పులివెందులలో తెలుగుదేశం పార్టీ జడ్పీటీసీ ఎన్నికల్లో ఘన విజయం సాధించడం ప్రజాస్వామ్య వికాసం
పులివెందుల లో జడ్పీటీసీ ఎన్నికల్లో NDA కూటమి భలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీమతి మరెడ్డి లతారెడ్డి 6052 ఓట్ల మెజారిటీ తో గెలుపొందడం హర్షించదగ్గ విషయం.
1978 సంవత్సరం తర్వాత పులివెందులలో ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకొనలేదని పల్నాడు జిల్లా బీజేపీ వైస్ ప్రెసిడెంట్ మల్లెల శివ నాగేశ్వరరావు ఈ సందర్భంగా తెలియజేసారు.అలాగే ఎస్టి, ఎస్సి,బిసి,మైనారిటీ ప్రజలలో ఎక్కువమంది గత 47 సంవత్సరాల నుండి ఓటు వేయలేదంటే పులివెందుల ప్రాంతంలో ప్రజాస్వామ్యం ఏరకంగా వర్ధిల్లిందో తెలుస్తుంది.47 సంవత్సరాలు తర్వాత నిన్న జరిగిన పులివెందుల జడ్పిటిసి ఎన్నికలలో ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛాయుతంగా వినియోగించుకున్నారు. ప్రజాస్వామ్య వికాసానికి దోహదపడిన పులివెందల ఓటర్ మహాశయులకు బీజేపీ పార్టీ తరుపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. స్వేచ్ఛాయుతమైనటువంటి ఎన్నిక నిర్వహించిన అధికారులకు అభినందనలు తెలియజేస్తున్న పల్నాడు జిల్లా బీజేపీ వైస్ ప్రెసిడెంట్ మల్లెల శివ నాగేశ్వరరావు.
Trending
- సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి తరుపున టిడ్కో గృహాల సముదాయంలో ఆలయ నిర్మాణనానికి భూమిపూజ చేసిన ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు.
- నియోజకవర్గ తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం : ప్రత్తిపాటి
- మున్సిపల్ ఎన్నికల వేళ చిలకలూరిపేటలో పోలీసుల భారీ సాయుధ కవాతు
- ప్రధాని నరేంద్ర మోది జన్మదిన సందర్భంగా ‘సేవా సంకల్ప’ కార్యక్రమం లొ పాల్గొన్న మల్లెల శివ నాగేశ్వరావు
- పల్నాడు జిల్లా జనతా వారది కార్యక్రమం నరసరావుపేట జిల్లా కార్యాలయంలో నిర్వహించడం జరిగింది
- మోదీ నాయకత్వంలో సరికొత్త అభివృద్ధి సంక్షేమంతో భారత కీర్తి విశ్వవ్యాప్తమైంది : ప్రత్తిపాటి
- చిలకలూరిపేటలో బహిరంగంగా మద్యం సేవించిన 14 మందికి రూ.14 వేల జరిమానా
- ఓటరు జాబితాలో మీ పేరు ఉందో లేదో సరిచూసుకోండి: రేపటి నుండి BLOల ఇంటింటి పర్యటన!



