పల్నాడు జిల్లా చిలకలూరిపేట లో ఉత్తమ పురస్కార అవార్డు గ్రహీతలకు ఘన సన్మానం నిర్వహించిన బిజెపి నాయకులు
పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఉత్తమ పురస్కార్ అవార్డు పొందిన అతిధులకు చిలకలూరిపేట భారతీయ జనతా పార్టీ వారి ఆధ్వర్యంలో ఘన సన్మానం నిర్వహించడం జరిగింది ఈ సన్మాన కార్యక్రమంలో చిలకలూరిపేట ఎమ్మార్వో షేక్ మహమ్మద్ హుస్సేన్, చిలకలూరిపేట రూరల్ సీఐ బి సుబ్బనాయుడుని ఘనంగా సత్కరించడం జరిగింది వారు ఇరువురు ఎంతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలని చిలకలూరిపేటభారతీయ జనతా పార్టీ తరపున కోరుచున్నాము.ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు చిలకలూరిపేట పట్టణ ప్రధాన కార్యదర్శి సింగరేసు పోలయ్య, పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు, పల్నాడు జిల్లా సెక్రెటరీ గట్ట హేమ కుమార్, పల్నాడు జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు నెల్లూరు యశ్వంత్ రంజిత్, బీజేవైఎం స్టేట్ ఎగ్జిక్యూటివ్ నెంబర్ పులిగుజ్జు మహేష్, పట్టణ కార్యదర్శి మాచర్ల శ్రీనివాసరావు, బిజెపి సీనియర్ నాయకులు వరికూటి నాగేశ్వరరావు, మీడియా ఇంచార్జ్ రావిక్రింది రామకృష్ణ, పట్టణ బీజేవైఎం ఫణి కుమార్, రాధా రంగా మిత్రమండలి నియోజకవర్గ కన్వీనర్ అచ్చు కోల మురళీకృష్ణ, అందెల సౌరయ్య టిడిపి జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ పాల్గొన్నారు.



