30 లక్షల రూపాయల ఖర్చుతో శాశ్వత తాగునీటి పైపులైన్ల పనులను ప్రారంభించిన కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మరియు శాసన సభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కృష్ణ తేజ
చిలకలూరిపేట నియోజకవర్గం, లింగంగుంట్ల గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో మాజీమంత్రి స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు, కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ కమిషనర్ కృష్ణ తేజ పాల్గొన్నారు. అనంతరం ప్రత్తిపాటి పుల్లారావు, మంత్రి సుభాష్, కృష్ణ తేజ, నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటికి వెళ్లి చంద్రబాబు నాయుడు సంవత్సర కాలంలో ప్రజలకు అందించిన సూపర్ సిక్స్ పథకాలు అన్ని అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అర్హులైన ఏ ఒక్కరికైనా కొన్ని అనివార్య కారణాలతో సూపర్ సిక్స్ పథకాలు రావడం లేదని నాయకుల దృష్టికి కానీ నా దృష్టికి గాని తీసుకువస్తే వారికి ఆ పథకాలు ఎందుకు రావడం లేదు క్షుణ్ణంగా పరిశీలించి వచ్చేలా చర్యలు చేపడతామని తెలియజేశారు. అదేవిధంగా నిన్న బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అనే కార్యక్రమాన్ని మాయ మంత్రి రజిని పెట్టి చంద్రబాబు గురించి నా గురించి అనేక అవాకులు చవాకులు పేలారు. అసలు దొంగల ముఠా అధినేత జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ నాయకులు రజిని, గోపిరెడ్డి, బ్రహ్మనాయుడు ఏ ఒక్కరికైనా చంద్రబాబుని కానీ నన్ను కానీ మా పార్టీ నాయకుల్ని కానీ అనే హక్కు వాళ్లకి ఉందా అని సూటిగా ప్రశ్నించారు. ఇంకా ఆ దొంగల ముఠా పార్టీ నాయకుడు గాని మాయ మంత్రి రజిని కానీ ప్రజలకు ఎన్ని మాయమాటలు చెప్పిన ఇక వైసీపీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని పుల్లారావు స్పష్టత చేశారు.
కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ
లింగంగుంట్ల గ్రామంలో పైపులైన్లు హస్తవ్యస్తంగా ఉండడంతో 30 లక్షల రూపాయల ఖర్చుతో ప్రజలకు శాశ్వతమైన తాగునీటి పరిష్కారాన్ని చూపమని కూటమి ప్రభుత్వంలో ప్రతి క్షణం చంద్రబాబు ప్రజల కోసమే తపన పడుతున్నారని కార్మిక శాఖ మంత్రి సుభాష్ తెలిపారు. గత ఐదేళ్ల పాలనలో చిలకలూరిపేటలో మంత్రిగా పనిచేసిన రజిని మేకప్ కి ఎక్కువగా ప్రాముఖ్యత ఇచ్చారే కానీ పేట అభివృద్ధికి ప్రజల కష్టాలకి ఏనాడు ప్రాముఖ్యత ఇవ్వలేదని రజినీకి చిలకలూరిపేట ప్రజలు సరైన గుణపాఠం చెప్పి 2025 ఎన్నికల్లో పుల్లారావు కి 33 వేల భారీ మెజార్టీతో పేట ప్రజలు గెలిపించుకొని రజినీకి సరైన బుద్ధి చెప్పారని తెలిపారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సంవత్సర కాలంలోనే రాష్ట్ర ప్రజలకు సూపర్ సిక్స్ పథకాలలో గ్యాస్, తల్లికి వందనం, రైతు భరోసా, ఇలా పథకాలనుందించి సంవత్సరంలోనే ప్రజల కన్నీళ్లు తుడిచారన్నారు. ముఖ్యంగా అన్న క్యాంటీన్లు పెట్టి కేవలం 5 రూపాయలకే రోజుకి కొన్ని లక్షల మంది పేదల ఆకలి తీరుస్తున్నారని చంద్రబాబు చేసే సంక్షేమ పథకాల కి ప్రతిపక్ష నాయకులకు కూడా నిద్ర పట్టకుండా చేస్తున్నారని మంత్రి సుభాష్ తెలిపారు



