చంద్రబాబు ఏడాది పాలన….. రాష్ట్రప్రగతికి బాటలు వేసింది : ప్రత్తిపాటి.

  • పట్టణంలోని పలువార్డుల్లో సుపరిపాలనలో తొలిఅడుగులో పాల్గొన్న మాజీమంత్రి.

జగన్ విధ్వంస విద్వేష పాలన నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించడంతో పాటు ప్రజల సంతృప్తి… రాష్ట్ర ప్రగతికి బాటలు వేసేలా ఏడాదిలో కూటమిప్రభుత్వం గొప్పవిజయాలు సాధించిందని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. మంగళవారం ఆయన పట్టణంలోని 34, 35 వార్డుల్లో ఇంటింటికీ తిరిగి ప్రజలతో మమేకమై, కూటమిప్రభుత్వ ఏడాది ప్రగతిని వివరించారు. అంతకు ముందు పార్టీ శ్రేణులతో సమావేశమై కూటమిప్రభుత్వ పనితీరును ప్రజలకు వివరించడంపై వారికి దిశానిర్దేశం చేశారు.

మన నాయకుడు చేసినమంచిని కాలర్ ఎగరేసి గర్వంగా చెప్పుకుందాం..

జగన్ ఐదేళ్లలో సాధించలేనిది.. చంద్రబాబు ఏడాదిలోనే సాధించారని, కూటమిప్రభుత్వ సుపరిపాలనను ప్రజలకు అర్థమయ్యేలా పార్టీ శ్రేణులు వివరించాలని ప్రత్తిపాటి సూచించారు. వైసీపీ నాయకుల్లా మాయమాటలు చెప్పి ప్రజల్ని మోసగించలేదని.. అందరం గర్వంగా చెప్పుకునేలా మన నాయకుడు సంవత్సరంలోనే ఎన్నో మంచిపనులు చేశారని ప్రత్తిపాటి స్పష్టంచేశారు.

Share.
Leave A Reply