Author: chilakaluripetalocalnews@gmail.com

రేషన్ బియ్యం అక్రమ రవాణాపై విజిలెన్స్ పంజా.. అచ్చంపేటలో భారీగా బియ్యం స్వాధీనం. పల్నాడు జిల్లా అచ్చంపేటలో 82 బస్తాల (37.25 క్వింటాళ్లు) PDS బియ్యం సీజ్. సీతారాంపురం వాగు వద్ద నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని పట్టుకున్న విజిలెన్స్ అధికారులు. అక్రమ వ్యాపారం చేస్తున్న ముండ్రు వీరభద్రరావుపై క్రిమినల్ కేసు నమోదుకు ఆదేశం. నిందితుడిపై ఈసీ యాక్ట్ (6A) కింద కేసు నమోదు చేసిన అధికారులు. గత వారం భట్టిప్రోలులో 404 బస్తాల బియ్యం సీజ్.. నేడు అచ్చంపేటలో వరుస దాడులు. రేషన్ మాఫియాపై విసృత తనిఖీలు చేపట్టిన గుంటూరు ప్రాంతీయ విజిలెన్స్ బృందం.

Read More

పేట పట్టణంలో ఆక్రమణలు బోర్డులకే పరిమితమైన నిబంధనలు! చిలకలూరిపేట పట్టణంలోని ప్రధాన రహదారులపై ట్రాఫిక్ కష్టాలు తీర్చడానికి అధికారులు చేపట్టిన చర్యలు “మూడు రోజుల ముచ్చట”గా మారుతున్నాయి. నర్సరావుపేట సెంటర్ నుండి రిజిస్టర్ ఆఫీస్ వరకు రోడ్డు విస్తరణ, ఆక్రమణల నివారణ కోసం ఏర్పాటు చేసిన బోర్డులు నేడు కేవలం అలంకారప్రాయంగా మిగిలాయి.అట్టహాసంగా మార్కింగ్.. ఆపై మౌనంకొద్ది రోజుల క్రితం టౌన్ ప్లానింగ్ అధికారులు నర్సరావుపేట సెంటర్ నుంచి రిజిస్టర్ ఆఫీస్ వరకు రహదారికి ఇరువైపులా ఆక్రమణలు జరగకుండా స్పష్టమైన మార్కింగ్ ఇచ్చారు. ప్రజలకు అవగాహన కల్పించేలా, నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరిస్తూ బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. ఈ చర్యల వల్ల మొదటి పది రోజులు రహదారి ఎంతో విశాలంగా, వాహనాల రాకపోకలకు అనువుగా కనిపించింది.అద్దె దందా: ఆక్రమణలే ఆదాయ మార్గంనిబంధనలు అమలులోకి వచ్చిన కొద్ది రోజులకే పరిస్థితి మళ్ళీ మొదటికి చేరింది. షాపుల యజమానులు తమ షాపుల…

Read More

పదవీ గండమే టీమ్ 11 ను అసెంబ్లీ గడప తొక్కిస్తోంది : ప్రత్తిపాటి “ పదవీ గండమే టీమ్ 11ను అసెంబ్లీ గడప తొక్కేలా చేస్తోంది. తమను గెలిపించిన ప్రజల్ని పట్టించుకోని ప్రజాప్రతినిధుల్ని ఉపేక్షించకూడదన్న స్పీకర్ నిర్ణయమే.. జగన్ & టీమ్ ను ఒక్కరోజు అసెంబ్లీకి వచ్చేలా చేసిందనే చెప్పాలి. ఉన్న ఎమ్మెల్యే పోస్టు కూడా ఊడితే.. ప్రజల్లో మరీ చులకన అవుతామన్న భయంకూడా మరో కారణం. ప్యాలెస్ లు, విలాసాలపై ఉన్న మోజులో పదోవంతు కూడా జగన్ కు ప్రజాసమస్యలపై లేకపోవడం విచారకరం. ఎన్నికలప్పుడు తప్ప మరెప్పుడూ తనకు ప్రజలతో పనిలేదని తన చర్యలతో జగన్ పదేపదే నిరూపిస్తున్నాడు. గతంలో తమకు జీతాలతో పనిలేదు…స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్నా వుయ్ డోంట్ కేర్ జగన్.. ఇప్పుడు ఏ ఉద్దేశంతో, ఎవరిని ఉద్దరించడానికి అసెంబ్లీకి వస్తున్నాడో ప్రజలకు సమాధానం చెప్పాలి. వైసీపీ నేతలు ఆందోళన చెందాల్సింది జగన్ భద్రతపైకాదు..ప్రజల భద్రతపైతనను దారుణంగా…

Read More

కొండవీడు ఉత్సవాల ముగింపు ప్రత్యేక కథనం చరిత్రను వర్తమానానికి అన్వయించి.. కొండవీడు ఉత్సవాల నిర్వహణతో ప్రత్తిపాటి తన సమర్థత చాటుకున్నారు : బీసీ జనార్ధన్ రెడ్డి14వ శతాబ్దంలో రెడ్డిరాజులు నిర్మించిన కొండవీడు కోటను ప్రత్తిపాటి నేడు పునర్నిర్మించారు : డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు మన ప్రియతమ నాయకుడు చంద్రబాబు తరచూచెప్పే మాటను మాజీమంత్రి ప్రత్తిపాటి ఆచరణసాధ్యం చేశారని, గతాన్ని విస్మరించకుండా, ఆ జ్ఞాపకాలు, అనుభవాలతో వర్తమానాన్ని సంతోషంగా మార్చుకోవాలనే సీఎం సూచనను కొండవీడు ఉత్సవాల నిర్వహణతో ప్రత్తిపాటి నిజం చేశారని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖా మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం రాత్రి అంబరాన్నంటేలా సాగిన కొండవీడు ముగింపు ఉత్సవాల వేడుకకు మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, ఎమ్మెల్యేలు ప్రత్తిపాటి పుల్లారావు, జూలకంటి బ్రహ్మానందరెడ్డిలు ప్రత్యేక అతిథులుగా హాజరై సందడి చేశారు. భారీగా తరలివచ్చిన జనంతో కొండపైకి వెళ్లడానికి మంత్రి, డిప్యూటీ స్పీకర్…

Read More

కొండవీడు ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేయడంలో ప్రత్తిపాటి అభినవ అణిపోతారెడ్డిగా నిలిచారు: కందుల దుర్గేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ల కృషి వల్లే రాష్ట్రంలో ఈ 18 నెలల్లో అనేక ఉత్సవాలు నిర్వహించామని, ప్రజల జీవితాల్లో కూడా ఉత్సవ వాతావరణ కనిపిస్తోందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి దుర్గేశ్ తెలియచేశారు. ఈ తరహా ఉత్సవాలు రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ ను పెంచుతాయన్నారు.ఆదివారం ఆయన కొండవీడు ఉత్సవాలకు ప్రత్యేక అతిథిగా హాజరై, కొండపైన..దిగువన ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక, వినోద కార్యక్రమాలను స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు, నరసరావుపేట శాసనసభ్యులు చదలవాడ అరవిందబాబు, జిల్లా కలెక్టర్ శ్రీమతి కృతికాశుక్లా, గుంటూరు మిర్చి యార్డ్ చైర్మన్ కుర్రా అప్పారావుతో కలిసి వీక్షించారు. అనంతరం కొండపైన ఏర్పాటుచేసిన సభను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగాన్ని వైవీ సుబ్బారెడ్డే అంగీకరించారుతిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి వినియోగించింది…

Read More

ప్రముఖ శైవ క్షేత్రంగా పేరుగాంచిన కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామివారిని ప్రముఖ సినీ నటుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత రాజేంద్రప్రసాద్ ఆదివారం ఉదయం దర్శించుకున్నారు స్వామివారి సన్నిధికి విచ్చేసిన ఆయనకు బీసీ వెల్ఫేర్ శాసనసభ కమిటీ సభ్యులు, నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద బాబు గారు ఆలయ ప్రాంగణంలో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా త్రికోటేశ్వర స్వామివారికి నిర్వహించిన ప్రత్యేక అభిషేకాలు, పూజా కార్యక్రమాలలో సినీ నటుడు రాజేంద్రప్రసాద్, ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు గారు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. కోటప్పకొండ వైభవం, మహాశివరాత్రి తిరుణాళ్ల సందర్భంగా చేపడుతున్న విస్తృత ఏర్పాట్ల గురించి ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు గారు రాజేంద్రప్రసాద్‌కు వివరించారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని సుమారు 20 నుంచి 25 లక్షల మంది భక్తులు కోటప్పకొండకు విచ్చేసే అవకాశముందని తెలిపారు.

Read More

చిలకలూరిపేటలో వినూత్న మోసం: వ్యాపారులు జాగ్రత్త చిలకలూరిపేట: పట్టణంలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. అమాయక వ్యాపారుల నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని వేల రూపాయలు కాజేస్తున్నారు. తాజాగా మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్‌లోని ఒక చికెన్ సెంటర్‌లో జరిగిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. అసలేం జరిగిందంటే?మున్సిపాలిటీ గదుల్లో చికెన్ వ్యాపారం నిర్వహిస్తున్న దస్తగిరి అనే వ్యాపారి వద్దకు ఒక వ్యక్తి సూటు, బూటు ధరించి నాగరికుడిలా వచ్చాడు. తొలుత రూ. 1000 విలువైన మాంసాన్ని కొనుగోలు చేసి, ఆ మొత్తాన్ని ఆన్‌లైన్ ద్వారా చెల్లించాడు. ఆ డబ్బులు ఖాతాలో జమ కావడంతో వ్యాపారి అతడిని నమ్మాడు.ఆ తర్వాత, తనకు అత్యవసరంగా నగదు కావాలని, మీ ఖాతాకు రూ. 20,000 పంపిస్తానని, అది చూసుకుని తనకు నగదు ఇవ్వాలని సదరు వ్యక్తి కోరాడు. వ్యాపారి సరేననడంతో, తన మొబైల్‌లో డబ్బులు పంపినట్లుగా ‘సక్సెస్‌ఫుల్’ అని మెసేజ్ చూపించాడు. వ్యాపార తొందరలో ఉన్న దస్తగిరి, ఆ…

Read More

అద్భుతమైన నిర్మాణాలు.. శిల్పకళ, చిత్రకళ, జలకళకు ప్రతీక కొండవీడు రెడ్డిరాజుల ఏలుబడిలో ఆనాడే తెలుగు సాహిత్యం, చిత్రకళ, శిల్పకళ, యుద్ధ నైపుణ్యాలకు, శత్రు రక్షణకు ప్రధాన స్థావరంగా కొండవీడు కోట నిలిచిందని, ఇక్కడ చేసేది సామాన్య ట్రెక్కింగ్ కాదని, మన చరిత్రతో సంభాషిస్తూ, మన పూర్వీకులతో కలిసి అడుగులు వేయడం అని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. కొండవీడు ఉత్సవాల్లో భాగంగా తొలిరోజు ఉత్సవాలకు ప్రత్యేక అతిథిగా విచ్చేసిన ఆయన అతిథులు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు, స్థానిక శాసనసభ్యులు, మాజీమంత్రి ప్రత్తిపాటితో కలిసి కొండవీడు ఉత్సవాలను లాంఛనంగా ప్రారంభించారు. తొలుత ఉత్సవాలకు విచ్చేసిన కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీ లావు, ఎమ్మెల్యే ప్రత్తిపాటికి అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఉత్సవాల ప్రాంగంణంలో ఏర్పాటుచేసిన వేదికపై నుంచి వారు ప్రసంగించారు. తెలివైన ప్రణాళికలు, దూరదృష్టి నిర్మాణాలకు ప్రతీకలు కొండవీడు నిర్మాణాలు…

Read More

కొండవీడు అభివృద్ధికి “చతుః షష్టి కళల రేడు — మన కొండవీడు” నినాదాన్ని స్వీకరించాలి పల్నాడు జిల్లా కలెక్టర్‌కు చిలకలూరిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త రాష్ట్ర కాంగ్రెస్ మాజీ ప్రధాన కార్యదర్శి ఎం. రాధాకృష్ణ ఎడ్లపాడు మండల కాంగ్రెస్ నాయకుల విజ్ఞప్తి చారిత్రక ప్రాధాన్యత కలిగిన కొండవీడు కోటను అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు పల్నాడు జిల్లా కలెక్టర్ శ్రీమతి కృతికా శుక్లా చూపిస్తున్న చొరవ అభినందనీయమని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త మరియు రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి ఎం. రాధాకృష్ణ పేర్కొన్నారు. కొండవీడు ఫెస్టివల్ ఏర్పాట్ల పరిశీలనలో ఉన్న జిల్లా కలెక్టర్‌ ను కలిసి రాధాకృష్ణ కాంగ్రెస్ నాయకులు ఒక వినతిపత్రాన్ని సమర్పించారు.ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ గతంలో ప్రసిద్ధ శివ క్షేత్రమైన కోటప్పకొండను “కోటి వేల్పుల అండ– కోటప్పకొండ” అనే నినాదంతో అభివృద్ధి చేసిన తీరును వివరించి, అదే స్ఫూర్తితో కొండవీడు అభివృద్ధికి “చతుః షష్టి…

Read More

మాచర్ల పట్టణంలో జనతా వారధి కార్యక్రమం నిర్వహించడం జరిగింది మాచర్ల పట్టణంలో జనతా వారధి కార్యక్రమం మాచర్ల పట్టణ అధ్యక్షుడు ఓర్సు క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది . ఈ కార్యక్రమంలో పలు సిసి రోడ్ల గురించి ఫిర్యాదులు స్వీకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం కన్వీనర్ బొగ్గవరపు మస్తాన్ రావు గారు కో కన్వీనర్ సురేష్ బాబు శివ కోటయ్య నాయక్ బిజెపి సీనియర్ నాయకులు పోకూరి కాశీపతి పట్టణ ఉపాధ్యక్షుడు మారం వంశీకృష్ణ బిజెపి నాయకులు మొగిలి అద్దయ్య పాల్గొన్నారు

Read More