నూతన కమిటీని ఏర్పాటు చేసిన పల్నాడు జిల్లా బిజెపి అధ్యక్షుడు
పల్నాడుజిల్లా బిజేపి ఉపాధ్యక్షులు గా మల్లెల శివ నాగేశ్వరావు, పల్నాడు జిల్లా సెక్రెటరీ గట్టా హేమ కుమార్
పల్నాడు జిల్లా భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షులుగా చిలకలూరిపేట నియోజకవర్గం లోని చిలకలూరిపేట పట్టణానికి చెందిన మల్లెల శివ నాగేశ్వరరావు ను, పల్నాడు జిల్లా సెక్రెటరీ గట్టా హేమ కుమార్ ని నియమించినట్లు మంగళవారం బిజెపి జిల్లా అధ్యక్షుడు ఏలూరు శశి కుమార్ లిఖితపూర్వక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్బంగా మల్లెల శివ నాగేశ్వరరావు ను, గట్టా హేమ కుమారు ను పలువురు అభినందనలు తెలియజేసారు. బిజెపి పార్టీకి క్రమశిక్షణ గల కార్యకర్తగా పనిచేస్తూ పార్టీ ఆదేశాలకు అనుగుణంగా కార్యక్రమాల ను నిర్వహిస్తున్నానని, నేను నమ్మిన పార్టీ సేవ చేయడం అంటే నా దేశానికి సేవ చేస్తున్నట్లుగా భావిస్తానని, అలాగే పల్నాడు జిల్లా లో పార్టీ ని మరింతగా బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని జిల్లా ఉపాధ్యక్షులు గా నియమించిన రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ కు, పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరు శశి కుమార్ కు ధన్యవాదాలు తెలియజేసారు
ఈ కార్యక్రమంలో చిలకలూరిపేట నియోజకవర్గ కన్వీనర్ తాటిపర్తి జయరాం రెడ్డి, చిలకలూరిపేట పట్టణ అధ్యక్షుడు కోట పవన్ గాంధీ, పట్టణ ప్రధాన కార్యదర్శి సింగరేసు పోలయ్య, ఓ బి సి మోర్చా జిల్లా కార్యదర్శి ఆదిమూలం గురుస్వామి, బీజేవైఎం జిల్లా నాయకులు పులి గుజ్జు మహేష్, మీడియా ఇంచార్జ్ రావికింది రామకృష్ణ, టౌన్ కార్యదర్శి మాచర్ల శీను, మాజీ రూరల్ మండలం ఉపాధ్యక్షుడు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు



