నిన్న మునిసిపల్ కమీషనర్ అక్రణ తొలగింపు గురించి మాట్లాడటం చాలా హర్షించదగ్గ విషయం
అలాగే ఇంకొక సమస్య అయినా ఆర్ వి ఎస్ సి వి ఎస్ హై స్కూల్ రోడ్డు మాస్టర్ ప్లాన్ ప్రకారం 80 అడుగులు చూపించగా అదే రోడ్డులో రూల్స్ ప్రకారం వదలవలసిన ఖాళీ స్థలం కాకుండా మాస్టర్ ప్లాన్ రోడ్డును కూడా ఆక్రమించి నిర్మాణం చేస్తున్న పట్టించు కొని మునిసిపల్ అధికారులు.ప్రస్తుతం ఉన్న రోడ్డు 30 అడుగులు కాగా మాస్టర్ ప్లాన్ రూల్ ప్రకారం వదలవలసిన 25 అడుగులు మరియు ఫ్రెంట్ ఓపెన్ స్పేస్ ఈ రెండు వదలకుండా రోడ్డు మీదకు వచ్చి నిర్మాణం చేస్తున్న పట్టించుకోకుండా ఉన్న మున్సిపల్ అధికారులు ఈ విషయంపై వెంటనే తగు చర్యలు తీసుకోవాలని పుర ప్రజలు కోరుకుంటున్నారు ఎందుకంటే ఈ రోడ్డులో ఆరు స్కూల్స్ ఉన్నవి అందువలన మున్సిపల్ కమిషనర్ గారు దీనిపై దృష్టి పెట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో తెలంగాణ రాష్ట్రంలో హైడ్రా వారు అక్రమ నిర్మాణాల కూల్చివేత పై తెలంగాణ హైకోర్టు మీరు నిర్మాణం చేసే ముందు ఆపకుండా కాసులకు కక్కుర్తి పడి నిర్మాణం అయిన తర్వాత కూల్చివేతలు చేయడం ఇటు నిర్మాణదారుడికి ప్రభుత్వానికి అన్నిటికీ కూడా నష్టం వాటిల్లుతోంది కాబట్టి ఇకనైనా నిర్మాణం జరిగే ముందే చర్యలు తీసుకోవాలని హైకోర్టు అభిప్రాయపడ్డది. సదరు ఈ విషయాన్ని గమనించి మున్సిపల్ శాఖ అధికారులు మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు ప్రజా ప్రతినిధులు వెంటనే దీనిపై దృష్టి పెట్టాలని పుర ప్రజలు కోరుకుంటున్నారు

Share.
Leave A Reply