పల్నాడు జిల్లా వినుకొండ వినుకొండలో రైల్వే స్టేషన్, బస్టాండ్‌లో పోలీసుల తనిఖీలు వినుకొండ పట్టణంలోని రైల్వే స్టేషన్ మరియు బస్టాండ్లలో ఆదివారం సాయంత్రం పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. పట్టణ సీఐ శోభన్ బాబు ఆధ్వర్యంలో సిబ్బంది, బాంబ్ డిస్పోజల్ (BD) టీమ్ మరియు డాగ్ స్క్వాడ్‌తో కలిసి ఈ తనిఖీ చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పోలీసులు తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. రైల్వే స్టేషన్ మరియు బస్టాండ్‌లోని ప్రయాణికుల లగేజీలను క్షుణ్ణంగా పరిశీలించారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు ఏమైనా ఉన్నాయా అని డాగ్ స్క్వాడ్‌తో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సీఐ శోభన్ బాబు మాట్లాడుతూ, ప్రజల భద్రత దృష్ట్యా ముందస్తు చర్యల్లో భాగంగా ఈ తనిఖీలు నిర్వహించామని తెలిపారు. రానున్న రోజుల్లో కూడా ఇలాంటి తనిఖీలు కొనసాగిస్తామని ఆయన పేర్కొన్నారు. ప్రయాణికులు మరియు ప్రజలు పోలీసులకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి…
Author: chilakaluripetalocalnews@gmail.com
బస్టాండ్, లాడ్జీలపై జిల్లా SP విస్తృత దాడులు జిల్లా వ్యాప్తంగా యాంటీ సపటైజ్ లో భాగంగా బస్టాండ్,రైల్వే స్టేషన్ లాడ్జి ల చెకింగ్ వాహనాల తనిఖీ నిర్వహించిన పల్నాడు జిల్లా పోలీసులు… పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా వ్యాప్తంగా ఈరోజు BD Team, డాగ్ స్క్వాడ్ మరియు లోకల్ పోలీసు వారు మధ్యాహ్నం నుండి లాడ్జిలు మరియు వాహన తనిఖీలు, ఆంటీ సబ్టేజ్ గురించి విస్తృతంగా తనిఖీలు నిర్వహించడం జరిగింది. జిల్లాలో ప్రజాశాంతికి భంగం కలిగించిన, మద్యం సేవించి వాహనాలు నడిపిన కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ మందు బాబు లను హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా ప్రధాన రహదారులపై పోలీసు అధికారులు సిబ్బంది విస్తృత తనిఖీలు చేపట్టారు. ప్రజలకు ఇబ్బందులకు గురి చేస్తున్న వారిపై దాడులు చేయాలని, వారిపై కేసులు నమోదు చేయాలని జిల్లా ఎస్పీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసారు. జిల్లా…
పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం రెంటచింతల మండలం రెంటచింతల గ్రామంలోని ఎంపీడీవో ఆఫీసు నుండి బస్టాండ్ వరకు తిరంగా ర్యాలీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది పహాల్గం దాడికి నిరసనగా భారత సైనికుల శౌర్య పరాక్రమానికి నిదర్శనంగా మన భారత జాతి ఐక్యతను చాటుతూ పాకిస్తాన్ ఉగ్రములకు మన దేశ సైనిక దళాల శక్తిని నిరూపించిన మన ప్రియతమ నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు దగ్గుపాటి పురందేశ్వరి గారి ఆదేశాల మేరకు రెంటచింతల మండల బిజెపి అధ్యక్షులు బోయ నాగిరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి మాచర్ల నియోజకవర్గ నాయకులు పోకూరి కాశీపతి పాల్గొన్నారు ఆయన మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం దేశ రక్షణకు పెద్ద పీట వేస్తుందని యుద్ధంలో చనిపోయిన భారత సైనికులకు ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు పాశం మట్టారెడ్డి, అనంతవరపు గోపి, సురేష్ కుమార్…
చిలకలూరిపేట రూరల్ పోలీస్ లను ఆశ్రయించిన పసుమర్రు రైతులు నమ్మించి నిలువునా మోసం చేసిన కంపెనీ పై చర్యలు తీసుకోండి—రైతులు పొగాకు వెయ్యమని అధిక ధరకు కొనుగోలు చేస్తాం అని నమ్మించి రైతులను మోసం చేసిన GPI కంపెనీ పై చర్యలు తీసుకోవాలని చిలకలూరిపేట రూరల్ పోలీసు స్టేషన్లో పిర్యాదు చేసిన పసుమర్రు గ్రామం పొగాకు రైతులు. ఫిర్యాదుదారులు :-జక్కంపూడి అశోక్మరియు వారితో పాటు నష్టపోయిన పసుమర్రు రైతులుఅంబటి శంకర్బైపినీడి శివయ్యప్రత్తిపాటి శేషయ్యమందపల్లి బుల్లిబాబుగడిపూడి వెంకటరాయుడుబోయపాటి నాగేశ్వరరావుగొట్టిపాడు శేషుబాబుకోట బాబుగొట్టిపాటి విజయ్గొట్టిపాటి వాసుషేక్ కరీంజక్కంపూడి వినయ్ రామ్గరికపాటి చంద్రాదిత్యన్యాయవాది గదే రవితేజ తదితరులు ఉన్నారు
పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం పమిడిపాడులో హత్య గొర్రెలు విషయంలో ఎదురెదురుగా ఉన్న రెండు కుటుంబాల మధ్య ఘర్షణ ఫిరంగుల కోటేశ్వరరావు (40సం) తలపై కర్రతో దాడి చేసిన ప్రత్యర్థి ఘటనా స్థలంలోనే మృతి చెందిన ఫిరంగుల కోటేశ్వరరావు (40సం) పమిడిపాడుకి చేరుకుని విచారిస్తున్న నరసరావుపేట రూరల్ పోలీసులు.
తిరంగ ర్యాలీలో అందరూ భాగస్వాములు కావాలి. కూటమి నాయకులు. చిలకలూరిపేట పట్టణంలోని ప్రత్తిపాటి క్యాంప్ కార్యాలయంలో ఈరోజు ఉదయం కూటమి నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ఆపరేషన్ సిందూర్ విజయవంతం చేసిన సైనిక దళాలకు సంఘీభావంగా రేపు అనగా సోమవారం సాయంత్రం 4 గంటలకు స్థానిక యన్.ఆర్.టి. సెంటర్ లోని రైతు బజార్ ఎదురుగా ఉన్న మధర్ థెరిసా విగ్రహం నుండి గడియార స్థంభం వరకు ర్యాలీ నిర్వహిస్తున్నట్టు కూటమి నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీమంత్రి, శాసన సభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారు ప్రారంభించి పాల్గొన్నట్టు తెలిపారు. యుద్ధంలో పాకిస్తాన్ పై ఘనవిజయం సాధించిన భారత సైన్యానికి ధన్యవాదాలు తెలుపుతూ కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతి పరులు, దేశ భక్తి గల ప్రతీ పౌరుడు పాల్గొని వీర జవానుల మృతికి, పహాల్గామ్ ఉగ్ర దాడి మృతులకు సంతాపం తెలుపుతూ, ఆపరేషన్ సింధూర్…
పల్నాడు జిల్లా పిడుగురాళ్ళ పట్టణంలోని ఆర్ అండ్ బి బంగ్లా నుండి మార్కెట్ యార్డ్ వరకు చేపట్టిన తిరంగా ర్యాలీలో పాల్గొన్న గురజాల శాసనసభ్యులు ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు టిటిడి పాలక మండల సభ్యులు జంగా కృష్ణమూర్తి ఈ సందర్భంగా యరపతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ పాకిస్తాన్ నడ్డి విరిచి ఆపరేషన్ సింధూర్ ని విజయవంతంగా పూర్తి చేసినందుకు త్రివిధ దళాలకు అభినందనలు తెలియజేస్తున్నమన్నారు భారత సైనికుల సంఘీభావంగా భారతదేశమంతటా మరియు ఆంధ్ర రాష్ట్రంలోని అన్ని నియోజక వర్గాల్లో ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో ఘనంగా తిరంగా యాత్ర చేపట్టాం దేశ ప్రజలంతా సైనిక దళాల పరాక్రమం చూశారు ఉగ్రవాదంపై పోరాడుతున్న సైనిక దళాలకు సెల్యూట్ ప్రతి భారతీయ పౌరుడికి జాతీయ జెండా చూడగానే దేశ భక్తి, ఉద్వేగం ఉప్పొంగుతాయన్నారు భారతీయుల నినాదం ఒకటే అని దేశమంతా ఐక్యంగా ఉండాలని సమైక్యంగా ఉండాలని ఉక్రముకలను తరిమికొట్టాలన్నారు ప్రధానమంత్రి మోడీ గారి ఆధ్వర్యంలో ప్రపంచంలోనే…
నాదెండ్ల మండలం తుబాడు గ్రామ వాస్తవ్యులు గాదె బాల సౌర్రెడ్డి గారు నిన్న స్వర్గస్తులైనారు. ఆ విషయం తెలుసుకొని వారి స్వగృహం వద్ద ఉన్న వారి పార్థివ దేహానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించిన శాసనమండలి సభ్యులు శ్రీ మర్రి రాజశేఖర్ గారు..
చిరంజీవి 157 వ సినిమా సందర్భంగా ప్రత్యేక పూజలు డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్టు చేయనున్న మెగాస్టార్ చిరంజీవి 157 వ సినిమాకు స్క్రిప్ట్ రెడీ అయింది. ఈ స్క్రిప్టును బొప్పూడి ప్రసన్నాంజనేయ స్వామి గుడిలో ఉంచి పూజలు నిర్వహించిన డైరెక్టర్ అనిల్ రావిపూడి, బ్రహ్మయ్యా, కోటేశ్వరరావు, సూర్య, సాయి కృష్ణ, , శిరీష వారి స్నేహితులు మరియు కుటుంబ సభ్యులు..
చిలకలూరిపేట మండలం లో వర్షం బీభత్సం మురికిపూడి లో పిడుగు పడి పెద్ద ప్రమాదం బయటపడ్డ పరిస్థితి శనివారం రాత్రి ఉరుము, మెరుపులతో కురిసిన భారీ వర్షం దాటికి చిలకలూరిపేట మండలం మురికిపూడి గ్రామంలో మూడు అంతస్తుల భవనం మీద పిడుగుపడింది. పిడుగుపాటు కు దెబ్బతిన్న మూడంతస్తుల భవనం. పిడుగు పడ్డ ఆ నివాసంలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఇంట్లో టీవీ ఫ్రిడ్జ్ ఫ్యాన్లు అన్ని కాలిపోయాయి









