ఉల్లాసంగా, ఉత్సహాం గా జాతీయ స్థాయిలో పోటీలు

హాజరైన ఐదు రాష్ట్రాల కళాకారులు, చిన్నారులు

గత40సంవత్సరాల నుండి కొనసాగుతున్న నవరస జానపద సంగీత నృత్య పోటీలు

మూడు రోజుల పాటు పండుగ వాతావరణం లో జరుగుతున్న పోటీలు

చిలకలూరిపేట పట్టణంలో గత 40 సంవత్సరాలుగా జాతీయస్థాయి నవరస శాస్త్రి జానపద సంగీత నాట్య కళారూపాలు పోటీలు జాతీయ స్థాయిలో జరుగుతున్నాయి.

ఈనెల 24 25 26 తేదీల్లో ఈ పోటీలు ఆర్యవైశ్య కళ్యాణ మండపం నందు ఘనంగా నిర్వహించారు.

వ్యవస్థాపక నిర్వాహకుడు 1984 నుండి ప్రగడ రాజ మోహన్ రావు ఆధ్వర్యంలో ఈ కళారూపాలు ప్రదర్శించబడుతున్నాయి.

ఈ పోటీలకు ఆంధ్ర ,తెలంగాణ ,కర్ణాటక, కేరళ ,చెన్నై రాష్ట్రాల నుండి కళాకారులు వచ్చి ఈ పోటీల్లో పాల్గొంటున్నారు.

పగలు, రాత్రి ఈ సంగీత కార్యక్రమాలు కొనసాగుతున్నాయి

Share.
Leave A Reply