తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా మరోసారి ఎన్నికైన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. 1995 నుంచి 30 ఏళ్లుగా పార్టీ అధ్యక్షుడిగా అసమాన నాయకత్వంతో తెలుగుదేశం పార్టీని దేశంలోనే అగ్రగామి రాజకీయ శక్తిగా తీర్చిదిద్దిన చంద్రబాబు గారి నాయకత్వం అనితరసాధ్యం. చంద్రబాబు గారి నాయకత్వం, విజనరీ ఆలోచనలు, రాష్ట్రాభివృద్ధికి చేస్తున్న కృషి యావత్ తెలుగు జాతికి స్ఫూర్తిదాయకం. ఆయన నాయకత్వంలో పార్టీ కార్యకర్తలు, నాయకులు ఐక్యంగా పనిచేస్తూ రాష్ట్ర ప్రజలకు మరిన్ని సంక్షేమ, అభివృద్ధి పథకాలను అందించేందుకు పునరంకితం అవుతాం.
జీవీ ఆంజనేయులు
ప్రభుత్వ చీఫ్ విప్,
వినుకొండ శాసనసభ్యులు