Author: chilakaluripetalocalnews@gmail.com

నిన్న మునిసిపల్ కమీషనర్ అక్రణ తొలగింపు గురించి మాట్లాడటం చాలా హర్షించదగ్గ విషయంఅలాగే ఇంకొక సమస్య అయినా ఆర్ వి ఎస్ సి వి ఎస్ హై స్కూల్ రోడ్డు మాస్టర్ ప్లాన్ ప్రకారం 80 అడుగులు చూపించగా అదే రోడ్డులో రూల్స్ ప్రకారం వదలవలసిన ఖాళీ స్థలం కాకుండా మాస్టర్ ప్లాన్ రోడ్డును కూడా ఆక్రమించి నిర్మాణం చేస్తున్న పట్టించు కొని మునిసిపల్ అధికారులు.ప్రస్తుతం ఉన్న రోడ్డు 30 అడుగులు కాగా మాస్టర్ ప్లాన్ రూల్ ప్రకారం వదలవలసిన 25 అడుగులు మరియు ఫ్రెంట్ ఓపెన్ స్పేస్ ఈ రెండు వదలకుండా రోడ్డు మీదకు వచ్చి నిర్మాణం చేస్తున్న పట్టించుకోకుండా ఉన్న మున్సిపల్ అధికారులు ఈ విషయంపై వెంటనే తగు చర్యలు తీసుకోవాలని పుర ప్రజలు కోరుకుంటున్నారు ఎందుకంటే ఈ రోడ్డులో ఆరు స్కూల్స్ ఉన్నవి అందువలన మున్సిపల్ కమిషనర్ గారు దీనిపై దృష్టి పెట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఈ…

Read More

పట్టణంలో పోలీసులు విస్తృత స్థాయిలో తనిఖీలు పలు వ్యాపార సంస్థలు, బడ్డి కోట్లను తనిఖీ చేసిన SI చెన్నకేశవులు బృందం బహిరంగంగా ధూమపానం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన SI చెన్నకేశవులు పొగాకు నిషేధిత డ్రగ్స్, గంజాయి స్మగ్లింగ్ చేస్తే జైలుకు పంపిస్తాం-SI వాహనాలు తనిఖీలు చేసి కేసులు నమోదు చేసిన పోలీసులు 20 వాహనాలు పై కేసులు నమోదు…..4000జరిమానా ఆరు బయట ధూమపానం, మద్యపానం చేసిన కఠిన చర్యలు-SI

Read More

అక్రమణలను వారం రోజుల్లోగా తొలగించాలని, లేని పక్షంలో మున్సిపాలిటీ స్వయంగా తొలగిస్తారు రోడ్లపైకి వచ్చే వారిపై తీవ్ర చర్యలు తీసుకుంటాం జరిమానాలు విధించడంతో పాటు కేసులు కూడా పెడతాం మున్సిపల్ కమిషనర్ పి. శ్రీహరి బాబు హెచ్చరిక చిలకలూరిపేట పట్టణంలో అక్రమణలకు గురైన రోడ్లు, ట్రాఫిక్ సమస్యలు మరియు ప్రమాదాలపై మున్సిపల్ కమిషనర్ పి. శ్రీహరి బాబు మీడియాకు తెలిపారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నరసరావుపేట సర్కిల్ నుంచి నరసరావుపేటకు వెళ్లే దారిలో, టిడ్కో, పసుమరు ప్రాంతాలలో ఇళ్లు కేటాయించినప్పటికీ, ప్రజలు గుడిసెలు వేసుకుని రోడ్లపైనే వ్యాపారాలు కొనసాగిస్తున్నారని ఆయన అన్నారు. అడ్డరోడ్డు సెంటర్లోనే కోటప్పుకొండ రోడ్డులో షాపులు, కేబీ రోడ్డు, నరసరావుపేట సర్కిల్ నుంచి సబ్-రిజిస్ట్రార్ కార్యాలయం వైపు వెళ్లే రోడ్లలో కూడా ఆక్రమణలు అధికంగా ఉన్నాయని, దీని వల్ల ట్రాఫిక్ అంతరాయాలు, ప్రమాదాలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. అనేకసార్లుఆక్రమణలుతొలగించినప్పటికీ, వ్యాపారస్తులు తిరిగి రోడ్లపైకి వచ్చి ట్రాఫిక్…

Read More

ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిజెపి పార్టీ ఆఫీస్ విజయవాడ నందు మన ప్రియతమ నేత మాధవన్ గారు రాష్ట్ర బాధ్యతలు స్వీకరించినారు ఈ సందర్భంగా పల్నాడు జిల్లా అధ్యక్షులు శ్రీ ఏలూరు శశి కుమార్ గారి ఆధ్వర్యంలో నేను బిజెపి పార్టీ లోకి చేరడం జరిగింది నాతోపాటు చిలకలూరిపేట నియోజకవర్గ నుండి 100 మంది కార్యకర్తలు బిజెపి పార్టీ కండువా కప్పుకొని పార్టీని సంస్థాపకతంగా ముందుకు తీసుకెళ్లటానికి కృషి చేస్తామని ప్రమాణం చేసినారు. ఈ కార్యక్రమంలో చిలకలూరిపేట నియోజకవర్గ బిజెపి కన్వీనర్ తాడిపర్తి జయరామిరెడ్డి కో కన్వీనర్ మల్లెల శివ నాగేశ్వరరావు మాజీ పట్టణ అధ్యక్షులు పోత్తూరి బ్రహ్మానందం జిల్లా కో కన్వీనర్ బండారు నాగరాజు ఎడ్లపాడు మండల అధ్యక్షులు తులాబందుల సత్యనారాయణ బీజేవైఎం స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ పుల్లుగుజ్జు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Read More

మాజీ మంత్రి శ్రీమతి విడుదల రజిని ఆదేశానుసారం పట్టణ అధ్యక్షులు షేక్ ధరియావలి మరియు పల్నాడు జిల్లా యూత్ ప్రెసిడెంట్ కందుల శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఘనంగా వైయస్సార్ 76వ జయంతి వేడుకలు ఈరోజు డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 76వ జయంతి సందర్భంగా చిలకలూరిపేట నియోజకవర్గం లోని పలు గ్రామాలలో మరియు పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఆయన విగ్రహాలకి పూలమాలలు వేసి,పాలాభిషేకం చేసి ఆయనకి నివాళులర్పించారు. ముందుగా మాజీ మంత్రి శ్రీమతి విడదల రజని గారి నివాసంలో డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి కేక్ కటింగ్ కార్యక్రమం జరిగింది. తరువాత వైయస్సార్ అభిమానులు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పలువురు నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా రక్తదానం చేయడం జరిగింది. ముందుగా పల్నాడు జిల్లా యూత్ ప్రెసిడెంట్ మరియు యువ నాయకుడు కందుల శ్రీకాంత్ రక్తదానం చేయడంతో పలువురు యువకులు కూడా ఆయనను స్ఫూర్తిగా తీసుకొని స్వచ్ఛందంగా…

Read More

చంద్రబాబు ఏడాది పాలన….. రాష్ట్రప్రగతికి బాటలు వేసింది : ప్రత్తిపాటి. జగన్ విధ్వంస విద్వేష పాలన నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించడంతో పాటు ప్రజల సంతృప్తి… రాష్ట్ర ప్రగతికి బాటలు వేసేలా ఏడాదిలో కూటమిప్రభుత్వం గొప్పవిజయాలు సాధించిందని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. మంగళవారం ఆయన పట్టణంలోని 34, 35 వార్డుల్లో ఇంటింటికీ తిరిగి ప్రజలతో మమేకమై, కూటమిప్రభుత్వ ఏడాది ప్రగతిని వివరించారు. అంతకు ముందు పార్టీ శ్రేణులతో సమావేశమై కూటమిప్రభుత్వ పనితీరును ప్రజలకు వివరించడంపై వారికి దిశానిర్దేశం చేశారు. మన నాయకుడు చేసినమంచిని కాలర్ ఎగరేసి గర్వంగా చెప్పుకుందాం.. జగన్ ఐదేళ్లలో సాధించలేనిది.. చంద్రబాబు ఏడాదిలోనే సాధించారని, కూటమిప్రభుత్వ సుపరిపాలనను ప్రజలకు అర్థమయ్యేలా పార్టీ శ్రేణులు వివరించాలని ప్రత్తిపాటి సూచించారు. వైసీపీ నాయకుల్లా మాయమాటలు చెప్పి ప్రజల్ని మోసగించలేదని.. అందరం గర్వంగా చెప్పుకునేలా మన నాయకుడు సంవత్సరంలోనే ఎన్నో మంచిపనులు చేశారని ప్రత్తిపాటి స్పష్టంచేశారు.

Read More

గంజాయి, డ్రగ్స్, స్మగ్లింగ్ చేస్తే తాట తీస్తా….. నిషేధిత గంజాయి అమ్మితే చట్ట పరంగా కఠిన చర్యలు తీసుకుంటాం చిలకలూరిపేట పట్టణంలో గంజాయి, డ్రగ్స్ స్మగ్లింగ్ పై ఉక్కుపాదం మోపిన పోలీసులు టౌన్, రూరల్ పరిధిలో ఉన్న వ్యాపార సంస్థలు పై పోలీసులు దాడులు యువతను నాశనం చేసే పదార్థాలు అమ్మితే చర్యలు తీసుకుంటామన్నా పట్టణ CI రమేష్ గ్రామీణ ప్రాంతాల్లో గంజాయి విక్రయిస్తే కేసులు నమోదు చేస్తాం… SI అనీల్ చిలకలూరిపేట మండలం లోని పలు గ్రామాల్లో పర్యటించి బడ్డి కోట్లపై దాడులు చేసి, విస్తృతంగా తనిఖీలు నిర్వహించిన SI అనీల్

Read More

కేసరి యాక్టీవ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్ చీరాల టౌన్ ప్రెసిడెంట్ గా నియమితులైన కారుమంచి వీరాంజనేయులుఈరోజు చిలకలూరిపేట మున్సిపల్ చైర్మన్ షైక్ రఫానీ చేతుల మీదుగా నియామక పత్రం అందుకున్న కారుమంచి వీరాంజనేయులు ఈ నియామక పత్రం అందించిన వారిలో లోకసత్త పార్టీ ఇంచార్జి భానుప్రసాద్ రాధ రంగా మిత్ర మండలి కన్వీనర్ అచ్చుకోల మురళి కృష్ణ తదితరులు పాల్గొన్నారు మల్లెల న్యూస్ ఛానల్ బాపట్ల జిల్లా చీరాల మీడియా ఇంచార్జ్ కేసరి యాక్టీవ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్ అభ్యున్నతికి… పత్రిక విలేకరుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తాను అని కేసరి యాక్టీవ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్ బాపట్ల జిల్లా చీరాల పట్టణ ప్రెసిడెంట్ కారుమంచి వీరాంజనేయులు తెలియజేశారు కేసరి యాక్టీవ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు మల్లెల శివ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నియామక పత్రం అందుకున్న కారుమంచి వీరాంజనేయులు తన ఈ నియామకానికి సహాయ సహకారాలు అందించిన…

Read More

కూటమి ప్రభుత్వానికి అభిప్రాయబేధాల కంటే అభివృద్ధే ముఖ్యం : ప్రత్తిపాటి పురపాలక అధికారులు… సిబ్బంది.. కౌన్సిలర్లు పట్టణాభివృద్ధి, ప్రజాసమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, చెత్తసేకరణ వీధిలైట్లు రోడ్లు.. డ్రైనేజ్ ల నిర్మాణం.. కాలువల శుభ్రత.. తాగునీటి సరఫరాపై ప్రజల నుంచి ఫిర్యాదులు రాకుండా చూడాలని మాజీమంత్రి. శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఆదేశించారు. స్వార్థపరుల బేధాభిప్రాయాల కంటే అభివృద్దే ముఖ్యం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో సోమవారం ఆయన వార్డు కౌన్సిలర్లు, అధికారులతో పట్టణంలో చేపట్టాల్సిన అభివృద్ధిపనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా తమ వార్డుల్లోని సమస్యలపై కౌన్సిలర్లు ప్రత్యేక దృష్టిపెట్టాలని, ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల పరిష్కారంలో చురుగ్గా వ్యవహరించాలని ప్రత్తిపాటి సూచించారు. ఇతర పార్టీల కౌన్సిలర్లు చెప్పినా..చెప్పకపోయినా స్థానికులతో మాట్లాడి ఆయా వార్డుల్లోని సమస్యల్ని కూడా అధికారులే పరిష్కరించాలన్నారు. కూటమిప్రభుత్వం అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తుంది, ప్రజాభిప్రాయాలను గౌరవిస్తుంది తప్ప… స్వార్థపరుల బేధాభిప్రాయాలను కాదని ప్రత్తిపాటి స్పష్టం చేశారు. రూ.5.40 కోట్లతో రోడ్లు..డ్రైనేజ్…

Read More

వ్యాపారులారా, ట్రేడ్ లైసెన్స్ రెన్యూవల్ పేరుతో మోసగాళ్ల బారిన పడకండి మున్సిపల్ కమిషనర్ పి. శ్రీహరిబాబు చిలకలూరిపేటలో కొందరు మోసగాళ్లు మున్సిపల్ కమిషనర్ పేరుతో ఫోన్‌లు చేసి వ్యాపారులను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారు. ట్రేడ్ లైసెన్స్‌ల రెన్యూవల్ చేసుకోవాలని, లేనిపక్షంలో దుకాణాలను సీజ్ చేస్తామని చెప్పి భయపెడుతున్నారు. చాలా మంది వ్యాపారులు ఈ బెదిరింపులకు భయపడి, వారు సూచించిన నంబర్‌కు ఫోన్‌పే ద్వారా డబ్బులు పంపిస్తున్నారు.ఈ విషయం మున్సిపల్ కమిషనర్ పి. శ్రీహరిబాబు దృష్టికి రావడంతో ఆయన తీవ్రంగా స్పందించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మున్సిపల్ కమిషనర్ హెచ్చరిక మున్సిపల్ కమిషనర్ పి. శ్రీహరిబాబు మీడియాతో మాట్లాడుతూ, ట్రేడ్ లైసెన్స్ చెల్లించాలని 9121097923 నంబర్ నుండి వచ్చే ఫోన్ కాల్స్‌ను నమ్మవద్దని, వాటికి స్పందించవద్దని సూచించారు. ట్రేడ్ లైసెన్స్ రెన్యూవల్ ఆన్‌లైన్ ద్వారా మాత్రమే చేయించుకోవాలని, మధ్యవర్తులను లేదా తన పేరుతో వచ్చే ఫోన్ కాల్స్‌ను నమ్మవద్దని ఆయన స్పష్టం…

Read More