Author: chilakaluripetalocalnews@gmail.com

గోతుల మ‌యంగా మారిన పేట రోడ్లుప్ర‌మాదాల‌కు కార‌ణ‌మౌతున్న గోతులుకౌన్సిల‌ర్లు రోడ్ల దుస్థితిపై గ‌ళ‌మెత్తాలిమాజీ మున్సిప‌ల్ కౌన్సిల్ ప్ర‌తిప‌క్ష‌నాయ‌కుడు షేక్ జ‌మాల్ బాషచిల‌క‌లూరిపేట‌:చిల‌క‌లూరిపేట ప‌ట్ట‌ణం గోతుల మ‌యంగా మారి, ప్ర‌జ‌ల ఇబ్బందుల‌కు కార‌ణ‌మౌతుంద‌ని టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మున్సిప‌ల్ కౌన్సిల్ ప్ర‌తిప‌క్ష‌నాయ‌కుడు షేక్ జ‌మాల్ బాష విమ‌ర్శించారు. శుక్ర‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ మాజీ మంత్రి ప్ర‌త్తిపాటి పుల్లారావు అధికారంలోకి రాగానే ప‌ట్ట‌ణ ప‌రిధిలో ఉన్న రోడ్ల దుస్థితిపై దృష్టి సారించార‌ని, ప‌లు మార్లు స‌మీక్ష స‌మావేశాల్లో సైతం ప‌ట్ట‌ణ అభివృద్దిపై చ‌ర్చించార‌ని గుర్తు చేశారు. కాని ఏడాది గ‌డుస్తున్నా మున్సిప‌ల్ అధికారులు ప‌ట్ట‌ణంలోని రోడ్ల దుస్థితిపై దృష్టి సారించ‌క‌పోవ‌డం విచార క‌ర‌మ‌న్నారు. కొంత మంది ఎటువంటి అనుమ‌తులు లేకుండానే మున్సిప‌ల్ కుళాయిల మ‌ర‌మ‌త్తుల కోసం గోతులు తీసి వ‌ద‌లివేస్తున్నార‌ని, వివిధ కార‌ణాల‌తో అండ‌ర్ కేబుల్ వ్య‌వ‌స్థ కోసం ప్రైవేటు సంస్థ‌లు రోడ్ల‌ను ద్వంసం చేసి, అనంత‌రం వాటిని పూడ్చ‌క పోవ‌డంతో…

Read More

పుట్టినరోజు నాడు తిరుమల శ్రీవారి ని దర్శించు కోవడం సంతోషం గా ఉంది-ఎమ్మెల్యే ప్రత్తిపాటి పేదలకు సంక్షేమం అందించడానికి కృషి చేస్తున్న సీఎం చంద్రబాబు నాయుడి ఆశలు, ఆకాంక్షలు నెరవేరాలని శ్రీవెంకటేశ్వర స్వామివారి ని వేడుకున్నా-ఎమ్మెల్యే ప్రత్తిపాటి దేశంలో నే ఆంద్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలవాలని, ఆ దిశగా సీఎం చంద్రబాబు పాటు పడుతున్నారని, వారికి ఆయురాగ్యాలు స్వామి ఇవ్వాలన్నా-ఎమ్మెల్యే ప్రత్తిపాటి మహానాడు లో తీర్మాణాలన్ని దిగ్విజయంగా అమలై లోకేష్ నాయకత్వం లో టీడీపీ తిరుగులేని శక్తి గా ఎదగాలని స్వామివారి ని కోరుకున్నా-ఎమ్మెల్యే స్వామివారి ఆశీసులు తో సూపర్ సిక్స్ పథకాలన్నీ అమలు చేస్తామన్నా-శాసన సభ్యులు ప్రత్తిపాటి

Read More

కడప మహానాడులో విజయవాడ మాజీ ఎమ్మెల్యే స్టేజీ పై కుప్పకూలిన ఘటన వెంటనే స్పందించి ప్రథమ చికిత్స అందించి ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లిన నరసరావుపేట ఎమ్మెల్యే డా౹౹చదలవాడ అరవింద బాబు కడపలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న కడప మహానాడు వేదికపై పార్టీ ప్రసంగం జరుతున్న క్రమంలో విజయవాడ మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఆకస్మికంగా కుప్పకూలారు.ఘటన చూసిన వెంటనే సీఎం చంద్రబాబు నాయుడు వేదిక మీదున్న నరసరావుపేట ఎమ్మెల్యే డా౹౹చదలవాడ అరవింద బాబును ప్రథమ చికిత్స చేయాలని ఆదేశించడంతో స్పందించిన డా౹౹చదలవాడ ప్రాథమిక చికిత్స అందించి దగ్గరలో ఉన్న సన్ రైజు హాస్పిటల్ కు తీసుకుని వెళ్ళారు.వైద్య పరీక్షల అనంతరం వైద్యులు సకాలంలో తీసుకొనిరావడం వలన జలీల్ ఖాన్ గారి ఆరోగ్యానికి ఎటువంటి ప్రమాదం లేదని తెలిపారు.హాస్పిటల్ లో జలీల్ ఖాన్ ఆరోగ్య పరిస్థిని తెలుసుకొని ఎప్పటికప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారికి మరియు కేంద్ర కార్యాలయానికి సమాచారం అందిస్తున్నారు.

Read More

పెదకూరపాడు నియోజకవర్గం అమరావతి గ్రామంలోని శ్రీ పెద్దింటమ్మ తల్లి దేవస్థానం నందు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించు తదుపరి వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు అమరావతి మండల MPTC ఆలా లక్ష్మీనారాయణ గారి మనవడి అన్నప్రాసన్న వేడుకలో పాల్గొని చిన్నారిని ఆశీర్వదిస్తున్న గుంటూరు నగర మాజీ మేయర్ కావటి శివ నాగ మనోహర్ నాయుడు గారు.ఈ కార్యక్రమంలో YSRCP ముఖ్య నాయకులు భవిరిశెట్టి హనుమంతరావు, పార్టీ ఇతర ముఖ్య నేతలు బంధుమిత్రులు పాల్గొన్నారు

Read More

జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణ కు చర్యలు పల్నాడు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగిన జిల్లా రోడ్డు భద్రత కమిటీలో జిల్లాలో రోడ్డు ప్రమాదాలు గతంలో కన్నా అధికంగా జరుగుతున్న కారణంగా వాటిని నివారించడానికి జిల్లా కలెక్టర్ రవాణా శాఖ, పోలీస్ శాఖ వారిని జాయింట్ ఎన్ఫోర్స్మెంట్ నిర్వహించమని ఆదేశాలు జారీ చేయడం జరిగినది. ఈ ఆదేశాల మేరకు తేది 29-05-2025 న ఆర్టీసీ, పోలీస్ శాఖ మరియు రవాణా శాఖ అధికారులు రావిపాడు రోడ్డు, వినుకొండ రోడ్డు మరియు గుంటూరు రోడ్డు నుండి వెళ్లే రహదారిలో తనిఖీలు నిర్వహించడం జరిగినది. ఈ తనిఖీలలో భాగంగా పరిమితికి మించి ప్రయాణం చేస్తున్న వాహనములపై కేసులు నమోదు చేయడం జరిగినది. ఈ తనిఖీలలో ఆటో రిక్షాలు వాహనములపై తనిఖీలు నిర్వహించి 33 వాహనాలపై కేసు నమోదు చేసి అందులో 7 వాహనములను సీజ్ చేయడం జరిగినది, Rs.2,20,000/-, అపరాధ రుసుము సేకరించడమైనది. ఈ…

Read More

రేపు యడ్లపాడు మండలం లోకరెంట్ కట్ చేసే ఏరియాలు రేపు 30-05-25 శుక్రవారం యడ్లపాడు మండలం లోని కొండవీడు, పుట్టకోట, సొలస, లింగారావుపాలెం, చెంగిజ్ ఖాన్ గ్రామములో లైన్ల మరమ్మత్తుల కారణంగా ఉదయం 8గంటల నుండి మధ్యాహ్నం 1 వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడును కావున విద్యుత్ వినియోగదారులు సహకరించగలరు…. ఆర్ అశోక్ కుమార్,డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, విద్యుత్ శాఖ,చిలకలూరి పేట.

Read More

నాదెండ్ల మండలం సంక్రాంతిపాడు గ్రామ సర్పంచ్ జెట్టి బోల్లయ్య గారి తల్లి పుల్లమ్మ గారు ఈనెల 15న స్వర్గస్తులైనారు. ఈరోజు వారి పెద్దకర్మ సందర్భంగా వారి చిత్రపటానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించిన శాసనమండలి సభ్యులు శ్రీ మర్రి రాజశేఖర్ గారు… ఈ కార్యక్రమంలో వారి వెంట కిలారి బాలకృష్ణ గారు, మురుకుట్ల సాంబశివరావు గారు, శివ మాణిక్యాలు గారు, కట్టెబోయిన కోటయ్య గారు, కట్టెబోయిన వీరస్వామి గారు, రాచమంటి చింతారావు గారు, కొక్కెర చిట్టి బాబు గారు, బత్తుల సీతారామయ్య గారు, సాంబయ్య గారు, కుమార్ గారు తదితరులున్నారు.

Read More

యడ్లపాడులో ఘనంగా రక్తదాన శిబిరం చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు జన్మదినాన్ని పురస్కరించుకుని యడ్లపాడులోని ఎంపీడీవో కార్యాలయంలో ఈరోజు రెడ్‌క్రాస్ సౌజన్యంతో భారీ రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని యడ్లపాడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కామినేని సాయిబాబు పర్యవేక్షించారు.ఈ రక్తదాన శిబిరంలో ఎంపీడీవో మరియు ఎమ్మార్వోతో పాటు పలువురు మండల స్థాయి అధికారులు, నాయకులు, యువకులు ఉత్సాహంగా పాల్గొని రక్తదానం చేశారు. చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు దీర్ఘాయుష్షు, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు కామినేని సాయిబాబు తెలిపారు.ఈ సందర్భంగా కామినేని సాయిబాబు మాట్లాడుతూ, సమాజ సేవలో భాగంగా రక్తదానం చేయడం ఎంతో గొప్ప విషయమని, ఆపదలో ఉన్నవారికి ప్రాణదానం చేసినట్టేనని అన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ఎంపీడీవో, ఎమ్మార్వోతో పాటు రెడ్‌క్రాస్ ప్రతినిధులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. మాజీ సొసైటీ ప్రెసిడెంట్ మద్దినేని సుబ్బారావు, పోపూరి వెంకయ్య మరియు బోడా, సద్దాం తదితరులు…

Read More

పదవీకాంక్ష కంటే ప్రజల బాగోగులే ప్రత్తిపాటికి ముఖ్యం : టీ.ఎన్.ఎస్.ఎఫ్, నేత గట్టినేని సాయి ప్రజల బాగోగులే ప్రత్తిపాటికి ముఖ్యమని, నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేయాలి.. ఏం చేస్తే తనప్రాంత ప్రజలు సంతోషంగా ఉంటారన్న ఆలోచనలుతప్ప ప్రత్తిపాటికి ఎలాంటి పదవీ కాంక్ష ఉండదని నియోజకవర్గ టీ.ఎన్.ఎస్.ఎఫ్ అధ్యక్షుడు గట్టినేని విజయ్ సాయి తెలిపారు. గురువారం నియోజకవర్గ టీ.ఎన్.ఎస్.ఎఫ్ విభాగంలో తిరుపతిలో ప్రత్తిపాటి పుల్లారావు జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. మాజీమంత్రి ప్రత్తిపాటి వేంకటేశ్వరుని దర్శనానికి వెళ్లారని తెలుసుకున్న టీ.ఎన్.ఎస్.ఎఫ్ నేతలు నేరుగా తిరుపతి వెళ్లి అక్కడే ఆయన సమక్షంలోనే ఘనంగా పుట్టినరోజు వేడుక నిర్వహించారు. ప్రత్యేకంగా తయారు చేయించిన కేక్ ను ప్రత్తిపాటితో కట్ చేయించిన టీ.ఎన్.ఎస్.ఎఫ్ నేతలు ఆయనకు తినిపించి తమ ఆనందాన్ని ఆయనతో పంచుకున్నారు. అనంతరం ప్రత్తిపాటిని పూలమాలలతో సన్మానించిన టీ.ఎన్.ఎస్.ఎఫ్ నేతలు ఆయన ఆశీర్వాదం తీసుకొని అక్కడినుంచి వెనుదిరిగారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి…

Read More

పేట అభివృద్దికి శాశ్వ‌త చిరునామ ప్ర‌త్తిపాటి మ‌రిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలి, ప్రజా సేవలో సుదీర్ఘ కాలం ఉండాలి మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్ర‌త్తిపాటి పుల్లారావుకు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపిన‌. జ‌న‌సేన పార్టీ సెంట్రెల్ ఆంధ్ర కో-క‌న్వీన‌ర్ పెంటేల బాలాజి చిల‌క‌లూరిపేట నియోజక‌వ‌ర్గ అభివృద్దికి శాశ్వ‌త చిరునామగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్ర‌త్తిపాటి పుల్లారావు నిలిచార‌ని జ‌న‌సేన పార్టీ సెంట్రెల్ ఆంధ్ర కో-క‌న్వీన‌ర్ పెంటేల బాలాజి అన్నారు. మాజీ మంత్రి, చిల‌క‌లూరిపేట ఎమ్మెల్యే ప్ర‌త్తిపాటి పుల్లారావుకు గురువారం ఆయ‌న జ‌న్మ‌దిన శుభాకాంక్షలు తెలిపారు. “దేవుడు మీకు మంచి ఆరోగ్యం, సంతోషం, దీర్ఝాయుషు ఇవ్వాలని. మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలని, ప్రజా సేవలో సుదీర్ఘ కాలం ఉండాలని” ఆకాంక్షిస్తున్న‌ట్లు పేర్కొన్నారు.సంవ‌త్స‌ర కాలంలోనే ప‌ట్టాలెక్కిన అభివృద్ది…ప్ర‌జ‌ల‌కు మంచి చేయాల‌న్న సంక‌ల్పం, దాన్ని నెర‌వేర్చే చిత్త‌శుద్ది ఉంటే ఏ నాయ‌కుడైనా ప్ర‌జ‌ల హృద‌యాల్లో చెరగ‌ని ముద్ర వేస్తాడ‌న్న‌ది చ‌రిత్ర చెబుతున్న నిజమ‌ని, అనునిత్యం ప్ర‌జ‌ల్లో ఉంటూ,…

Read More