రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని గిరిజన ప్రాంతాల్లో వైసిపి గెలుస్తుంది – మాజీ శాసనసభ్యులు డాక్టర్ శ్రీ గోపి రెడ్డి శ్రీనివాస్ రెడ్డి
స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నరసరావుపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్టీ విభాగం అధ్యక్షులుగా నియమితులైన మొగిలి ఆంజనేయులు గారు మాజీ శాసనసభ్యులు డాక్టర్ శ్రీ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి దుశ్యాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడుతూ యువకుడు ,ఉత్సాహవంతుడు అందర్నీ కలుపుకొని పోయే మనస్తత్వం ఉన్న మొగిలి ఆంజనేయులు గారికి ST విభాగం అధ్యక్షులుగా నియమించడం చాలా ఆనందంగా ఉందని, 10 సంవత్సరాల నుంచి పార్టీలో క్రియాశీలకంగా ఉంటూ, బాధ్యతగా పనిచేసే ,అందర్నీ కలుపుకొని పోయే వ్యక్తని ,పార్టీకి సంబంధించిన అన్ని కార్యక్రమాలలో పాల్గొంటూ ,పార్టీ కోసం కష్టపడి పనిచేసేమనస్తత్వం ఉన్న వ్యక్తిని ఎంపిక చేయటం సంతోషకరమని , పార్టీ కోసం బాధ్యతగా పనిచేసి రాబోయే రోజుల్లో వైయస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా తిరిగి గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని,అదే విధంగా రాష్ట్రంలో గత ys జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో గిరిజనుల కోసం అనేక మంచి కార్యక్రమాలు చేశామని ,పాడేరులో గిరిజన యూనివర్సిటీని మరియు మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయడం జరిగిందని ,ఈ ప్రాంతానికి ఈ మెడికల్ కాలేజీ ఒక వరం లాంటిదని ,గతంలో వైద్య చికిత్సల కోసం ఆ ప్రాంతంలో ప్రజలు 250 కిలోమీటర్లు నడిచి వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది అని ,ప్రస్తుతం ఈ మెడికల్ కాలేజీ వల్ల గిరిజనులకు సూపర్ స్పెషాలిటీ వైద్యం అందుతుందని ,రాబోయే ఎన్నికల్లో అన్ని గిరిజన ప్రాంతాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ బావుటా ఎగురవేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎస్టీ కార్పొరేషన్ డైరెక్టర్ పాలపర్తి వెంకటేశ్వరరావు ,మద్దిరెడ్డి నరసింహారెడ్డి గారు , షేక్ కరిముల్లా , గంటనపాటి
గ్యాబ్రియల్ తదితర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.