చిలకలూరిపేట మండలం కుక్కపల్లివారిపాలెం గ్రామంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం నందు స్వామివారి బింబపు విమాన శిఖరము, జీవ ధ్వజ పునః ప్రతిష్టా మహోత్సవం దైవజ్ఞుల నిర్ణయం మేరకు జరుగుచుండగా ఈ మహత్తర ప్రతిష్టా కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు మరియు గ్రామ ప్రజల ప్రత్యేక ఆహ్వానంపై ముఖ్యఅతిథిగా పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజలు జరిపి, తీర్థప్రసాదాలు స్వీకరించిన శాసనమండలి సభ్యులు శ్రీ మర్రి రాజశేఖర్ గారు…
ఈ ప్రతిష్టా మహోత్సవంలో వారికి సాదర స్వాగతం పలికిన కట్టా జవహార్ బాబు గారు, కందిమళ్ళ శ్రీనివాసరావు గారు, గణేషుని లక్ష్మీనారాయణ గారు, నార్నె హనుమంతరావు గారు, దేవరకొండ గోపి గారు,కంతేటి హనుమంతరావు గారు, కొండ్రగుంట కృష్ణయ్య గారు, బోడ వీరరాఘవులు గారు, గణేషుని యజ్ఞ నారాయణ గారు, కందిమళ్ళ సత్యనారాయణ గారు తాళ్లూరి సింగారావు గారు, కట్టా నాగేశ్వరరావు గారు తదితరులున్నారు.