Author: chilakaluripetalocalnews@gmail.com

తిరంగ ర్యాలీలో అందరూ భాగస్వాములు కావాలి. కూటమి నాయకులు. చిలకలూరిపేట పట్టణంలోని ప్రత్తిపాటి క్యాంప్ కార్యాలయంలో ఈరోజు ఉదయం కూటమి నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ఆపరేషన్ సిందూర్ విజయవంతం చేసిన సైనిక దళాలకు సంఘీభావంగా రేపు అనగా సోమవారం సాయంత్రం 4 గంటలకు స్థానిక యన్.ఆర్.టి. సెంటర్ లోని రైతు బజార్ ఎదురుగా ఉన్న మధర్ థెరిసా విగ్రహం నుండి గడియార స్థంభం వరకు ర్యాలీ నిర్వహిస్తున్నట్టు కూటమి నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీమంత్రి, శాసన సభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారు ప్రారంభించి పాల్గొన్నట్టు తెలిపారు. యుద్ధంలో పాకిస్తాన్ పై ఘనవిజయం సాధించిన భారత సైన్యానికి ధన్యవాదాలు తెలుపుతూ కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతి పరులు, దేశ భక్తి గల ప్రతీ పౌరుడు పాల్గొని వీర జవానుల మృతికి, పహాల్గామ్ ఉగ్ర దాడి మృతులకు సంతాపం తెలుపుతూ, ఆపరేషన్ సింధూర్…

Read More

పల్నాడు జిల్లా పిడుగురాళ్ళ పట్టణంలోని ఆర్ అండ్ బి బంగ్లా నుండి మార్కెట్ యార్డ్ వరకు చేపట్టిన తిరంగా ర్యాలీలో పాల్గొన్న గురజాల శాసనసభ్యులు ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు టిటిడి పాలక మండల సభ్యులు జంగా కృష్ణమూర్తి ఈ సందర్భంగా యరపతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ పాకిస్తాన్ నడ్డి విరిచి ఆపరేషన్ సింధూర్ ని విజయవంతంగా పూర్తి చేసినందుకు త్రివిధ దళాలకు అభినందనలు తెలియజేస్తున్నమన్నారు భారత సైనికుల సంఘీభావంగా భారతదేశమంతటా మరియు ఆంధ్ర రాష్ట్రంలోని అన్ని నియోజక వర్గాల్లో ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో ఘనంగా తిరంగా యాత్ర చేపట్టాం దేశ ప్రజలంతా సైనిక దళాల పరాక్రమం చూశారు ఉగ్రవాదంపై పోరాడుతున్న సైనిక దళాలకు సెల్యూట్ ప్రతి భారతీయ పౌరుడికి జాతీయ జెండా చూడగానే దేశ భక్తి, ఉద్వేగం ఉప్పొంగుతాయన్నారు భారతీయుల నినాదం ఒకటే అని దేశమంతా ఐక్యంగా ఉండాలని సమైక్యంగా ఉండాలని ఉక్రముకలను తరిమికొట్టాలన్నారు ప్రధానమంత్రి మోడీ గారి ఆధ్వర్యంలో ప్రపంచంలోనే…

Read More

నాదెండ్ల మండలం తుబాడు గ్రామ వాస్తవ్యులు గాదె బాల సౌర్రెడ్డి గారు నిన్న స్వర్గస్తులైనారు. ఆ విషయం తెలుసుకొని వారి స్వగృహం వద్ద ఉన్న వారి పార్థివ దేహానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించిన శాసనమండలి సభ్యులు శ్రీ మర్రి రాజశేఖర్ గారు..

Read More

చిరంజీవి 157 వ సినిమా సందర్భంగా ప్రత్యేక పూజలు డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్టు చేయనున్న మెగాస్టార్ చిరంజీవి 157 వ సినిమాకు స్క్రిప్ట్ రెడీ అయింది. ఈ స్క్రిప్టును బొప్పూడి ప్రసన్నాంజనేయ స్వామి గుడిలో ఉంచి పూజలు నిర్వహించిన డైరెక్టర్ అనిల్ రావిపూడి, బ్రహ్మయ్యా, కోటేశ్వరరావు, సూర్య, సాయి కృష్ణ, , శిరీష వారి స్నేహితులు మరియు కుటుంబ సభ్యులు..

Read More

చిలకలూరిపేట మండలం లో వర్షం బీభత్సం మురికిపూడి లో పిడుగు పడి పెద్ద ప్రమాదం బయటపడ్డ పరిస్థితి శనివారం రాత్రి ఉరుము, మెరుపులతో కురిసిన భారీ వర్షం దాటికి చిలకలూరిపేట మండలం మురికిపూడి గ్రామంలో మూడు అంతస్తుల భవనం మీద పిడుగుపడింది. పిడుగుపాటు కు దెబ్బతిన్న మూడంతస్తుల భవనం. పిడుగు పడ్డ ఆ నివాసంలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఇంట్లో టీవీ ఫ్రిడ్జ్ ఫ్యాన్లు అన్ని కాలిపోయాయి

Read More

శ్రీ త్రికోటేశ్వర స్వామి ఆలయంలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి దంపతులు ప్రత్యేక పూజలు ప్రముఖ పుణ్యక్షేత్రం కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామి ఆలయంలో ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ జీవి ఆంజనేయులు గారు – లీలావతి దంపతులు శనివారం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన చీఫ్ విప్ జీవి గారి దంపతులకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి మూలవిరాట్‌కు ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. లోక కళ్యాణార్థం, ప్రజల శ్రేయస్సు కోరుతూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు వారికి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జీడీసీసీ చైర్మన్ మక్కెన మల్లికార్జున రావు గారు నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Read More

బ్యాటరీ దొంగలు అరెస్ట్. బోప్పూడి గ్రామ పరిదిలోని హెచ్ పి పెట్రోల్ బంక్ వెనుక గల ఖాళీ స్థలంలో పార్క్ చేసి వున్న టిప్పర్ లారీ యొక్క రెండు బ్యాటరీలును 16.05.2025 వ తేదీ మద్యాహ్నం దొంగతనం చేసినట్లు నాదెండ్ల మండలం, గణపవరం గ్రామానికి చెందిన మలిశెట్టి శ్రీనివాసరావు చిలకలూరిపేట రూరల్ పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేయగా చిలకలూరిపేట రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్సై జి. అనిల్ కుమార్ కేసు నమోదు చేసి రెండు గంటల వ్యవదిలో ముద్దాయిలు అయిన 1. సయ్యద్ బాబు s/o [లేటు] అబ్బు @ అబ్దుల్లా, 33 సం పోలేరమ్మ గుడి వద్ద, మిలటరీ కాలనీ, ఒంగోలు పట్టణం.

Read More

తోట రాజారమేష్ ఆధ్వర్యంలో జనసేనపార్టీ క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ చిలకలూరిపేట:రాజకీయాలలో పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తకు అండగా ఉంటున్న పార్టీ జనసేనపార్టీ అని ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు అన్నారు. శనివారం చిలకలూరిపేట సమన్వయకర్త తోట రాజారమేష్ ఆధ్వర్యంలో జనసేనపార్టీ క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని పట్టణములోని రజక కమ్యూనిటీ హాల్ నందు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గాదె వెంకటేశ్వరరావు ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీలోని ప్రతి కార్యకర్తకు అండగా వుంటున్నారని, నీతి నిజాయితీలతో పార్టీ నడిపిస్తున్న గొప్ప నాయకుడు అని అన్నారు.అనంతరం క్రియాశీలక కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ నాయకులు, క్రియాశీలక కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Read More

చిరంజీవి మేధాన్ష్ కు పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని చిన్నారిని ఆశీర్వదించిన జనసేన యువనాయకులు మండలనేని చరణ్ తేజ చిలకలూరిపేట :జనసేన యువ నాయకులు మండలనేని చరణ్ తేజ నవతారంపార్టీ జాతీయ నాయకులు రావు సుబ్రహ్మణ్యం మనవడు మేధాన్ష్ అనే చిన్నారికి ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. జనసేన పార్టీలో చురుకైన యువ నాయకుడిగా గుర్తింపు పొందిన చరణ్ తేజ, రాజకీయాలతో పాటు సమాజంలోని అన్ని వర్గాల ప్రజలతో మమేకమవుతూ, వారిఆనందంలోపాలుపంచుకుంటారు.ఈ సందర్భంగా చరణ్ తేజ మాట్లాడుతూ, “చిన్నారి మేధాన్ష్ పుట్టినరోజు వేడుకలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. పిల్లల చిరునవ్వులు, వారి ఆనందమే మనందరికీ మానసిక ఉల్లాసాన్ని స్ఫూర్తినిస్తాయి. మేధాన్ష్ భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అని అన్నారు.చరణ్ తేజ, మేధాన్ష్ తల్లిదండ్రులకు కూడా శుభాకాంక్షలు తెలుపుతూ, వారి పిల్లలను చక్కగా ఉన్నత విలువలతో పెంచాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ సమన్వయకర్త…

Read More

గ్రామ స్థాయి లో నివసించే వారు చట్టాలపై అవగాహన పెంచుకోవాలి పసుమర్రు గ్రామం లో పల్లెనిద్ర చేసిన చిలకలూరిపేట రూరల్ SI అనీల్ నేటి సమాజం లో జరిగే అన్యాలపై, మహిళా లపైజరుగుతున్న దాడుల పట్ల గ్రామస్తులు అప్రమత్తం గా ఉండాలి-SI అనీల్ అనుకోని సంఘటనలు జరిగిన వెంటనే పోలీస్ లకు సమాచారం ఇవ్వాలి-SI అనీల్ కేసులపై, చట్టాలపై ప్రజలు అవగాహనా పెంచుకోవాలి-SI అనీల్ ఈ పల్లె నిద్ర లో పలు అంశాలు పై చర్చించారు. గ్రామస్తులు అధిక సంఖ్య లో పాల్గొన్నారు

Read More