చిలకలూరిపేట పురపాలక సంఘంలో అవినీతి పై సమగ్ర విచారణ చేయాలి.. బీజేపీ కో కన్వినర్ మల్లెల శివ నాగేశ్వరావు
గత ప్రభుత్వ హయాంలో చిలకలూరిపేట మున్సిపాలిటీలో ప్రతి శాఖలో అవినీతి జరిగింది. వాటిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్న చిలకలూరిపేట నియోజకవర్గం కో కన్వినర్ మల్లెల శివ నాగేశ్వరరావు.
గత కొన్ని రోజులుగా భారతీయ జనతా పార్టీ తరఫున టౌన్ ప్లానింగ్ సెక్షన్ లో ఏడు కోట్ల రూపాయల అవినీతి జరిగిందని వాటిపై సమగ్ర విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్న ఎటువంటి
చర్యలు తీసుకోకుండా మున్సిపల్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం కూడా పలు అనుమానాలకు తావు తీస్తా ఉంది.
గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం లో మాజీ మంత్రి విడుదల రజిని అలాగే మాజీ కౌన్సిలర్ విడుదల గోపి హయాంలో ఎన్నో అవకతవకలు మున్సిపల్ కార్యాలయంలో జరిగినాయి వాటిలో మచ్చుతునక అయినటువంటి టౌన్ ప్లానింగ్ అలాగే రెవెన్యూ సెక్షన్లో ఎన్నో అవినీతి అక్రమాలు జరిగాయి వాటిలో ఈరోజు రెవెన్యూ సెక్షన్లో సుమారు 40 లక్షల రూపాయలు అవకతవకలు బయట పడ్డాయి అలాగే టౌన్ ప్లానింగ్ సెక్షన్లో కోట్ల రూపాయల్లో అవినీతి జరిగింది . వాటిపై కూడా సమగ్ర విచారణ చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం.
సిఐడి విచారణ జరిపించి నిజానిజాల నిగ్గు తేల్చండి… బీజేపీ కో కన్వినర్ మల్లెల శివ నాగేశ్వరావు
చిలకలూరిపేట పురపాలక సంఘంలో జరిగిన అవినీతి రాజకీయ ఒత్తిళ్ల ద్వారా జరిగిందా లేక బ్యూరో కాట్ లు చేతి వాటం ప్రదర్శించారా అనే అంశం మీద ప్రభుత్వ ఉన్నత స్థాయి అధికారులతో లేదా సిఐడి తో విచారణ జరిపించి నిజా నిజాల నిగ్గు తేల్చాలని చిలకలూరిపేట బీజేపీ కో కన్వినర్ మల్లెల శివ నాగేశ్వరావు డిమాండ్ చేశారు. సమగ్ర విచారణ జరిపించకుండా చిన్న స్థాయి ఉద్యోగుల మీద చర్యలు తీసుకోవడం సమంజసం కాదని హితవు పలికారు. గత ప్రభుత్వ పాలనలో చిలకలూరిపేట తో పాటు పల్నాడు జిల్లాలోని పలు పురపాలక సంఘాలలో అవినీతి కార్యకలాపాలు విచ్చలవిడిగా జరిగాయని ప్రజాధనం దోపిడీకి గురైందని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి సిఐడి లేదా ఉన్నత స్థాయి అధికారుల విచారణకు ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. ఈ అంశంపై ప్రజలలో పలు అనుమానాలు రేకెత్తుతున్నాయని ఎన్ని సంవత్సరాల నుండి ఈ విధమైన అవినీతి జరుగుతుంది అనే ప్రజల సందేహం నివృత్తి కావాలంటే నిష్పాక్షిక విచారణ జరిపించాల్సిందేనని కోరారు. 15 మంది ఉద్యోగులు ఒకేసారి సస్పెండ్ కావడంతో ఈ అంశం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుందని కనుక రాష్ట్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కించకుండా సమగ్ర విచారణ జరిపించి అవినీతికి పాల్పడిన వారు రాజకీయ నాయకులైనా ఉద్యోగులైనా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సంవత్సరాల తరబడి జరుగుతున్న ఈ అవినీతి ,అక్రమాలను గుర్తించడంలో ప్రభుత్వ ఆడిటింగ్ విభాగం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఎన్ని సంవత్సరాల కాలం నుంచి ఈ అవినీతి జరుగుతుందో సమగ్రమైన దర్యాప్తు జరిపించడం ద్వారా భవిష్యత్తులో రాజకీయపరమైన అవినీతి అయినప్పటికీ ఉద్యోగుల ద్వారా జరిగేటటువంటి అవినీతి అయినప్పటికీ అడ్డుకట్ట వేయగలిగే అవకాశం ఉంటుందని మల్లెల శివ నాగేశ్వరావు అభిప్రాయ పడ్డారు. పురపాలక సంఘంలో జరిగిన అవినీతికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అలాగే సమగ్ర విచారణ చేసి ఈ సంఘటనకు కారకులైన బాధ్యులను గుర్తించిన తరువాత వారి మీద చర్య తీసుకోవడం సమంజసమని ఒకవేళ విచారణ అనంతరం ఈనాడు అనుమానంతో సస్పెండ్ చేసినటువంటి అధికారులు నిజాయితీపరులను నిర్ధారించబడితే వారికి వ్యక్తిగతంగా జరిగిన నష్టానికి బాధ్యత ఎవరు వహిస్తారని ప్రశ్నించారు.2021 నుండి 2024 సంవత్సరం ఎన్నికల సమయం వరకు బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుని ప్రజాధనాన్ని దోపిడీ చేసిన వారు ఎవరైనప్పటికీ తగు చర్యలు తీసుకొని అవినీతికి గురైన సొమ్మును రికవరీ చేయాలని బాధ్యులను కఠినంగా శిక్షించాలని బీజేపీ నియోజకవర్గ కో కన్వినర్ మల్లెల శివ నాగేశ్వరావు డిమాండ్ చేశారు .



