తెలుగువారి ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి గౌరవ డా. నందమూరి తారక రామారావు గారు.– పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ కంచి శ్రీనివాస రావు ఐపీఎస్

పల్నాడు జిల్లా ఎస్పీ గారి కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ డా.శ్రీ.నందమూరి తారక రామారావు గారి 102వ జన్మదినము సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూల మాలలు వేసి, ఘన నివాళులు అర్పించిన శ్రీ ఎస్పీ గారు, ఇతర పోలీస్ అధికారులు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ…

1923 మే 28న కృష్ణా జిల్లా నిమ్మకూరు లో జన్మించిన ఆయనకు ఉమ్మడి గుంటూరు జిల్లాతో మంచి అనుబంధం ఉంది.ఆయన గుంటూరు పట్టణంలోని ఆంధ్రా క్రిస్టియన్ కళాశాల నందు విద్యను అభ్యసించారు.
విద్యాభ్యాసం అనంతరం సబ్ రిజిస్ట్రార్ గా పనిచేస్తూ నాటకరంగంపై ఆయనకున్న అభిరుచితో సినిమా రంగంలోకి అడుగుపెట్టినారు.

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకొని, ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకుని ఎన్నో చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించి అందరికీ “ఎన్.టి.ఆర్” గా దగ్గరయ్యారు.

సినిమా రంగం ద్వారా తెలుగు జాతి ఖ్యాతిని, తెలుగు భాష గొప్పదనాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన మహానుభావుడు. సినీ నటుడుగా తెలుగు జాతి కీర్తిని పెంచిన ఆయన, ఒక సామాజిక వేత్తగా ప్రజల సమస్యలను పరిష్కరించడానికి రాజకీయాలలో అరంగేట్రం చేసి ముఖ్యమంత్రిగా పలు ప్రజారంజక పథకాలను ప్రవేశపెట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ “తలలో నాలుకలా” దగ్గరయ్యారు.

దివిసీమ ఉప్పెన సమయంలో నిరాశ్రయులైన ప్రజలకు అండగా ఉండటానికి, వారిని ఆదుకోవడానికి స్వయంగా జోలేపట్టి బిక్షాటన చేసి మహోన్నత వ్యక్తిగా పూజ్యనీయులైనారు.
ఆ సమయంలో అధికారుల పరిధి ఎక్కువగా ఉంటే ఉండటం వలన దానిని
డీ – సెంట్రేలైజెషన్ చేయుట ద్వారా ప్రజలకు అందించే సేవలు మరింత మెరుగుపరచడం కొరకు మండల వ్యవస్థను ప్రవేశపెట్టారు.

వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు పెన్షన్ అవకాశం కలిగించినారు.

కిలో రెండు రూపాయలకు బియ్యం పథకం ప్రవేశపెట్టారు. తద్వారా స్వర్గీయ నందమూరి తారక రామారావు తీసుకు వచ్చిన పరిపాలన మార్పుల వలన ప్రజలతో అధికారులకు అనుసంధానం ఏర్పడిందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో శ్రీ ఎస్పీ గారితో పాటు అదనపు ఎస్పీ(అడ్మిన్) శ్రీ JV సంతోష్ , ఏఆర్ వెల్ఫేర్ RI శ్రీ L.గోపినాథ్ , ఎస్బి సీఐ 2 P.శరత్ బాబుగారు, సీసీ ఆదిశేషు, ఆర్ఐలు శ్రీహరి రెడ్డి , సురేష్, ఆర్ఎస్సైలు, పోలీస్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share.
Leave A Reply