డాక్టర్ వైయస్ రాజశేఖర్   రెడ్డి 76వ జయంతి వేడుకలు

మాజీ మంత్రి శ్రీమతి విడుదల రజిని ఆదేశానుసారం పట్టణ అధ్యక్షులు షేక్ ధరియావలి మరియు పల్నాడు జిల్లా యూత్ ప్రెసిడెంట్ కందుల శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఘనంగా వైయస్సార్ 76వ జయంతి వేడుకలు

ఈరోజు డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 76వ జయంతి సందర్భంగా చిలకలూరిపేట నియోజకవర్గం లోని పలు గ్రామాలలో మరియు పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఆయన విగ్రహాలకి పూలమాలలు వేసి,పాలాభిషేకం చేసి ఆయనకి నివాళులర్పించారు.

ముందుగా మాజీ మంత్రి శ్రీమతి విడదల రజని గారి నివాసంలో డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి కేక్ కటింగ్ కార్యక్రమం జరిగింది.

తరువాత వైయస్సార్ అభిమానులు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పలువురు నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా రక్తదానం చేయడం జరిగింది.

ముందుగా పల్నాడు జిల్లా యూత్ ప్రెసిడెంట్ మరియు యువ నాయకుడు కందుల శ్రీకాంత్ రక్తదానం చేయడంతో పలువురు యువకులు కూడా ఆయనను స్ఫూర్తిగా తీసుకొని స్వచ్ఛందంగా ఉత్సాహంగా పోటీపడి రక్తదానం చేయడం జరిగింది.

తదనంతరం నియోజకవర్గ మండల స్థాయి కులు కార్యకర్తలు అందరూ కలిసి పట్టణంలోని పలు వార్డులలో ఉన్న వైయస్సార్ విగ్రహాలకి పూలమాలలు వేసి పాలాభిషేకం చేసి నివాళులర్పించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ స్థాయి నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Share.
Leave A Reply