రాష్ట్రీయ జన క్రాంతి పార్టీ ఆధ్వర్యంలో నందమూరి తారక రామారావు 102 వ జయంతి వేడుకలు
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, కీర్తిశేషులు, స్వర్గీయ నందమూరి తారక రామారావు 102 వ జయంతి వేడుకలను రాష్ట్రీయ జన క్రాంతి పార్టీ ఆధ్వర్యంలో తిట్కో గృహ సముదాయంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. రాముడు, కృష్ణుడు వంటి పౌరాణిక పాత్రలతో తెలుగు వారి హృదయాలలో శాశ్వతంగా ఆరాధ్య దైవంగా నిలిచిన వ్యక్తి నందమూరి తారక రామారావు అని రాష్ట్రీయ జనకాంతి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు షేక్ గౌస్ అన్నారు. మరొక ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ న్యాయవాది బైరా హనుమంతరావు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రత్యేక ప్రతి ఏటా మే 28న మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతిని రాష్ట్ర వేడుకగా నిర్వహించుకోవాలని పేర్కొంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం ఒక గొప్ప మంచి పరిణామం అని అన్నారు. తదనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రీయ జన క్రాంతి పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ షేకాలి, పట్టణ అధ్యక్షులు షేక్ మౌలాలి, తిడుకో గృహ సముదాయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు



