పల్నాడు జిల్లా నరసరావుపేట పార్టీ కార్యాలయం లొ ప్రారంభమైన జనతా వారధి కార్యక్రమం (సమస్యల పరిష్కార వేదిక గ్రీవెన్స్ డే)

నరసరావుపేట లొ పల్నాడు జిల్లా బిజెపి ఆధ్వర్యంలో నిర్వహించిన జనతా వారధి కి పిర్యాదులువెల్లువ

పల్నాడు జిల్లా నరసరావుపేట భారతీయ జనతా పార్టీ కార్యాలయం లో ప్రతి శుక్రవారం జరిగే జనతా వారధి సమస్యల పరిష్కార వేదిక లొ భాగంగా పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరు శశి కుమార్ గారి స్వహస్తాలతో ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ రోజు పల్నాడు జిల్లా భారతీయ జనతా పార్టీ నరసరావుపేట కార్యాలయంలో జరిగిన జనతా వారధి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుండి ఫిర్యాదులు తీసుకోవడం జరిగింది. సంబందించిన సమస్యల పై ఫిర్యాదు స్వీకరించి వారి సమస్య పరిష్కార నిమిత్తం అధికారులతో మాట్లాడడం జరిగింది. సదరు అధికారులకు ఈ విషయంపై మాట్లాడి త్వరితగతిన ప్రజల సమస్యలను పరిష్కరించాలని బిజెపి పార్టీ డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యమానికి ముఖ్య అతిధులుగా పల్నాడు జిల్లా అధ్యక్షుడు ఏలూరు శశి కుమార్ విచ్చేసి కార్యక్రమన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మరియు జనతా వారధి పల్నాడు జిల్లా కన్వీనర్ మల్లెల శివ నాగేశ్వరావు పిర్యడులు స్వీకరించరు..ఈ కార్యక్రమంలో నేషనల్ కౌన్సిల్ మెంబర్ వల్లెపు కృపారరావు పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి కట్టా సుబ్బారావు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు కామినేని హనుమంతరావు , పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు గోగినేని వెంకట రమణ , పల్నాడు జిల్లా కార్యదర్శి పల్నాడు జిల్లా జనతా వారిది కో కన్వీనర్ గంజర్ల ఆదిలక్ష్మి పల్నాడు జిల్లా జనతా వారిదే కో కన్వీనర్ జాన్ బాబు పల్నాడు జిల్లా కార్యవర్గ సభ్యులు వరికూటి నాగేశ్వరరావు, , చిలకలూరిపేట పట్టడం ప్రధాన కార్యదర్శి సింగిరేసి పోలయ్య పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షుడు షైక్ మహబూబ్ సుభాని, కోమటి వాసు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

Share.
Leave A Reply