Author: chilakaluripetalocalnews@gmail.com

అక్రమ పీడీఎస్ రేషన్ స్వాధీనం నాదెండ్ల మండలం చిరుమామిళ్ల గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన 45 కిమ్టాళ్ల పిడిఎస్ రైస్ ని స్వాధీన పరచుకొని కేసు నమోదు చేసిన అధికారులు. వివరాల ప్రకారం చిరుమామిళ్ల గ్రామంలోని 38వ నంబర్ డిపోలో పోతిరెడ్డి అంజిరెడ్డి అనే డీలర్ పేదలకు అందువలసిన రేషన్ బియ్యాన్ని వారికి ఇవ్వకుండా అక్రమంగా నిలువ చేసి అమ్ముకుంటున్నారు, ఈ విషయాన్ని గ్రామస్తులు జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకుని వెళ్లారు,ఆయన ఆదేశాల మేరకు నాదెండ్ల వీఆర్వో పోలీస్ అధికారులతో కలిసి అక్రమంగా నిల్వ ఉంచిన డిపో మీద ఆకస్మిక తనిఖీలు చేసి నిల్వ ఉంచిన పిడిఎఫ్ బియ్యాన్ని స్వాధీనం చేసుకొని 6A కేసు నమోదు చేశారు.

Read More

చిలకలూరిపేటలో అడ్డూ అదుపూ లేకుండా ప్లాస్టిక్ వాడకం ప్రజారోగ్యం, పర్యావరణానికి తీవ్ర ముప్పు! చిలకలూరిపేట పట్టణంలో ప్లాస్టిక్ వాడకంపై అధికారులు, సచివాలయ సిబ్బంది పర్యవేక్షణ కొరవడటంతో పరిస్థితి అదుపు తప్పుతోంది. నిబంధనలు ఉన్నప్పటికీ, ప్లాస్టిక్ నియంత్రణ చర్యలు నామమాత్రంగానే ఉన్నాయని, దీనివల్ల ప్రజారోగ్యానికి, పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతోందని స్పష్టమవుతోంది. టీ కోట్లలో ప్లాస్టిక్ గ్లాసుల వినియోగం ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావంపట్టణంలో అత్యంత సాధారణంగా కనిపించే దృశ్యం టీ దుకాణాల్లో ప్లాస్టిక్ గ్లాసుల వినియోగం. నిత్యం వేలాది మంది ప్రజలు ఈ ప్లాస్టిక్ గ్లాసుల్లో టీ తాగుతున్నారు. వేడి పానీయాలు ప్లాస్టిక్‌తో కలవడం వల్ల రసాయన కాలుష్యం జరిగి, ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. జీర్ణ సమస్యలు, హార్మోన్ల అసమతుల్యత, క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులు కూడా దీనివల్ల రావచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. పట్టణంలో ఇన్ని అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ, ప్రజలు తమ ఆరోగ్యాన్ని కూడా…

Read More

ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల సమస్యల పరిష్కారం అద్భుతమైన సేవలు అందిస్తున్నందుకు ఈయ సేవలకుగాను మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు అభినందించి, సత్కారం పేట అర్బన్ సీఐ రమేష్ సేవలు ప్రశంసనీయం చిలకలూరిపేట అర్బన్ సీఐ రమేష్ ట్రాఫిక్ నిర్వహణ, శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజల సమస్యల పరిష్కారంలో చూపిస్తున్న నిబద్ధతకు విశేష ప్రశంసలు అందుకుంటున్నారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుడి సమస్యను సానుకూలంగా విని, వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకుని బాధితులకు న్యాయం అందించడంలో ఆయన ముందున్నారు. ప్రజల మన్ననలు పొందుతున్న సీఐ రమేష్ సీఐ రమేష్ తన సమర్థవంతమైన పనితీరుతో పట్టణ ప్రజల మన్ననలను పొందారు. ముఖ్యంగా, ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి, శాంతిభద్రతల పరిరక్షణకు ఆయన తీసుకుంటున్న చర్యలు ప్రజలకు ఎంతో ఉపశమనం కలిగిస్తున్నాయి. మాజీ మంత్రి ప్రత్తిపాటి చేతుల మీదుగా సత్కారం పత్తిపాటి గార్డెన్స్‌లో పత్తిపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెడికల్ క్యాంపుకు వేలాది మంది…

Read More

చిలకలూరిపేట పట్టణంలో తెలగ, బలిజ, కాపు కళ్యాణ మండప పునః నీర్మాణ సమావేశం చిలకలూరిపేట పట్టణంలో ని కృష్ణ డోంక లో గల తెలగ,బలిజ, కాపు కళ్యాణమండపం పునః నీర్మాణ సమావేశం చిలకలూరిపేట నియోజకవర్గ కాపు నాయకుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. సమావేశంలో కాపు నాయకులు మాట్లాడుతూ 1981 వ సంవత్సరంలో ఆనాటి కాపు పెద్దలు సహకారంతో స్థలము సేకరించి కొంత నిర్మాణం చేపట్టి ఉన్నారు. రెండు తరాలు దాటి మూడోతరం కారు ఈ కళ్యాణ మండపం పునర్నిర్మాణం చేపట్టటం చాలా ఆనందంగా ఉంది. కళ్యాణ మండపానికి కావలసిన సహాయ సహకారాలు అందిస్తామని కాపు నాయకులు తెలియజేశారు. కొంతమంది కాపు నాయకులు వారి యొక్క విరాళాలు లక్షల్లో ప్రకటించి వారి యొక్క గొప్పతనాన్ని చాటుకున్నారు. కాపు కళ్యాణ మండపం పునః నీర్మాణ కార్యక్రమాన్ని చేపట్టిన వారి టీమును కాపు నాయకులందరూ అభినందించారు. చిలకలూరిపేట నియోజకవర్గ కాపు నాయకులందరూ పాల్గొని, కార్యక్రమాన్ని జయప్రదం…

Read More

అనుమతులు లేని వెంచర్ల మీద ఉక్కు పాదం మోపుతున్న మున్సిపల్ అధికారులు. పట్టణ ములో గతంలో ఎలాంటి అనుమతులు లేకుండా ఎన్నో వెంచర్లు వేసి పట్టణ ప్రజలను మోసం చేసి వాటిని ఎలాగో అలాగా వారికి అంటగడుతూ ఉన్నారు.ఏ ప్రభుత్వం వచ్చిన రిజిస్టర్ కార్యాలయం దగ్గర నుంచి మొదలుకొని ఆయన మాటల దాటితో వెంచర్ లేసి కొనుగోలు చేయగల ఘనుడని పలువురు చర్చించుకుంటున్నారు. గతంలో వేసిన వెంచర్లపై మున్సిపల్ అధికారులు దాడులు చేసి నిలుపుదల చేశారు.ఎవరికి తెలియకుండాకొద్ది రోజుల క్రితం పురుషోత్తపట్నం శివారు హెచ్ పి పెట్రోల్ బంకు వద్ద వేసిన వెంచర్ ఎలాంటి అనుమతులు లేకుండా అక్కడ ప్రజలకి కొనుగోలు చేశారు.ఈ విషయం మున్సిపల్ అధికారులకు తెలియగా ఆ వెంచర్ పై హద్దురాళ్లను జెసిబి సహకారంతో తొలగించి, అనుమతులు లేని వెంచర్ల పైన చర్యలు తీసుకుంటామని సదరు వ్యక్తిని మున్సిపల్ అధికారులు హెచ్చరించారు.

Read More

పెట్రోల్ బంక్ సిబ్బంది వినియోగదారుడుతో ఖచ్చితంగా మర్యాదగా ప్రవర్తించవలసిందే అని వినియోగదారుల చట్టం 2019 స్పష్టం చేస్తుంది. ……. మురికిపూడి ప్రసాద్కన్జ్యూమర్ రైట్ ప్రొటెక్షన్ ఫోరం పల్నాడు జిల్లా అధ్యక్షులుపెట్రోల్ బంకులను తరచుగా పర్యవేక్షించి కొలతలు సరిగా వస్తున్నాయా రావటం లేదా అనే అంశాన్ని నిర్ధారించి వినియోగదారులకు అన్యాయం జరగకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వ అధికారులదే .ఇటీవల నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం లో 400 రూపాయలు పెట్రోల్ కొట్టిస్తే అర లీటర్ పెట్రోల్ వచ్చిందని వినియోగదారుడు వాపోయాడు. ఇదే అంశాన్ని ప్రధాన వార్తా పత్రికలు చానల్స్ ప్రచారం చేశాయి.ఈ సంఘటన జరిగిన తర్వాత సంబంధిత అధికారులు ఆ బంకును పరిశీలించి కొలతలు కరెక్ట్ గానే ఉన్నాయని నిర్ధారించారు. ఈ మధ్యకాలంలో యజమానులు కొలతలు సరి చేసుకునే సరిచేసుకునే అవకాశం ఉంది. టెక్నాలజీ వాళ్ళ చేతుల్లో ఉంది అంతిమంగా నష్టపోయేది వినియోగదారుడు మాత్రమే.పెట్రోల్ తగ్గినప్పుడు వినియోగదారుడు, బంక్ సిబ్బంది చొక్కా చొక్కా పట్టుకొని…

Read More

మంచి చేసేవారిని ఆశీర్వదించి మీ జీవితాలు బాగుచేసుకోండి : ప్రత్తిపాటి మంచి చేసేవారిని కాదని.. మిమ్మల్ని ముంచేవారిని నమ్మి గతంలో ఎంతో నష్టపోయారని, మరలా ఆ తప్పులు పునరావృతం కాకుండా ప్రజలు ఒకేమాటపై నిలిచి కూటమిప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు కోరారు. కొండవీడు కోట ఘాట్ రోడ్డు నిర్మించింది చంద్రబాబేనని, కోటను పర్యాటకంగా అభివృద్ధిచేస్తే చిలకలూరిపేట నియోజకవర్గానికి మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయన్నారు. నాలుగేళ్లలో కొండవీడును మరింత అభివృద్ధి చేస్తానని ప్రత్తిపాటి చెప్పారు. రూ.44 లక్షలతో చేపట్టిన సీసీరోడ్లు..డ్రైన్ల నిర్మాణానికి శంఖుస్థాపన చేసిన ప్రత్తిపాటి సుపరిపాలనలో తొలి అడుగు : ఇంటింటికీ తెలుగుదేశంలో భాగంగా శనివారం ఆయన లింగారావుపాలెం, కోట, సంతపేట, చెంగిజ్ ఖాన్ పేట గ్రామాల్లో పర్యటించారు. తొలుత లింగారావుపాలెంలో దాతల సహాకారంతో ఏర్పాటుచేసిన మంచినీటి ప్లాంట్ ను ప్రారంభించిన ప్రత్తిపాటి రూ.13లక్షలతో చేపట్టిన సీసీరోడ్లు, డ్రైన్ల నిర్మాణానికి శంఖుస్థాపన చేశారు. అనంతరం కోట గ్రామంలో రూ.8లక్షలతో,…

Read More

పేదల ఆరోగ్యం… ఆనందమే ప్రత్తిపాటి ఫౌండేషన్ కు ముఖ్యం : ప్రత్తిపాటి ప్రజలకు మెరుగైన కంటివైద్యం అందించించాలన్నసదాశయంతో ప్రభుత్వం కొన్ని వైద్యసంస్థలతో కలిసి మెరుగైన వైద్యసేవలు అందిస్తోందని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. శంకర్ నేత్రాలయం వంటి ఆసుపత్రులు ప్రజలకు అందించే సేవల్లో ప్రభుత్వ తోడ్పాటు కూడా ఉందన్నారు. కంటి ఆపరేషన్లు చేయించుకునే ఒక్కో వ్యక్తికి ప్రభుత్వం రూ.2వేల ఆర్థిక సాయం అందిస్తోందని ప్రత్తిపాటి చెప్పారు. ప్రత్తిపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక ప్రత్తిపాటి గార్డెన్స్ లో ఏర్పాటుచేసిన 36వ వైద్య శిబిరాన్ని ప్రారంభించిన మాజీమంత్రి, 35వ వైద్యశిబిరంలో ఆపరేషన్లు చేయించుకున్న వారికి ఉచిత కళ్లద్దాలు అందించారు. అనంతరం దండమూడి హెల్త్ ఆఫీస్ సర్వీస్ (డీ.హెచ్.ఓ.ఎస్) వారు అందుబాటులోకి తీసుకొచ్చిన అధునాతన వైద్యపరీక్షల యంత్రాన్ని ప్రత్తిపాటి లాంఛనంగా ప్రారంభించారు. యంత్రంతో 42 రకాల వైద్యపరీక్షలు చేయవచ్చని, అతి తక్కువఖర్చుతోనే ప్రజలకు పరీక్షలు నిర్వహిస్తామని డీ.హెచ్.ఓ.ఎస్ డైరెక్టర్ దండమూడి అరవింద్ కుమార్, ఎమ్మెల్యే…

Read More

కందులు కొనుగోలు చేయండి : దాల్ మిల్లర్లతో సమావేశంలో జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు నరసరావు పేట, జులై 10 కంది ధరలు తగ్గుతున్న నేపథ్యంలో జిల్లా రైతుల నుంచి కందులు కొనుగోలు చేయాలని దాల్ మిల్లర్లను జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు కోరారు. వినుకొండ, దాచేపల్లి మండలాల్లో రైతుల వద్ద ఉన్న కందులను మిల్లర్లు మెరుగైన ధర చెల్లించి కొనుగోలు చేయాలన్నారు. ఈ వారంలోగా రైతులకు, మిల్లర్లకు ఆమోదయోగ్యమైన ఒక ధరను మిల్లర్స్ అసోసియేషన్ ద్వారానిర్ణయించి కొనుగోళ్లు ప్రారంభించాలన్నారు. గురువారం మధ్యాహ్నం స్థానిక కలెక్టరేట్ ఎస్సార్ శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాలులో కందుల కొనుగోలుపై జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు దాల్ మిల్లర్లతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి జగ్గారావు, ఆర్డీవోలు మధులత, రమణాకాంత్ రెడ్డి, మురళీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Read More

వినుకొండ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశానికి ఏర్పాట్లు – బొల్లా బ్రహ్మనాయుడు గారు స్వయంగా పర్యవేక్షణ వినుకొండ నియోజకవర్గంలో రేపు జరగబోయే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం విజయవంతంగా జరగేందుకు ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ సమావేశానికి హాజరయ్యే ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎటువంటి అసౌకర్యం లేకుండా ఉండేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర PAC సభ్యులు, వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు గారు స్వయంగా పర్యవేక్షణ నిర్వహిస్తున్నారు. సమావేశ వేదిక వద్ద స్టేజ్, కూర్చోవడానికి సదుపాయాలు, నీటి సరఫరా, పార్కింగ్, భద్రత అంశాలపై ప్రత్యక్షంగా సమీక్షిస్తున్న ఆయన, స్థానిక నాయకులకు దిశానిర్దేశం అందించారు.

Read More