ప్రముఖ శైవ క్షేత్రంగా పేరుగాంచిన కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామివారిని ప్రముఖ సినీ నటుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత రాజేంద్రప్రసాద్ ఆదివారం ఉదయం దర్శించుకున్నారు

స్వామివారి సన్నిధికి విచ్చేసిన ఆయనకు బీసీ వెల్ఫేర్ శాసనసభ కమిటీ సభ్యులు, నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద బాబు గారు ఆలయ ప్రాంగణంలో స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా త్రికోటేశ్వర స్వామివారికి నిర్వహించిన ప్రత్యేక అభిషేకాలు, పూజా కార్యక్రమాలలో సినీ నటుడు రాజేంద్రప్రసాద్, ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు గారు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.

కోటప్పకొండ వైభవం, మహాశివరాత్రి తిరుణాళ్ల సందర్భంగా చేపడుతున్న విస్తృత ఏర్పాట్ల గురించి ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు గారు రాజేంద్రప్రసాద్‌కు వివరించారు.

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని సుమారు 20 నుంచి 25 లక్షల మంది భక్తులు కోటప్పకొండకు విచ్చేసే అవకాశముందని తెలిపారు.

Share.
Leave A Reply