చిలకలూరిపేట మున్సిపల్ కమిషనర్ ను సత్కరించిన బిజెపి నాయకులు

చిలకలూరిపేట మున్సిపల్ కమిషనర్ వారి కార్యాలయంలో కలిసి ఘనంగా సన్మానించిన చిలకలూరిపేట భారతీయ జనతా పార్టీ నాయకులు ఆగస్టు 15 వ తేదీ స్వతంత్ర దినోత్సవ కార్యక్రమం సందర్భంగా చిలకలూరిపేట పట్టణంలో తిరంగా ర్యాలీ ఘనంగా నిర్వహించిన చిలకలూరిపేట పట్టణ ప్రజలకు జాతీయ భావాన్ని తెలియజేసిన సందర్భంగా మున్సిపల్ కమిషనర్ ను భారతీయ జనతా పార్టీ నాయకులు ఘనంగా సన్మానించడం జరిగింది. అలాగే చిలకలూరిపేట నేషనల్ హైవే కి సమీపంలో మున్సిపల్ శాఖ తరపున 100 అడుగుల జాతీయ జెండాను నెలకొల్పాలని భారతీయ జనతా పార్టీ తరఫున మున్సిపల్ కమిషనర్ కు విన్నవించడం జరిగింది సదరు విషయంపై మున్సిపల్ కమిషనర్ త్వరలో స్థల సేకరణ చేసి జాతీయ జెండాను నిర్మిద్దామని హామీ ఇవ్వడం జరిగింది వారు ఇచ్చిన హామీకి సంతోషించి బిజెపి నాయకులు కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు నెల్లూరు రంజిత్ పట్టణ ప్రధాన కార్యదర్శి సింగిరేసు పోలయ్య బిజెపి నాయకులు వరికుట్టి నాగేశ్వరావు తదితరులు ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు.

Share.
Leave A Reply