Author: chilakaluripetalocalnews@gmail.com

పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం రెంటచింతల మండలం రెంటచింతల గ్రామంలోని ఎంపీడీవో ఆఫీసు నుండి బస్టాండ్ వరకు తిరంగా ర్యాలీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది పహాల్గం దాడికి నిరసనగా భారత సైనికుల శౌర్య పరాక్రమానికి నిదర్శనంగా మన భారత జాతి ఐక్యతను చాటుతూ పాకిస్తాన్ ఉగ్రములకు మన దేశ సైనిక దళాల శక్తిని నిరూపించిన మన ప్రియతమ నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు దగ్గుపాటి పురందేశ్వరి గారి ఆదేశాల మేరకు రెంటచింతల మండల బిజెపి అధ్యక్షులు బోయ నాగిరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి మాచర్ల నియోజకవర్గ నాయకులు పోకూరి కాశీపతి పాల్గొన్నారు ఆయన మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం దేశ రక్షణకు పెద్ద పీట వేస్తుందని యుద్ధంలో చనిపోయిన భారత సైనికులకు ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు పాశం మట్టారెడ్డి, అనంతవరపు గోపి, సురేష్ కుమార్…

Read More

చిలకలూరిపేట రూరల్ పోలీస్ లను ఆశ్రయించిన పసుమర్రు రైతులు నమ్మించి నిలువునా మోసం చేసిన కంపెనీ పై చర్యలు తీసుకోండి—రైతులు పొగాకు వెయ్యమని అధిక ధరకు కొనుగోలు చేస్తాం అని నమ్మించి రైతులను మోసం చేసిన GPI కంపెనీ పై చర్యలు తీసుకోవాలని చిలకలూరిపేట రూరల్ పోలీసు స్టేషన్లో పిర్యాదు చేసిన పసుమర్రు గ్రామం పొగాకు రైతులు. ఫిర్యాదుదారులు :-జక్కంపూడి అశోక్మరియు వారితో పాటు నష్టపోయిన పసుమర్రు రైతులుఅంబటి శంకర్బైపినీడి శివయ్యప్రత్తిపాటి శేషయ్యమందపల్లి బుల్లిబాబుగడిపూడి వెంకటరాయుడుబోయపాటి నాగేశ్వరరావుగొట్టిపాడు శేషుబాబుకోట బాబుగొట్టిపాటి విజయ్గొట్టిపాటి వాసుషేక్ కరీంజక్కంపూడి వినయ్ రామ్గరికపాటి చంద్రాదిత్యన్యాయవాది గదే రవితేజ తదితరులు ఉన్నారు

Read More

పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం పమిడిపాడులో హత్య గొర్రెలు విషయంలో ఎదురెదురుగా ఉన్న రెండు కుటుంబాల మధ్య ఘర్షణ ఫిరంగుల కోటేశ్వరరావు (40సం) తలపై కర్రతో దాడి చేసిన ప్రత్యర్థి ఘటనా స్థలంలోనే మృతి చెందిన ఫిరంగుల కోటేశ్వరరావు (40సం) పమిడిపాడుకి చేరుకుని విచారిస్తున్న నరసరావుపేట రూరల్ పోలీసులు.

Read More

తిరంగ ర్యాలీలో అందరూ భాగస్వాములు కావాలి. కూటమి నాయకులు. చిలకలూరిపేట పట్టణంలోని ప్రత్తిపాటి క్యాంప్ కార్యాలయంలో ఈరోజు ఉదయం కూటమి నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ఆపరేషన్ సిందూర్ విజయవంతం చేసిన సైనిక దళాలకు సంఘీభావంగా రేపు అనగా సోమవారం సాయంత్రం 4 గంటలకు స్థానిక యన్.ఆర్.టి. సెంటర్ లోని రైతు బజార్ ఎదురుగా ఉన్న మధర్ థెరిసా విగ్రహం నుండి గడియార స్థంభం వరకు ర్యాలీ నిర్వహిస్తున్నట్టు కూటమి నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీమంత్రి, శాసన సభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారు ప్రారంభించి పాల్గొన్నట్టు తెలిపారు. యుద్ధంలో పాకిస్తాన్ పై ఘనవిజయం సాధించిన భారత సైన్యానికి ధన్యవాదాలు తెలుపుతూ కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతి పరులు, దేశ భక్తి గల ప్రతీ పౌరుడు పాల్గొని వీర జవానుల మృతికి, పహాల్గామ్ ఉగ్ర దాడి మృతులకు సంతాపం తెలుపుతూ, ఆపరేషన్ సింధూర్…

Read More

పల్నాడు జిల్లా పిడుగురాళ్ళ పట్టణంలోని ఆర్ అండ్ బి బంగ్లా నుండి మార్కెట్ యార్డ్ వరకు చేపట్టిన తిరంగా ర్యాలీలో పాల్గొన్న గురజాల శాసనసభ్యులు ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు టిటిడి పాలక మండల సభ్యులు జంగా కృష్ణమూర్తి ఈ సందర్భంగా యరపతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ పాకిస్తాన్ నడ్డి విరిచి ఆపరేషన్ సింధూర్ ని విజయవంతంగా పూర్తి చేసినందుకు త్రివిధ దళాలకు అభినందనలు తెలియజేస్తున్నమన్నారు భారత సైనికుల సంఘీభావంగా భారతదేశమంతటా మరియు ఆంధ్ర రాష్ట్రంలోని అన్ని నియోజక వర్గాల్లో ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో ఘనంగా తిరంగా యాత్ర చేపట్టాం దేశ ప్రజలంతా సైనిక దళాల పరాక్రమం చూశారు ఉగ్రవాదంపై పోరాడుతున్న సైనిక దళాలకు సెల్యూట్ ప్రతి భారతీయ పౌరుడికి జాతీయ జెండా చూడగానే దేశ భక్తి, ఉద్వేగం ఉప్పొంగుతాయన్నారు భారతీయుల నినాదం ఒకటే అని దేశమంతా ఐక్యంగా ఉండాలని సమైక్యంగా ఉండాలని ఉక్రముకలను తరిమికొట్టాలన్నారు ప్రధానమంత్రి మోడీ గారి ఆధ్వర్యంలో ప్రపంచంలోనే…

Read More

నాదెండ్ల మండలం తుబాడు గ్రామ వాస్తవ్యులు గాదె బాల సౌర్రెడ్డి గారు నిన్న స్వర్గస్తులైనారు. ఆ విషయం తెలుసుకొని వారి స్వగృహం వద్ద ఉన్న వారి పార్థివ దేహానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించిన శాసనమండలి సభ్యులు శ్రీ మర్రి రాజశేఖర్ గారు..

Read More

చిరంజీవి 157 వ సినిమా సందర్భంగా ప్రత్యేక పూజలు డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్టు చేయనున్న మెగాస్టార్ చిరంజీవి 157 వ సినిమాకు స్క్రిప్ట్ రెడీ అయింది. ఈ స్క్రిప్టును బొప్పూడి ప్రసన్నాంజనేయ స్వామి గుడిలో ఉంచి పూజలు నిర్వహించిన డైరెక్టర్ అనిల్ రావిపూడి, బ్రహ్మయ్యా, కోటేశ్వరరావు, సూర్య, సాయి కృష్ణ, , శిరీష వారి స్నేహితులు మరియు కుటుంబ సభ్యులు..

Read More

చిలకలూరిపేట మండలం లో వర్షం బీభత్సం మురికిపూడి లో పిడుగు పడి పెద్ద ప్రమాదం బయటపడ్డ పరిస్థితి శనివారం రాత్రి ఉరుము, మెరుపులతో కురిసిన భారీ వర్షం దాటికి చిలకలూరిపేట మండలం మురికిపూడి గ్రామంలో మూడు అంతస్తుల భవనం మీద పిడుగుపడింది. పిడుగుపాటు కు దెబ్బతిన్న మూడంతస్తుల భవనం. పిడుగు పడ్డ ఆ నివాసంలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఇంట్లో టీవీ ఫ్రిడ్జ్ ఫ్యాన్లు అన్ని కాలిపోయాయి

Read More

శ్రీ త్రికోటేశ్వర స్వామి ఆలయంలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి దంపతులు ప్రత్యేక పూజలు ప్రముఖ పుణ్యక్షేత్రం కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామి ఆలయంలో ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ జీవి ఆంజనేయులు గారు – లీలావతి దంపతులు శనివారం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన చీఫ్ విప్ జీవి గారి దంపతులకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి మూలవిరాట్‌కు ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. లోక కళ్యాణార్థం, ప్రజల శ్రేయస్సు కోరుతూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు వారికి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జీడీసీసీ చైర్మన్ మక్కెన మల్లికార్జున రావు గారు నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Read More

బ్యాటరీ దొంగలు అరెస్ట్. బోప్పూడి గ్రామ పరిదిలోని హెచ్ పి పెట్రోల్ బంక్ వెనుక గల ఖాళీ స్థలంలో పార్క్ చేసి వున్న టిప్పర్ లారీ యొక్క రెండు బ్యాటరీలును 16.05.2025 వ తేదీ మద్యాహ్నం దొంగతనం చేసినట్లు నాదెండ్ల మండలం, గణపవరం గ్రామానికి చెందిన మలిశెట్టి శ్రీనివాసరావు చిలకలూరిపేట రూరల్ పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేయగా చిలకలూరిపేట రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్సై జి. అనిల్ కుమార్ కేసు నమోదు చేసి రెండు గంటల వ్యవదిలో ముద్దాయిలు అయిన 1. సయ్యద్ బాబు s/o [లేటు] అబ్బు @ అబ్దుల్లా, 33 సం పోలేరమ్మ గుడి వద్ద, మిలటరీ కాలనీ, ఒంగోలు పట్టణం.

Read More