ప్రత్తిపాటి గట్టిగా దృష్టి పెడితే రజనీ జైలుకెళ్లడం ఖాయం

  • నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత ప్రత్తిపాటి అయితే … అవినీతి మాత రజనీ : టీడీపీ నేతలు.
  • రజనీ ఆమె అనుచరులు ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది : టీడీపీనేతలు
  • ప్రభుత్వాసుపత్రి అయినా.. బైపాస్ నిర్మాణమైనా..నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసింది..చేస్తోంది ప్రత్తిపాటి, టీడీపీ ప్రభుత్వమే : టీడీపీనేతలు

రజనీ, ఆమె అనుచరులు ఒళ్లుదగ్గర పెట్టుకొని జాగ్రత్తగా మాట్లాడితే మంచిది : పిల్లి కోటి (నియోజకవర్గ ఐ-టీడీపీ కోఆర్డినేటర్)

“ నియోజకవర్గ వైసీపీనాయకులు పిచ్చెక్కి, మతి భ్రమించి మదమెక్కి మాట్లాడుతున్నారు. వారంతా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నట్టయితే మేం స్వయంగా చందాలు వేసుకొని వారి చికిత్సకు సహకరిస్తాం. రజనీ వ్యాఖ్యలు వింటుంటే నవ్వొస్తోంది. తన ఇల్లు భారీస్థాయిలో నిర్మించుకొని, ప్రజలకు ఉపయోగపడే ఆసుపత్రిని రజనీ గాలికి వదిలేశారు. చివరకు ఆసుపత్రుల నుంచి కమీషన్లు వసూలుచేసిన ఘనత ఆమెది.. ఆమె మరిదిది. తన మరిది జైల్లో ఉంటే పరామర్శకు కూడా వెళ్లని మనిషి రజనీ. నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచీ ఇప్పటివరకు ఇక్కడ జరిగిన అభివృద్ధి అంతా ప్రత్తిపాటి… టీడీపీ ప్రభుత్వాలు చేసిందే. రజనీ ఇకపై హద్దులు మీరి మాట్లాడితే, ఆమె నాలుక తెగ్గోయడానికి కూడా వెనుకాడం. పగలు ఒకపార్టీలో.. రాత్రి మరో పార్టీలో కొనసాగే వాళ్లు కూడా టీడీపీని ప్రశ్నిస్తే ఎలా? పొగాకు రైతులకు న్యాయం చేసింది ప్రత్తిపాటే. మూడో కొనుగోలు కేంద్రాన్ని కూడా త్వరలో మా నాయకుడు ప్రత్తిపాటి ప్రారంభించబోతున్నారు. రైతుల కష్టం తెలిసిన ఏకైక నాయకుడు ప్రత్తిపాటే. తెలుగుదేశం ఎప్పుడూ ప్రజలపక్షానే ఉంటుంది. రజనీ లాంటి దోపిడీ దారుల్ని.. దుర్మార్గుల్ని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచుతాం. రజనీ ఊసరవెల్లి రాజకీయాలకు బలికాకుండా ఆమె సానుభూతిపరులు జాగ్రత్తగా మాట్లాడితే మంచిది.” అని పిల్లి కోటి హెచ్చరించారు.

ప్రత్తిపాటి సరిగ్గా దృష్టి పెడితే రజనీ జైలుకు వెళ్లడం ఖాయం : నిమ్మకాయల ప్రసాద్ (టీడీపీ నాయకులు)

“ కరోనా సమయంలో ప్రజల ప్రాణాలతో కూడా విడదల రజనీ వ్యాపారం చేశారు. ఇంజక్షన్లు, మందులు అమ్ముకోవడమేగాక, ప్రజల నుంచి కొట్టేసిన సొమ్ముతో తాను సొంతంగా సేవాకార్యక్రమాలు చేస్తునట్టు ప్రజల్ని నమ్మించారు. విదదల రజనీ అనుచరుడు కందుల శ్రీకాంత్ లారీ యజమానుల నుంచి డబ్బులు వసూలుచేసి, ఎప్పటికప్పుడు కమీషన్లు మాజీ అవినీతి మంత్రికి కట్టబెట్టేవాడు. రజనీకి పిచ్చిపట్టిందా అనే సందేహం నియోజకవర్గ ప్రజలకు కలుగుతోంది. ప్రత్తిపాటి సరిగ్గా దృష్టి పెడితే రజనీ జైలుకు వెళ్లడం ఖాయం. కేవలం ఆడబిడ్డ అన్న కారణంతో ఆయన చూసీచూడనట్టు ఊరుకుంటున్నారు.” అని ప్రసాద్ తెలిపారు.

ప్రత్తిపాటి అభివృద్ధి ప్రధాత అయితే.. రజనీ అవినీతి మాత : గంగా శ్రీనివాసరావు (మున్సిపల్ ఫ్లోర్ లీడర్)

“టీడీపీని విమర్శించే వైసీపీ నాయకులు తమ వాళ్లకు ఎంతమందికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయో తెలుసుకొని మాట్లాడాలి. రాష్ట్రప్రభుత్వానికి పొగాకు కొనుగోళ్లతో సంబంధం లేకపోయినా కేవలం రైతుల కష్టాన్ని గుర్తించే ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎమ్మెల్యే ప్రత్తిపాటి ముందడగు వేశారు. రైతులకు న్యాయం చేయడం కోసమే పనిచేస్తున్నారు. అభివృద్ధి ప్రదాత ప్రత్తిపాటి అయితే.. అవినీతికి మాత రజనీ.” అని శ్రీనివాసరావు స్పష్టంచేశారు.

ప్రజల సొమ్ము కాజేసింది కాబట్టే రజనీని జగన్ గుంటూరుకు పంపారు : కందుల రమణ (రాష్ట్ర గౌడ కార్పొరేషన్ డైరెక్టర్)

“మాజీ అవినీతి మంత్రి రజనీ ప్రత్తిపాటిపై చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. గతంలో ఇక్కడ నుంచి రజనీని గుంటూరుకు ఎందుకు పంపారో, జగన్ తనను ఎందుకు దూరం పెట్టారో రజనీ ఆలోచించుకోవాలి. రజనీ దోపిడీ తెలిసే ఆమెను వైసీపీ అధినాయకత్వం నియోజకవర్గం మార్చింది. తాను ప్రజలనుంచి డబ్బులు కొట్టేసింది కాబట్టే.. తిరిగి వారికి చెల్లించింది. ఆమెపై ఉన్న కేసుల నుంచి బయటపడటానికే కోర్టుల చుట్టూ తిరుగుతోంది.” అని రమణ తెలిపారు.

ప్రభుత్వాసుపత్రి పనులు చేసే వారు కమీషన్లు ఇవ్వలేక పారిపోయారు : బేరింగ్ మౌలాలి (కౌన్సిలర్)

“వైసీపీ నేత జమీర్.. అతని సోదరుడు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి. ప్రభుత్వాసుపత్రి కట్టించింది ప్రత్తిపాటి అని మేమంటే దానికి సమాధానం చెప్పకుండా ఏవేవో మాట్లాడితే ఎలా? వైసీపీ ప్రభుత్వంలో బిల్లులు కట్టలేదని ఆసుపత్రి నిర్మాణ పనిచేసేవాళ్లు పనులు ఆపేశారు. రజనీకి కమీషన్లు ఇచ్చుకోలేక పారిపోయారు. గత ఎన్నికల్లో టీడీపీ గెలవకముందే నేను పార్టీ మారాను.” అని మౌలాలి స్పష్టంచేశారు.

రజనీ అధికారంలో ఉన్నప్పుడు ఏనాడూ వార్డుల ముఖం కూడా చూడలేదు : పిల్లి లెనిన్ (టీడీపీ నాయకులు)

“ ప్రత్తిపాటిని విమర్శించే అర్హత రజనీకి లేదు. ఆమెకు రాజకీయ భిక్ష పెట్టిందే ప్రత్తిపాటి. టీడీపీ కార్యకర్తగా కూడా పనిచేయని వ్యక్తికి ప్రత్తిపాటి ప్రాధాన్యత ఇస్తే, ఆమె తన స్వార్థంతో పార్టీకే వెన్నుపోటు పొడిచారు. ఐదేళ్లు అధికారంలో ఉండికూడా ఏనాడూ 12వ వార్డువైపు రజనీ తొంగిచూడలేదు. ప్రత్తిపాటి గెలిచాకే వార్డుని అభివృద్ధిచేశారు.” అని లెనిన్ తెలిపారు.

Share.
Leave A Reply