శ్యావల్యాపురం మండలం వేల్పూరు గ్రామంలో జనతా పార్టీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది

కేంద్ర రాష్ట్ర బిజెపి పార్టీ ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశి కుమార్ గారు శావల్యాపురం మండల సీనియర్ నాయకులు అడుసుమల్లి వీరేంద్ర గారు ఈపూరు మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ శ్రీ గోరంట్ల సత్యనారాయణ గారు వినుకొండ నియోజకవర్గం మాజీ కన్వీనర్ శ్రీ యార్లగడ్డ లెనిన్ కుమార్ గారి సూచనల మేరకు ఈరోజు జనతా వారిది కార్యక్రమాన్ని శావల్యాపురం మండల అధ్యక్షుడు గట్టుపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వేల్పూరు గ్రామంలో నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా వేల్పూరు గ్రామంలో ఇంటర్ ఇంటర్మీడియట్ విద్యకు సంబంధించి జిల్లా పరిషత్ హై స్కూల్ ప్లస్ టు ని రెండు సంవత్సరాల క్రితం ప్రభుత్వం మంజూరు చేసినప్పటికీ ఇంతవరకు లెక్చరర్స్ ని లేడీస్ హాస్టల్ మంజూరు చేయలేదని వచ్చే విద్యా సంవత్సరానికైనా లెక్చరర్స్ ని లేడీస్ హాస్టల్ మంజూరు చేయాలని హెడ్మాస్టర్ సుభాని గారు విద్యార్థిని విద్యార్థులు దరఖాస్తు ఇవ్వడం జరిగింది అలాగే కార్యక్రమంలో భాగంగా భాగంగా ఎస్సీ కాలనీ మాదికి పల్లెవాసులు ఆ యొక్క కాలనీలో రక్షిత మంచినీటి సరఫరా అసలుకు రావటం లేదని రెండు మూడు బిందెలు మాత్రమే వస్తున్నాయని కొన్ని కలెక్షన్లకు అసలు నీరు రావడంలేదని వచ్చేటువంటి నీరు కలుషితంగా ఉందని త్రాగటానికి పనికిరాదని దరఖాస్తు ఇవ్వడం జరిగింది. అలాగే మాదిగ పల్లెలో ఉన్నటువంటి అంగన్వాడీ సెంటర్ కి ప్రహరీ గోడ నిర్మాణం కోసం అలాగే వంటగది కోసం అలాగే నీటికి మోటార్ కోసం ప్రభుత్వం వారు మంజూరు చేయాలని అంగన్వాడీ కార్యకర్త దరఖాస్తు ఇవ్వడం జరిగింది. అలాగే మాదిగ పల్లె వాసులు రెండు ప్రక్కల సైడ్ డ్రైనేజీ నీరు నిలువ ఉండటం వల్ల అంటువ్యాధులు వచ్చేటువంటి ఇబ్బందుందని దరఖాస్తు ఇవ్వడం జరిగింది. కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు కాకుమను నాగేశ్వరరావు గారు మైనారిటీ నాయకుడు మక్తుమ్ సాహెబ్ కాలనీవాసులు పాల్గొనడం జరిగింది

Share.
Leave A Reply