్లూరి సదాశివరావు, జవ్వాజి మదన్, బండారుపల్లి సత్యం, మద్దూరి వీరారెడ్డి, శ్రీనివాసరెడ్డి, కందిమళ్ళ రఘురామరావు, సుబ్బారావు, వలేటి హిమంత్, మరియు తదితరులు పాల్గొన్నారు..

Read More

చిలకలూరిపేట పట్టణంలోని, SMS గార్డెన్స్ నందు జరుగుచున్న రోషన్ ట్రేడర్స్ ప్రాప్రైటర్ షేక్ ఉస్మాన్ షరీఫ్ గారి కుమారుని వలిమా వేడుకకు హాజరై, ఆ నూతన వధూవరులు షేక్ అబ్దుల్ రబ్బాని – అర్షియా ఫాతిమాలను ఆశీర్వదించి, వారికి వివాహ శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారు…ఈ వేడుకలో తెలుగుదేశం పార్టీ నాయకులు షేక్ కరీముల్లా గారు, నెల్లూరి సదాశివరావు గారు, జవ్వాజి మదన్ గారు, పఠాన్ సమద్ గారు, మద్దుమాల రవి గారు, గట్టినేని రమేష్ గారు, ముల్లా కరీముల్లా గారు, అరెకట్ల కోటేశ్వరరావు గారు, షేక్ అజార్ గారు మరియు వార్డ్ నాయకులు పాల్గొన్నారు…

Read More

చిలకలూరిపేట పట్టణం మద్దినగర్ వాస్తవ్యులు షేక్ ఉస్మాన్ షరీఫ్ గారి ( రోషన్ ఫ్లైవుడ్స్) కుమారుని వలిమా వేడుక SMS గార్డెన్స్ నందు జరుగుచుండగా ఆ వేడుకకు హాజరై నూతన వధూవరులు షేక్ అబ్దుల్ రబ్బాని – అర్షియా ఫాతిమాలను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలియజేసిన శాసనమండలి సభ్యులు శ్రీ మర్రి రాజశేఖర్ గారు.

Read More

చిలకలూరిపేట పట్టణంలోని, 7వ వార్డ్, డైక్మెన్ కాలనీ కి చెందిన నీలం మాలాద్రి గారి నూతన గృహప్రవేశ కార్యక్రమానికి హాజరై, వారికి శుభాకాంక్షలు తెలియచేసిన మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారు…ఈ వేడుకలో తెలుగుదేశం పార్టీ నాయకులు షేక్ కరీముల్లా గారు, నెల్లూరి సదాశివరావు గారు, జవ్వాజి మదన్ గారు, గట్టినేని రమేష్ గారు, మరియు వార్డ్ నాయకులు పాల్గొన్నారు…

Read More

నూతన ప్రజా పంపిణీ వ్యవస్థను ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు చిలకలూరిపేట:పసుమర్రులో పర్యటించిన శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు అధికారులతో కలిసి నూతన ప్రజా పంపిణీ వ్యవస్థను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఇకనుంచి పేదలు రేషన్ సరుకులను రేషన్ దుకాణాల వద్దే తీసుకోవాలని స్పష్టం చేశారు.ప్రజా పంపిణీ వ్యవస్థలో అవకతవకలకు తావులేకుండా రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుందని ఎమ్మెల్యే పుల్లారావు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఇంటింటికీ రేషన్ సరఫరా జరగలేదని, ఇంటింటికీ రేషన్ సరుకులు పేరుతో ప్రజలను మోసం చేసిన ఘనత జగన్‌దే అని ఆయన విమర్శించారు.అయితే, 65 సంవత్సరాల వృద్ధులు, దివ్యాంగులకు మాత్రం రేషన్ డీలర్లు ఇంటి వద్దకే వచ్చి సరుకులు అందజేస్తారని ఎమ్మెల్యే పుల్లారావు వెల్లడించారు. రేషన్ డీలర్లు ఎవరైనా అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

Read More

చిలకలూరిపేట నియోజకవర్గం, రూరల్ మండలం, వేలూరు గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కట్టా వేణు గారి తల్లి గారైనా కట్టా కిష్టాయమ్మ గారు ఇటీవల మరణించడం జరిగింది, ఈరోజు వారింటికి వెళ్లి వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి, అనంతరం వారి కుటుంబసభ్యులను పరామర్శించిన మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారు…ఈ కార్యక్రమం లో తెలుగుదేశం పార్టీ నాయకులు షేక్ కరీముల్లా గారు, నెల్లూరి సదాశివరావు గారు, జవ్వాజి మదన్ గారు, మురకొండ మల్లిబాబు గారు, షేక్ జానీ బాషా గారు, షేక్ అజార్ గారు మరియు మండల, గ్రామ పార్టీ నాయకులు పాల్గొన్నారు..

Read More

జి డి సి సి బ్యాంక్ మాజీ చైర్మన్ మానం వెంకటేశ్వర్లు కు మాతృ వియోగం.. చిలకలూరిపేట మాజీ జి. డి. సి. సి.బ్యాంక్ చైర్మన్ మానం వెంకటేశ్వర్లు మాతృమూర్తి మానం మాణిక్యమ్మ గారు(89) ఆదివారం స్వర్గస్తులైనారు ఆమె అంతిమయాత్ర సోమవారం ఉదయం 10 గంటలకు గుంటూరు నగరంలోని ఏట్కూరు రోడ్డుకు సమీపంలోని హుడా రోడ్ లో గల కమ్మ శేషయ్య గ్రౌండ్ నందుగల మానం వెంకటేశ్వర్లు సోదరుడి నివాసం నుండి బయలుదేరును . ఈ విషయాన్ని తెలియపరచమైనది…ఇట్లు , కుమారులు మానం వెంకటేశ్వర్లుమానం కోటేశ్వరరావు మానం నారాయణస్వామి.

Read More

జాతీయ రహదారిపై డివైడర్ ను ఢీకొని ఒరిస్సా కార్మికుడు దుర్మరణం మరొకరికి తీవ్ర గాయాలు. గణపవరం జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఘటన మృతిని స్నేహితుడు లిట్టును తీవ్ర గాయాలు. తిమ్మాపురం గ్రామ పరిధిలో ఉన్న తిరుమల స్పిన్నింగ్ మిల్లు లో పని చేసే ప్రీతం మాలిక్ (24)తన సోదరుడు తో కలిసి కంపెనీ వసతి గృహంలో ఉంటున్నాడు. గత రెండు సంవత్సరాలు గా కంపెనీ లో పని చేస్తున్నాడు. తన స్నేహితుడు లిట్టు తో కలిసి ప్రీతం మాలిక్ బైక్ పై చిలకలూరిపేట వచ్చి వెళుతున్న సమయంలో బైక్ అదుపుతప్పి డివైడర్ ను వేగంగా ఢీకొనడంతో ప్రీతం మాలిక్ అక్కడికక్కడే మృతి చెందాడు. తన స్నేహితుడు లిట్టుకు తీవ్రగాయాలయ్యాయి… లిట్టును గుంటూరు వైద్యశాల కు తరలించారు. ఘటన స్థలాన్ని నాదెండ్ల SI పుల్లారావు పరిశీలించి కేసు నమోదు చేశారు.

Read More

చిలకలూరిపేట రూరల్ పోలీసు స్టేషన్లో ASI వెంకటేశ్వర్లు ఉద్యోగ విరమణ గత కొన్ని నెలలు నుంచి రూరల్ సర్కిల్ లో ASI గా విధులు నిర్వహిస్తున్న వెంకటేశ్వర్లు ఘనంగా అభినందించిన పల్నాడు జిల్లా SP శ్రీనివాసరావు ఉద్యోగ విరమణ పొందిన పోలీసు సిబ్బందిని సన్మానించి, అత్మీయ వీడ్కోలు పలికిన పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఉద్యోగ విరమణ అనంతరం ఆయురారోగ్యాలతో కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలని ఆకాంక్షించిన ఎస్పీ

Read More

క్వారీలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం నాదెండ్ల పోలీసులు ఈ మృతదేహాన్ని గుర్తించారు. గణపవరం గ్రామంలోనిక్వారీ గుంతలో మృతదేహం లభ్యం కావడంతో, ఇది ఆత్మహత్యా లేక హత్య చేసి క్వారీలో పడేశారా అనే కోణంలో ఎస్ఐ పుల్లారావు బృందం విచారణ చేపట్టింది. ఈ ఘటన మూడు రోజుల క్రితం జరిగి ఉండవచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు.

Read More