వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పటిష్టత కి కృషి చేయాలి:మాజీ మంత్రి వర్యులు,పార్టీ పొలిటికల్ అడ్వైజర్ కమిటీ సభ్యులువిడదల రజిని… వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పదవులు పొందిన నాయకులు పార్టీ పటిష్టత కి కృషి చెయ్యాలని మాజీ మంత్రి విడదల రజిని సూచించారు.ఈ రోజు చిలకలూరిపేట పట్టణ అధ్యక్షుడుగా షేక్ దరియవలి,రూరల్ మండలం అధ్యక్షుడుగా దేవినేని శంకర్ రావు,నాదెండ్ల మండలం అధ్యక్షుడుగా మంగు ఏడుకొండలు,యడ్లపాడు మండలం అధ్యక్షుడుగా వడేపల్లి నరసింహా రావు{రాజు}నియమితుపైన సందర్బంగా ఈరోజు మాజీ మంత్రి విడదల రజిని ని వారి నివాసంలో కలసి వారువివిధహోదాల్లోనియమించినందుకు కృతజ్ఞతలు తెలియచేశారు.ఈ సందర్భంగా రజిని మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నీ నమ్ముకొని కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికి పార్టీ అండగా ఉంటుందని తెలిపారు మరియు జగనన్న హయంలో మనం ప్రజలకి చేసిన మేలు,ప్రజల పట్ల మనం చూపిన ప్రేమ నేడు ప్రస్తుత తెలుగుదేశం ప్రభుత్వం లో కరువయ్యాయని,మనం చేసిన మంచి ప్రజల్లో చిరస్థాయిగా…
Author: chilakaluripetalocalnews@gmail.com
హత్య కేసును చేదించిన చిలక లూరిపేట రూరల్ పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి కేసును ఛేదించిన చిలకలూరిపేట రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బి. సుబ్బానాయుడు, సిబ్బందిని అభినందించిన పల్నాడు జిల్లా ఎస్పీ కేసు వివరాలు క్రైమ్ నంబర్: Cr.No.57/2025 u/s 103(1) BNSపోలీస్ స్టేషన్: యడ్లపాడుమృతుడుపేరు: తుని కులదీప్ W/o జగర్నాథ్ కులదీప్వయసు: 35 సంవత్సరాలుకులం: హరిచిరునామా: ఘటిగూడ, నబరంగ్‌పూర్, ఒడిశా రాష్ట్రం. ప్రస్తుతం శ్రీ మంజునాథ్ స్పిన్నింగ్ మిల్, తిమ్మాపురం గ్రామం, యడ్లపాడు మండలం. నిందితుడు పేరు: మంగులు S/o ఆదీలంకవయసు: 25 సంవత్సరాలుకులం: అలీయాచిరునామా: బోలోసరా గ్రామం, ముక్త మలసాహి మండలం, గంజాం జిల్లా, ఒడిశా రాష్ట్రం. ప్రస్తుతం శ్రీ మంజునాథ స్పిన్నింగ్ మిల్, తిమ్మాపురం గ్రామం, యడ్లపాడు మండలం.జరిగిన సంఘటనఈ కేసులో ఫిర్యాది అయిన రుని జగన్నాథ్ (జగన్నాథ్ కులదీప్ భార్య) తన భర్తతో కలిసి యడ్లపాడు మండలం, తిమ్మాపురం గ్రామంలోని శ్రీ మంజునాథ్ స్పిన్నింగ్ మిల్ లో…
ఎడ్లపాడులో విద్యుత్ సరఫరా నిలిపి ప్రాంతాలు 17-06-25మంగళవారం యడ్లపాడు మండలం లోని సొలస, చంగిజ్ ఖాన్ పేట, లింగారావు పాలెం, పుట్టకోట, కొండవీడు, కోట గ్రామములకు ట్రాన్స్ఫార్మర్, లైన్ల మరమ్మత్తుల కారణంగా ఉదయం 9గంటల నుండి మధ్యాహ్నం 1 వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడును కావున విద్యుత్ వినియోగదారులు సహకరించగలరు…. ఆర్ అశోక్ కుమార్,డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, విద్యుత్ శాఖ,చిలకలూరి పేట.
పల్నాడు జిల్లా, పోలీసు కార్యాలయంనరసరావుపేట. పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించిన పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ కంచి శ్రీనివాసరావు ఐపిఎస్… ★ ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుండి కుటుంబ, ఆర్ధిక,ఆస్తి తగాదాలు,మోసం మొదలగు ఆయా సమస్యలకు సంబంధించి 81 ఫిర్యాదులు అందాయి. ★ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా వచ్చిన ఫిర్యాదులకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి త్వరితగతిన పరిష్కరించే విధంగా తక్షణ చర్యలు చేపట్టాలని, ప్రతి ఫిర్యాదుదారుని సమస్య పట్ల శ్రద్ధ వహించి, నిర్ణీత గడువులోగా సదరు ఫిర్యాదులను పరిష్కరించడానికి కృషి చేయాలని శ్రీ ఎస్పీ గారు సూచించారు. ★ రాజుపాలెం మండలం కోట నెమలిపురి గ్రామానికి చెందిన సరికొండ శివ రంగనాయకుల రాజు పిడుగురాళ్ల కు చెందిన జానీ మస్తాన్ అను రియల్ ఎస్టేట్ బ్రోకర్ల…
చిలకలూరిపేట తెలగ,కాపు,బలిజ కళ్యాణ మండపంను యనమదల (గ్రామం),యద్దనపూడి (మండలం),బాపట్ల(జిల్లా) గ్రామ వాస్తవ్యులు మన కాపు సామాజికవర్గానికి చెందిన ప్రముఖ వాస్తు సిద్ధాంతి శ్రీ.ఏలిసెట్టి రాము గారు సందర్శించి కళ్యాణ మండపం ప్రస్తుత వాస్తు పరిశీలించి వారు తమ అమూల్యమైన సలహాలు,సూచనలు తెలియజేశారు.తదుపరి కళ్యాణ మండపంలోని వాస్తులో ఉన్న లోపాలు సరిచెసి మనకు ప్లాన్ ఇస్తాను అని సహృదయంతో తెలియజేశారు.కళ్యాణ మండపమునకు సంబంధించిన వాస్తు శాస్త్రంను ఉచితంగా అందజేస్తాను అని కులం పట్ల ఉన్న అభిమానం తెలియజేశారు.ఈ కార్యక్రమంలో చిలకలూరిపేటకు చెందిన కాపు సోదరులు పోతురాజు హరిష్,ఉసా రమేష్,ఉయ్యూరు నరసింహారావు,ఇర్రి రాఘవ,కమ్మిళి శివా రామకృష్ణ,మండలనేని జగదీష్,మిరియాలు లక్ష్మీ నారాయణ,మారెళ్ళ శ్రీను, రామిశెట్టి శివ ప్రసాద్,బందరు కృష్ణ ప్రసాద్ మరియు రామిశెట్టీ చంద్ర గార్లు పాల్గొన్నారు.
పేటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పాముసాని వెంకట శృతి (9) స.అనే బాలిక మృతి ప్రమాద వివరాలు చిలకలూరిపేటలోని వైఎస్సార్ కాలనీకి చెందిన గాలేటి రాంబాబు (20), తన ద్విచక్రవాహనం (AP 07 CW 5311)పై తన భార్య కావేరి, మేనకోడళ్లు పాముసాని బాల సాహితీ, పామసాని వెంకట శృతిలను ఎక్కించుకొని కనపర్రు చర్చికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. లింగంగుంట్ల వంతెన దాటిన తర్వాత వెనుక నుండి వచ్చిన ఒక బస్సు (AP 07 Z 0207) ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బండి ట్యాంక్‌పై కూర్చున్న వెంకట శృతి బస్సు కింద పడటంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి.రాంబాబుకు, అతని భార్య కావేరికి స్వల్ప గాయాలయ్యాయి. బాల సాహితీకి ఎటువంటి గాయాలు కాలేదు. చికిత్స మరియు మరణం గాయపడిన ముగ్గురిని చికిత్స నిమిత్తం చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.అక్కడ నుండి మెరుగైన చికిత్స కోసం వెంకట శృతిని గుంటూరు జీజీహెచ్‌కు…
బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురందరేశ్వరి గారు, పల్నాడు జిల్లా అధ్యక్షులు శ్రీ ఏలూరి శశికుమార్ గారి పిలుపు మేరకు, పెదకూరపాడు నియోజకవర్గం, అచ్చంపేట మండలంలో మాజీ మండల పార్టీ అధ్యక్షుడు లక్ష్మణాచారి గారి ఆధ్వర్యంలో మండల స్థాయి వికసిత్ భారత్ సంకల్ప సభ నిర్వహించటం జరిగింది.. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఎంపీపీల సంఘం అధ్యక్షులు, అమరావతి ఎంపీపీ, బిజెపి నాయకులు మేకల హనుమంతరావు గారు పాల్గొన్నారు, బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం గడచిన 11 సంవత్సరాల లో సాధించిన విజయాలను ప్రజలకు తెలియ చెప్పాలని సూచించారు, కేంద్ర పధకాలు మారుమూల గ్రామాల్లో ఉన్న అట్టడుగు వ్యక్తికి కూడా అందేలా చూడటమే నరేంద్ర మోడీ గారి లక్ష్యమని తెలిపారు.. కార్యక్రమంలో అమరావతి మండల బిజెపి అధ్యక్షులు వాడపర్తి పుల్లారావు గారు, పలువురు బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు…
పల్నాడు జిల్లా SP ఆదేశాలతో సైబర్ క్రైం పై కార్మికులు కు అవగాహన నేరాలకు పాల్పడితే జైలుకే స్పిన్నింగ్ మిల్లు లో అవగాహన కల్పించిన రూరల్ CI సుబ్బా నాయుడు తిమ్మాపురం తిరుమల స్పిన్నింగ్ మిల్లు లో కార్మికులు కు నేరాల పట్ల అవగాహన కల్పించిన CI సుబ్బా నాయుడు మాదక ద్రవ్యాల వినియోగం, మద్యపానం చేసి మహిళలు పై దాడులు చేయడం, అత్యాచారం చేయడం వంటి నేరాల పట్ల అవగాహన కల్పించారు నేరాలకు అలవాటు పడవద్దని, కార్మికుల కు సుస్థిర మైన భవిష్యత్ ఉందని సూచించారు నేరాలకు పాల్పడితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు
కాపుల్ని బీసీల చేర్చాలని డిమాండ్ నెరవేర్చడం కోసం ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చేందుకు కాపు ముద్దుబిడ్డ సానా ప్రసాద్ చిత్తూరు నుండి అమరావతి వరకు జరుగుతున్న పాదయాత్రకు మద్దతు తెలియజేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు జాతీయ అధ్యక్షుడు మల్లెల శివ నాగేశ్వరరావు సానా ప్రసాద్ కాపు బిడ్డ, ఒంగోలు వాస్తవ్యుడు ఆంధ్రప్రదేశ్ కాపు, బలిజ, తెలగ, ఒంటరి BC రిజర్వేషన్స్ సాధన సమితి వ్యవస్థపక అధ్యక్షుడు 08.06.’25 న చిత్తూరు నుండి అమరావతి వరకు కాపు పెద్దల సౌజన్యముతో, ఎలాంటి రాజకీయ పార్టీలకు గ్రూపులకు అతీతముగా ప్రారంభించిన శాంతియుత పాదయాత్ర తిరుపతికి కాళహస్తి రాజంపేట మీదుగా కడప కర్నూల్ తరువాత ప్రకాశం జిల్లా లో హైవే లోకి వస్తారు తిరుపతిలో రాయలసీమ కాపు పెద్దలతో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకొని తదుపరి రాజంపేట కు చేరుచున్న పాదయాత్ర. చిత్తూరు నుండి రేణిగుంట వరకు కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాల పెద్దలు,…
రెంటపాళ్ళ గ్రామాన్ని సందర్శించిన వైసీపీ నాయకులు పల్నాడు జిల్లా, సత్తెనపల్లి నియోజకవర్గం పరిధిలోని రెంటపాళ్ళ గ్రామంలో ఈనెల 18 వ తారీకు ఉప సర్పంచ్ శివనాగమల్లేశ్వరరావు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి రానున్న, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి. రెంటపాళ్లలో విగ్రహావిష్కరణ పర్యటన లో భాగంగా, గ్రామంలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించిన సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ రెడ్డి ఎమ్మెల్సీ తలసరి రఘురాం , ఎమ్మెల్సీ లెల్ల అప్పిరెడ్డి, మాజీ మంత్రులు విడుదల రజిని, పేర్ని నాని, నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి,గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేశ్వర్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు పార్టీ అనుబంధ విభాగాల బాధ్యులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.









