పేట లో కోదండరామాలయం వద్ద కోడిగుడ్డు అట్ల విక్రయంపై భక్తుల ఆగ్రహం – చర్యలు తీసుకోవాలని డిమాండ్
కోదండ రామాలయం ఒక వైపు చికెన్ కిచిడి పరోట కబాబ్
- ఒక అడుగు ముందుకేసిగుడి ఆవరణలోనే కోడిగుడ్ల అట్లు*
చిలకలూరిపేట పట్టణంలోని పాత పోస్ట్ ఆఫీస్ బజార్, మద్ది మల్లయ్య వీధి శ్రీ కోదండరామాలయం గుడి ముందు కోడిగుడ్డు అట్లు విక్రయిస్తుండటంపై భక్తులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పవిత్రమైన దేవాలయం ఆవరణలో, మరీ ముఖ్యంగా హిందూ సంప్రదాయంలో నిషిద్ధమైన మాంసాహార పదార్థాలను విక్రయించడం తమ మనోభావాలను దెబ్బతీస్తోందని పలువురు భక్తులు మండిపడుతున్నారు.
భక్తుల ఆవేదన
దేవాలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలు. భక్తులు పవిత్ర భావనతో ఆలయాలకు వస్తారు. అటువంటి ప్రదేశంలో, ముఖ్యంగా రామచంద్రుడు కొలువై ఉన్న గుడి ముందు కోడిగుడ్డు అట్లు వంటి ‘నీచ పదార్థాలను’ విక్రయించడం దారుణమని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది దేవాలయ పవిత్రతను, భక్తుల విశ్వాసాలను అవమానించడమేనని వారు వాదిస్తున్నారు. హిందూ ధర్మంలో దేవాలయాల పరిసరాల్లో మాంసాహార విక్రయాలు పూర్తిగా నిషిద్ధం. అయినప్పటికీ, నిబంధనలకు విరుద్ధంగా ఈ వ్యాపారం జరుగుతోందని భక్తులు ఆరోపిస్తున్నారు.
అధికారులకు చర్యలు తీసుకోరా
ఈ విషయంపై అధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుకుంటున్నారు. దేవాలయ పరిసరాల్లో ఇటువంటి అవాంఛనీయ వ్యాపారాలకు అడ్డుకట్ట వేయాలని, దేవాలయ పవిత్రతను కాపాడాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. స్థానిక మున్సిపల్ అధికారులు, దేవాదాయ శాఖ అధికారులు ఈ విషయంపై దృష్టి సారించి, తగిన చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని వారు కోరుతున్నారు.



